సమీక్ష : అభిషేక్ బచ్చన్ “దాస్వి” ౼ హిందీ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో

సమీక్ష : అభిషేక్ బచ్చన్ “దాస్వి” ౼ హిందీ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో

Published on Apr 8, 2022 3:04 AM IST

విడుదల తేదీ : ఏప్రిల్ 07, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: అభిషేక్ బచ్చన్, యామీ గౌతమ్, నిమ్రత్ కౌర్, డానిష్ హుస్సేన్, రవీష్ శ్రీవత్స

దర్శకత్వం : తుషార్ జలోటా

నిర్మాతలు: దినేష్ విజన్, సందీప్ లేజెల్

సంగీత దర్శకుడు: సచిన్ సంఘ్వీ, జిగర్ సారయ్య

సినిమాటోగ్రఫీ: కబీర్ తేజ్‌పాల్

ఎడిటర్ : సురేష్


బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ హీరోగా మళ్లీ కాస్త గ్యాప్ తీసుకొని చేసిన లేటెస్ట్ సినిమా “దాస్వి”. ఒక ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ లో ప్లాన్ చేసిన ఈ సినిమా లేటెస్ట్ గా జియో సినిమా మరియు నెట్ ఫ్లిక్స్ లలో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ గా వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్ష లో తెలుసుకుందాం రండి.

కథ :

ఈ సినిమా ఒక కల్పిత ప్రాంతం అయినటువంటి హామిత్ ప్రదేశ్ లో సెట్ చేయబడి ఉంటుంది. అయితే అక్కడ ముఖ్యమంత్రి గా రామ్ చౌదరి(అభిషేక్ బచ్చన్) కనిపిస్తాడు. మరి ఈ రామ్ చౌదరి ఎలాంటి చదువు లేకుండా సీఎం అయ్యి విద్యా శాఖలో ఒక భారీ స్కామ్ చేసిన నేపథ్యంలో అతడిని కోర్టు జైలు పాలు చేస్తుంది. ఇక ఇక్కడ నుంచి తన స్థానాన్ని బిమ్లా దేవి(నిమ్రత్ కౌర్) చేపడుతోంది. ఇక్కడ నుంచి ఈమె తన భర్తని బయటకి తెచుకోగలిగిందా? ఈ క్రమంలో రామ్ కి ఎదురైన ఒక వినూత్న సవాలు ఏంటి? దాన్ని చదువు లేని అతడు పాస్ అయ్యాడా లేదా? ఈ సినిమాలో చదువుకు, రాజకీయాలు కి సంబంధించి ఏమన్నా సందేశం ఉందా అనేవి తెలియాలి అంటే ఈ సినిమాని ఓటిటి లో చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

బాలీవుడ్ లో ఉన్నటువంటి నటన పరంగా మోస్ట్ అండర్ రేటెడ్ హీరోస్ లో అభిషేక్ బచ్చన్ కూడా ఒకరు. అది ఎందుకో ఈ సినిమా తో కూడా ప్రూవ్ అవుతుంది అని చెప్పాలి. సినిమా అంతా కూడా తానే వన్ మాన్ షో చేశాడని చెప్పొచ్చు. ఒక అవినీతి పరుడైన రాజకీయ నాయకుడిగా సీఎం గా చాలా ఫైనెస్ట్ పెర్ఫార్మన్స్ ని తాను కనబరిచాడు. అలాగే పలు సన్నివేశాల్లో అయితే తనలోని కామెడీ యాంగిల్ గాని భావోద్వేగాలు గాని ఆకట్టుకుంటాయి.

