స్టార్ హీరో సినిమా జీ స్టూడియోస్ చేతికి

Published on Jul 10, 2019 9:01 pm IST

‘కె.జి.ఎఫ్’ సినిమాతో కన్నడ సినిమాలకు దేశవ్యాప్తంగా క్రేజ్ పెరిగింది. అందుకే అక్కడి స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ పెట్టి నిర్మించే తమ సినిమాల్ని ఇతర భాషల్లోకి కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కిచ్చ సుదీప్ చేస్తున్న ‘పహిల్వాన్’ సినిమా పరిస్థితి ఇదే. దీన్ని అన్ని ప్రధాన భాషల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఒరిజినల్ లాంగ్వేజ్ కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్ సంస్థ జీ స్టూడియోస్ విడుదలచేయనుంది. ఈ డీల్ విలువ భారీ మొత్తంలోనే ఉండొచ్చని తెలుస్తోంది. ఎస్.కృష్ణ డైరెక్షన్లో రూపొందిన ఈ చిత్రాన్ని ఆగష్టు నెలలో ప్రేక్షకులకు అందివ్వనున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి సైతం కీలక పాత్రలో నటించారు.

సంబంధిత సమాచారం :

X
More