ఆడియో రివ్యూ : గబ్బర్ సింగ్ – ‘కెవ్వు కేక’ అనిపించే ఆల్బం


పవర్ స్టార్ పవన్ కళ్యాన్ నటించిన చిత్రం “గబ్బర్ సింగ్” ఆడియో విడుదలైంది. ఈ వేడుకను ఘనంగా చేస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. పరిశ్రమలో పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం లో శ్రుతి హాసన్ కథానాయికగా నటించగా హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ మీద గణేష్ బాబు నిర్మించిన ఈ చిత్ర ఆడియో ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

1. పాట : దేఖో దేఖో గబ్బర్ సింగ్
గాయకులు : బాబా సెహగల్, నవీన్ మాధవ్
రచయిత : రామజోగయ్య శాస్త్రి ,రాప్ :బాబా సెహగల్


ఏ మాత్రం అనుమానం లేకుండా ఈ పాట ఆల్బం లో ప్రధమ స్థానం లో నిలిచే పాట. దేవి శ్రీ తనదయిన సంగీతం అందించారు బాబా సెహగల్ తన గాత్రం తో మాయాజాలం చేశారు. ఇది హీరో ఇంట్రడక్శన్ సాంగ్ గా ఉండబోతుంది. రామ జోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం పవన్ కళ్యాణ్ కి సరిగ్గా సరిపోయేలా ఉన్నాయి. అభిమానులను అలరించేలా సాహిత్యం అందించారు.

2. ఆకాశం అమ్మాయైతే
గాయకులు: శంకర్ మహదేవన్, గోపిక పూర్ణిమ
సాహిత్యం: చంద్రబోస్


శంకర్ మహదేవన్ పాడిన ఈ పాట కోరస్ హమ్మింగ్ తో మొదలవుతుంది. దేవి శ్రీ ప్రసాద్ మిక్సింగ్ చాలా బావుంది. ఈ మెలోడి పాట అందరికీ నచ్చడం మాత్రం ఖాయం. హరీష్ శంకర్ మార్కు చిత్రీకరణ కూడా బావుంటే ఇంకా బావుంటుంది. చంద్రబోస్ సాహిత్యం కూడా వీటికి తోడవడంతో మంచి మెలోడి సాంగ్ రెడీ అయ్యింది. హోలా హోలా ఈ బీట్ బావుంది.

3. మందు బాబులం
గాయకులు: కోటశ్రీనివాసరావు
సాహిత్యం: సాహితి


తాగుబోతుల గురించి ఒక తాగుబోతు చెప్పే గమ్మత్తైన బిట్ సాంగ్. కల్లు కాంపౌండులో సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు పాడిన పాట. కోట శ్రీనివాసరావు గతంలో కూడా ఒక పాడారు. ఆ పాట స్థాయిలోనే ఈ పాట కూడా ఉంది. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులను బాగా అలరిస్తుంది ఈ పాట. దేవి శ్రీ ప్రసాద్ మాస్ బీట్స్ కూడా బావున్నాయి.

4. పిల్లా
గాయకులు: పవన్ కళ్యాణ్, వడ్డేపల్లి శ్రీనివాస్
సాహిత్యం: దేవి శ్రీ ప్రసాద్


ఈ పాట పవన్ కళ్యాణ్ ట్రేడ్ మార్క్ డైలాగులతో మొదలవుతుంది. గాయకుడు వడ్డేపల్లి శ్రీనివాస్ ఫుల్ ఎనర్జీతో పాడారు. దేవి శ్రీ ప్రసాద్ మాస్ బీట్స్ థియేటర్లో అభిమానుల చేత డాన్సు వేయించడం మాత్రం ఖాయం అనిపిస్తుంది. వీటికి తోడు దేవి శ్రీ ప్రసాద్ తన మార్కు సాహిత్యం బాగా ఆకట్టుకుంటుంది. ‘పిల్లా నువ్వు లేని జీవితం బ్రేక్ లేని బైకు రయ్యుమంటూ తోలడం’ వంటి లైన్ అందరినీ ఆకట్టుకుంటాయి.

5. దిల్ సే
గాయకులు: కార్తీక్, శ్వేత మోహన్
సాహిత్యం: భాస్కరభట్ల


ఈ ఆల్బంలోని మరో మెలోడి పాట వినసొంపైన మ్యూజిక్ తో ప్రారంభమవుతుంది. కార్తీక్, శ్వేత మోహన్ ఇద్దరూ చాలా బాగా పాడారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం మెలోడియస్ గా ఉంది. ఈ పాట విదేశాలలో చిత్రీకరిస్తే పాట ఇంకా బావుంటుంది. మొదటి సరిగానే బాగా నచ్చే పాట ఇది. భాస్కరభట్ల సాహిత్యంలో ఎలాంటి ద్వందార్ధాలు లేకుండా బావున్నాయి.

6. కెవ్వు కేక
గాయకులు: మమత శర్మ, ఖుషి మురళి
సాహిత్యం: సాహితి


దబంగ్ సినిమాలో మున్ని బద్నాం పాట స్థానంలో ఉండే ఐటెం సాంగ్ ఎలా ఉండాలి. ఐటెం సాంగ్స్ దేవి శ్రీ ప్రసాద్ పెట్టింది పేరు. ఆయన పాటలు కూడా కెవ్వు కేక అనిపిస్తాయి. అందుకే ఈ పాటకి కెవ్వు కేక అని రాసుకున్నారేమో. ఫుల్ జోష్ తో సాగే ఈ పాటని మమత శర్మ, మురళి ఇద్దరు అదే జోష్ తో పాడారు. సాహితి సాహిత్యం మాస్ ప్రేక్షకులను ఆకట్టుకేనేలా రాసుకున్నారు. దేవి శ్రీ ప్రసాద్ గత ఐటెం సాంగ్స్ కి ఏ మాత్రం తీసి పోకుండా ఈ పాట కూడా ఉంది.

తీర్పు: పవాన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్లుగా మాస్ మరియు మెలోడి పాటలతో ఈ ఆల్బం రూపొందింది. దేఖో దేఖో అభిమానులని అలరించగా, దిల్ సే యువకులను ఆకట్టుకుంటుంది. పిల్లా, కెవ్వు కేక, మందు బాబులం పాటలు మాత్రం మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. గబ్బర్ సింగ్ దేవి శ్రీ ప్రసాద్ మార్కు పాటలతో అందరినీ అలరించే ఆల్బం.

అనువాదం : అశోక్ రెడ్డి

Clicke Here For Gabbar Singh Audio Review in English

సంబంధిత సమాచారం :

More