విడుదల తేదీ ఖరారు చేసుకున్న ‘యాత్ర’ !

Published on Dec 15, 2018 5:50 pm IST

దివంగత వైఎస్.రాజశేఖర్ రెడ్డిగారి బయోపిక్ ను ‘యాత్ర’ పేరుతో మహి.వి.రాఘవ్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. వైఎస్సార్ పాత్రను మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి పోషిస్తున్నారు. మమ్ముట్టి బాగా ఇన్ వాల్వ్ అయి వైఎస్సార్ రోల్ లో నటిస్తున్నారని చెబుతుంది చిత్రబృందం. వైఎస్సార్ హావభావాలు దగ్గరనుంచి, ఆయన మాట తీరు, ఆయన నడక ఇలా ప్రతి విషయాన్ని ఎంతో జాగ్రత్త తీసుకుని నటిస్తున్నారట.

కాగా ‘యాత్ర’ చిత్రం ఫిబ్రవరి 8న విడుదలవుతుందని తాజాగా చిత్రబృందం పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించింది. ఇక వైఎస్సార్ తండ్రి రాజారెడ్డిగారి పాత్రలో జగపతిబాబు కనిపించనున్నారు. అలాగే సుహాసిని, పోసాని కృష్ణ మురళి, రావు రమేష్ లతో పాటు రంగస్థలం చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న అనసూయ కూడా ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. 70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని విజ‌య్ చిల్లా, శశిదేవి రెడ్డిలు నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :