సమీక్ష: బూతు బాచిలర్స్

విడుదల తేది : 06 జనవరి 2012
123 తెలుగు .కామ్ రేటింగ్ : 1.25/5
డైరెక్టర్ :  జకీర్
ప్రొడ్యూసర్ :  మై  హుస్సేన్ ,  వై . శ్రీరామ్
మ్యూజిక్ డైరెక్టర్ : సందీప్
నటీ నటులు: జకీర్, అజయ్, శాంతి, అప్పు, విక్కీ, నిఖిల్,  అలీ

గతంలో బాచిలర్స్ అనే సినిమా తీసి ఒక వర్గం ప్రేక్షకులను అలరించిన చిత్ర దర్శకుడు జకీర్ హీరోగా నటించి తానే స్వయంగా డైరెక్ట్ చేసిన చిత్రం బాచిలర్స్-2. ఎమ్.వై. హుస్సేన్ మరియు వై.శ్రీరామ్ నిర్మించిన ఈ చిత్రం ఈ రోజే విడుదలవగా ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.

కథ:

జీవా (జీవా) మరియు అతని గ్యాంగ్ స్వామినాథన్ అనే ఒకాయన కూతురుని కిడ్నాప్ చేస్తారు. ఈ కిడ్నాప్ గ్యాంగ్ ని పట్టుకోవడానికి ఏసీపి సత్య ప్రయత్నిస్తుంటాడు. అజయ్ (అవీన్) , అప్పు (త్రుప్తి శర్మ) , విక్కీ (జకీర్), నిఖిల్ (సుమిత్ రాయ్) నలుగురూ ప్రాణ స్నేహితులు హైదరాబాదులోని ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. ఒకసారి పార్టీలో ఎంజాయ్ చేస్తూ తాగిన మైకంలో అనుకోని ప్రమాదంలో ఇరుక్కుంటారు. ఆ ప్రమాదం నుండి బయట పడే క్రమంలో జీవా గ్యాంగ్ కిడ్నాప్ చేసిన కేసులో ఇరుక్కుంటారు. ఈ ప్రమాదాల నుండి ఎలా బయట పడ్డారు అనేది మిగతా చిత్ర కథ.

ప్లస్ పాయింట్స్:

హీరోగా విక్కీ పాత్రలో చేసిన జకీర్ కి నటనలో కొంత అనుభవం ఉండటంతో కొంత వరకు పర్వాలేదనిపించాడు. అజయ్ గా అవీన్ కూడా పర్వాలేదనిపించాడు. హీరోయిన్ శాంతి కూడా ఆమె స్థాయికి తగ్గట్లు బాగానే చేసింది. అలీ 4 విభిన్నమైన గెటప్ లలో కనిపించి నవ్వించడానికి ప్రయత్నించాడు కాని అస్సలు నవ్వించలేకపోయాడు.

మైనస్ పాయింట్స్:

అప్పు పాత్ర చేసిన త్రుప్తి శర్మ నటన అస్సలు బాగాలేకపోగా బూతు డైలాగులు చెప్తూ చిరాకు తెప్పించాడు. నిఖిల్ గా నటించిన సుమిత్ రాయ్ ఇతనికి నటించడానికి పెద్దగా స్కోప్ లేదు. ఇచ్చిన నాలుగైదు సన్నివేశాలు అస్సలు బాగా చేయలేకపోయాడు. ఏసీపి సత్య ఈయనను ఎందుకు తీసుకున్నారో దర్శకుడికే తెలియాలి. మిగతా నటులందరూ సి గ్రేడ్ స్థాయిలో ఉన్నారు.

సాంకేతిక వర్గం:

చిత్ర దర్శకుడు జకీర్ సినిమా తీయడం కంటే బూతు మీద బాగా ఇంట్రెస్ట్ చూపించాడు. సెన్సార్ వారు కూడా చాలా డైలాగులు కత్తెర వేసారు. డైలాగులు కూడా చాలా వరకు బూతు పురాణం. ఎడిటింగ్ మరియు సినిమాటోగ్రఫీ రెండు అస్సలు బాగాలేవు. పాటల విషయానికి వస్తే కొన్ని హిందీ పాటల మ్యూజిక్ ఉన్నది ఉన్నట్లు అలాగే వాడుకున్నారు.

తీర్పు:

ఒక వర్గం ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని తీసారు. సెన్సార్ వారు కూడా బాగా కత్తెర్లు వేయడంతో పాపం వారిని కూడా చేరుకోలేకపోయింది.

అశోక్ రెడ్డి. ఎమ్

123తెలుగు.కాం రేటింగ్: 1.25/5

Bachelors 2 Review English Version

సంబంధిత సమాచారం :