ఇలా ఈ సినిమా నేపథ్యంలో కావాల్సిన అంతా తన నుంచి జూనియర్ బచ్చన్ ఇచ్చేసాడు. ఇక అలాగే ఈ సినిమాలో దాదాపు అభిషేక్ తో ట్రావెల్ అయ్యే లేడీ జైలర్ పాత్రలో యంగ్ నటి యామీ గౌతమ్ కనిపిస్తుంది. ఈమె రోల్ బాగుంది అలాగే దానికి తగ్గట్టు గానే యామి మంచి నటనను కనబరిచింది. అలాగే అభిషేక్ తో ఆమెకి ఉండే పలు కామెడీ సీన్స్ మంచి ఎంటర్టైనింగ్ గా అనిపిస్తాయి. అలాగే అభిషేక్ పై టెన్త్ ప్రిపేర్ సీన్స్ కూడా బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమా స్టార్టింగ్ గాని సినిమా తాలూకా ప్రొసీడింగ్స్ గాని మొదట్లో చాలా ఆసక్తికరంగా అనిపిస్తాయి. కానీ తర్వాత తర్వాత మాత్రం కథనంలో చాలా తేడా కనిపిస్తుంది. ఒక సోషల్ డ్రామా ని కాస్త కామెడీ జోడించి సెటైరికల్ గా చూపించే ప్రయత్నం చాలా సిల్లీ గా మారిపోయింది అని చెప్పాలి.

చాలా మేర సన్నివేశాల్లో ఎక్కడా అంత సీరియస్ నెస్ కనిపించదు. ఎంత కామెడీ గా ప్రెజెంట్ చెయ్యాలని చూసినా ఆయా సన్నివేశాలకి కరెక్ట్ నరేషన్ తప్పనిసరి కానీ వాటిని కూడా చాలా సిల్లీ గా ప్రెజెంట్ చేశారు. అలాగే జైల్ లో అభిషేక్ పై కొన్ని సీన్స్ అయితే మరీ ఓవర్ గా అనిపిస్తాయి.

అలాగే పాలిటిక్స్ పరంగా కొన్ని సన్నివేశాల్లో మరింత బలమైన ఎఫెక్టివ్ కథనం చూపించాల్సి ఉంది కాని అవి కూడా ఎక్కడా కనిపించవు. అలాగే ఈ సినిమాలో మరో పెద్ద డ్రా బాక్ గా క్యారెక్టరైజేషన్ అని చెప్పాలి. మెయిన్ లీడ్ తప్ప మిగతా పాత్రలన్నీ చాలా సింపుల్ గా పేలవంగా కనిపిస్తాయి.

సాంకేతిక వర్గం :

ఈ సినిమాలో నిర్మాణ విలువలు మాత్రం సాలిడ్ గా ఉన్నాయని చెప్పాలి. సినిమాలో కనిపించే సెటప్ అంతా సహజంగా కనిపిస్తుంది. అలాగే టెక్నికల్ టీం విషయానికి వస్తే మ్యూజిక్ గాని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గాని బాగున్నాయి. అలాగే సినిమాటోగ్రఫీ, డైలాగ్స్ బాగున్నాయి. ఎడిటింగ్ బాగాలేదు. ఇక దర్శకుడు తుషర్ జలోతా విషయానికి వస్తే తాను తీసుకున్న బాక్ డ్రాప్ నిజంగా చాలా బాగుంది కానీ ఓవర్ సిల్లీ ట్రీట్మెంట్ మూలాన తన సినిమా సరైన దారిలో ప్రెజెంట్ కాలేదు. కానీ మెయిన్ లీడ్ ని మాత్రం తాను బాగా చూపించారు. మిగతా వర్క్ మొత్తం డిజప్పాయింట్ చేశారు.

తీర్పు :

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “దాస్వి” చిత్రం అనుకున్న స్థాయిలో ఆకట్టుకునే సినిమా అయితే కాదని చెప్పాలి. ఒక్క అభిషేక్ బచ్చన్ నటన తనపై కొన్ని కామెడీ సీన్స్ తప్ప అసయో సినిమాలో గొప్పగా చెప్పుకొనే అంశమే లేదు. కంప్లీట్ గా డైరెక్టర్ వైఫల్యం వల్ల మంచి సబ్జెక్ట్ ని బాగా దెబ్బ తీసింది. ఇక ఇంతకు మించి చెప్పడానికి కూడా ఏమి లేదు. ఒకవేళ మీరు అభిషేక్ నటన కోసం చూడాలి అనుకుంటే చూడొచ్చు తప్ప ఈ సినిమా ని మీ వాచ్ లిస్ట్ నుంచి స్కిప్ చేసేస్తేనే బెటర్.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team 

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు