రెండవ రోజు డ్రాప్ అయిన జీరో కలక్షన్స్ !

Published on Dec 23, 2018 1:49 pm IST

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన ‘జీరో’ చిత్రం భారీ అంచనాల మధ్య శుక్రవారం విడుదలై అంచనాలను అందుకోలేకపోయింది. మిక్సడ్ రివ్యూస్ ఈసినిమా కలెక్షన్స్ ఫై ప్రభావం చూపించింది. 4000 స్క్రీన్లలకు పైగా విడుదలైన ఈచిత్రం తొలి రోజు కేవలం 20కోట్ల వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురి చేసింది.

ఇక రెండో రోజు కూడా కలెక్షన్స్ డ్రాప్అయ్యాయి. ఈచిత్రం సెకండ్ డే 18.22 కోట్ల వసూళ్లను రాబట్టి రెండు రోజులకుగాను ఇండియా లో 38.36కోట్ల వసూళ్లను ను రాబట్టింది. షారుక్ కు వున్నా ఫాలోయింగ్ కు ఈ కలెక్షన్లు చాలా తక్కువేనని చెప్పాలి.

ఇక గత కొంత కాలంగా భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్న షారుక్ ఖాన్ కు ఈ చిత్రం కూడా నిరాశను మిగిల్చింది. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గౌరీ ఖాన్ నిర్మించింది.

సంబంధిత సమాచారం :