ఆడియో రివ్యూ : రొటీన్ గా అనిపించే బాడీగార్డ్

ఆడియో రివ్యూ : రొటీన్ గా అనిపించే బాడీగార్డ్

Published on Dec 14, 2011 1:37 PM IST

విక్టరీ వెంకటేష్ మరియు త్రిషా ‘బాడీగార్డ్’ చిత్రంతో అలరించడానికి త్వరలో మనముందుకి రాబోతున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి బెల్లంకొండ సురేష్ నిర్మాత. నిన్న ఈ చిత్ర ఆడియో వేడుక శిల్ప కళా వేదికలో ఘనంగా జరిగింది. తమన్ సంగీతం అందించిన ఆ చిత్ర పాటలు ఎలా ఉన్నాయో చూద్దాం.

1.పాట: బాడీగార్డ్
పాడిన వారు: బాబా సెహగల్, రాహుల్ నంబియార్, రమ్య
సాహిత్యం: భాస్కరభట్ల రవి కుమార్


ఈ పాట హుషారుగా సాగే టైటిల్ పాట. రెగ్యులర్ గా వచ్చే హీరో ఇంట్రడక్షన్ పాట మరియు బాబా సెహగల్ హుషారుగా పాడారు. రాహుల్ నంబియార్ మరియు రమ్య కూడా బాగా పాడారు. భాస్కరభట్ల సాహిత్యం కూడా సందర్భానికి తగ్గట్లుగా బావుంది. తమన్ సంగీతంలోని సిన్తనైసర్ మరియు డ్రమ్స్ బాగా డామినేట్ చేసాయి.
ఈ పాట వినడానికి బావుంది. తెరపై కూడా బావుంటుందని ఆశించవచ్చు.

2.పాట: హోసన్నా
పాడిన వారు: శ్రీ వర్ధిని, రాహుల్ నంబియార్
సాహిత్యం: అనంత శ్రీరామ్


అనంత శ్రీరామ్ రాసిన రొమాంటిక్ డ్యూయెట్ సాంగ్ . రాహుల్ నంబియార్ పర్వలేదనిపించగా శ్రీ వర్ధిని మాత్రం చాలా అధ్బుతంగా పాడింది. తమన్ సంగీతం బావుంది. కానీ గతంలో ఆయన అందించిన పాటలు గుర్తుకు వస్తాయి. వినటానికి చాలా బావుంది. విదేశాలలో చిత్రీకరించి ఉండి ఉంటారు.

3.పాట: ఓ మై గాడ్
పాడిన వారు: గీత మాధురి, బిందు, సుధ, పర్మిక
సాహిత్యం: అనంత్ శ్రీరామ్


బాడీగార్డ్ హీరోయిన్స్ ను బాధ పెడుతుంటే వారు పాడుకునే పాట. అనంత శ్రీరామ్ రాసిన రాసిన సాహిత్యం ఫన్నీగా బావుంది. గీత మాధురి మరియు తన బృందం బాగా పాడారు. మేల్ కోరస్ కూడా బాగా పాడారు. ఈ పాట ఫన్నీగా చిత్రీకరణ చేస్తే తెరపై కూడా బావుంటుంది. తమన్ పర్వలేదనిపించాగా సిన్తనైసర్ మరియు పెర్క్యుషణ్ బాగా డామినేట్ చేసాయి.

4.పాట: ఎవ్వరో
పాడిన వారు: కార్తీక్
సాహిత్యం: శ్రీ మణి


కార్తీక్ సోలోగా పాడిన రొమాంటిక్ పాట. హీరో తనతో మాట్లాడుతూ ఉన్న ఆ అమ్మాయి ఎవరో అని వెతుకుతూ పాడుకునే పాట. శ్రీ మణి సాహిత్యం బావుంది. తమన్ సంగీతం కూడా బావుంది. చిత్రీకరణ కూడా బావుంటుందని ఆశించవచ్చు.

5.పాట: జియజలె
పాడిన వారు: హరిచరణ్, హరిణి
సాహిత్యం: రామ జోగయ్య శాస్త్రి


భాదాకరమైన రొమాటిక్ డ్యూయెట్ పాట. హరిచరణ్ మరియు హరిణి ఇద్దరు బాగా పాడారు. హరిణి సందర్భానికి తగ్గట్టుగా సరిగ్గా పాడింది. ఫీమేల్ కోరస్ చాలా బావుంది. రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం బావుంది. తమన్ సంగీతం కొత్తగా లేకపోయినా పర్వాలేదు అనిపిస్తుంది.

6.పాట: ఎందుకో
పాడిన వారు: శ్వేతా పండిట్, తమన్, హరిచరణ్
సాహిత్యం: రామ జోగయ్య శాస్త్రి


2 నిముషాలు మాత్రమే సాగే బిట్ సాంగ్. శేత పండిట్ అధ్బుతంగా పాడింది వినడానికి కూడా చాలా బావుంది. హీరోయిన్ తనలో తాను భాధతో పాడుకునే పాట. తమన్ మరియు హరిచరణ్ కూడా పర్వాలేదనిపించారు. సంగీతంలో సిన్తనైసర్ బాగా డామినేట్ చేసింది. కొన్ని కీలకమైన సన్నివేశాలలో వాడుకునే అవకాశం ఉండి.

తీర్పు:

తమన్ సంగీతం అందించిన ఈ ఆడియో బావుంది కానీ శ్రోతలకి కొత్తగా అనిపించేలా ఏమి లేకపోవడం గమనార్హం. అన్ని పాటలు పర్వలేదనిపించాగా సినిమాని ఎలివేట్ చేసే పాటలు మాత్రం లేవు. తమన్ తన పాత పాటలనే మళ్లీ మళ్లీ వినిపిస్తున్నట్లుగా హెవీ సిన్తనైసర్ బాగా డామినేట్ చేస్తుంది. పెర్క్యుషణ్ (డ్రమ్స్ వాయిద్యాలు వగైరా) ప్రతి ఆడియో అవే వినిపిస్తుండటం బోర్ కొట్టిస్తుంది. అవి మార్చుకుంటే బెటర్ గా ఉంటుంది. వెంకటేష్ స్టైల్ చిత్రీకరణ ఉంటుందని ఆశించవచ్చు. బాడీగార్డ్ మరియు హోసన్నా పాటలు నాకు బాగా నచ్చాయి.

అశోక్ రెడ్డి.ఎం

Check Out For Bodyguard English Version Audio Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు