సమీక్ష : ‘బొమ్మ‌ల‌ కొలువు’ – స్లోగా సాగే బోరింగ్ క్రైమ్ డ్రామా!

సమీక్ష : ‘బొమ్మ‌ల‌ కొలువు’ – స్లోగా సాగే బోరింగ్ క్రైమ్ డ్రామా!

Published on Apr 23, 2022 3:03 AM IST
Bommala Koluvu Movie Review

విడుదల తేదీ : ఏప్రిల్ 22, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు: హ్రిషికేష్‌, మాళ‌వికా స‌తీష‌న్ మరియు “సవారి” ఫేమ్ ప్రియాంక శ‌ర్మ తదితరులు.

దర్శకత్వం : సుబ్బు వేదుల

నిర్మాత: ఏవీఆర్ స్వామి

సంగీత దర్శకుడు: ప‌ర్విన్ ల‌క్క‌రాజు

సినిమాటోగ్రఫీ: ఈశ్వ‌ర్

ఎడిటర్ : ఎంఆర్ వ‌ర్మ

హ్రిషికేష్‌, మాళ‌వికా స‌తీష‌న్ మరియు “సవారి” ఫేమ్ ప్రియాంక శ‌ర్మ మరో ప్ర‌ధాన‌పాత్ర‌లో నటించిన లేటెస్ట్ చిత్రం “బొమ్మ‌ల‌కొలువు”. సుబ్బు వేదుల ద‌ర్శక‌త్వంలో వచ్చిన ఈ చిత్రం ఈ రోజు రిలీజ్ అయింది. మరి ప్రేక్షకులును ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ:

రుధ్ర‌ (హ్రిషికేష్‌) – రాగ (మాళ‌వికా స‌తీష‌న్) ఇద్దరూ ఘాడంగా ప్రేమించుకుంటారు. ఐతే, రాగ ఒక క్రైమ్ రిపోర్టర్. తన ఇంటి పక్కన ఉండే గుణ అనే వ్యక్తి కిల్లర్ అని ఆమెకు అనుమానం కలుగుతుంది. దాంతో.. రాగ, గుణ పై ఫోకస్ పెడుతుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య రుధ్ర – రాగ మధ్య గొడవ జరిగి ఇద్దరి మధ్య చిన్న గ్యాప్ వస్తోంది. ఆ వెంటనే రాగ మిస్ అవుతుంది. రుధ్ర రాగ కోసం వెతుకుతూ పరితపిస్తూ ఉంటాడు. రాగను గుణ ఏదో చేశాడని రుధ్ర అనుమానిస్తాడు. ఆ అనుమానం నిజమా ? కాదా ? అసలు రాగ ఏమైపోయింది ? ఇంతకీ గుణ వెనుక ఉన్న సీక్రెట్ ఏమిటి ? దాన్ని రుధ్ర ఎలా బయట పెట్టాడు ? ఈ మధ్యలో మిత్ర (ప్రియాంక శ‌ర్మ) పాత్ర ఏమిటి ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాలో కొన్ని ఎమోషనల్ అండ్ సస్పెన్స్ సీన్స్ పర్వాలేదు. అలాగే క్లైమాక్స్ లో హీరో పాత్ర ద్వారా రివీల్ అయ్యే ట్విస్ట్ లు కూడా పర్వాలేదు. ఇక నటీనటుల పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే.. హ్రిషికేష్‌, మాళ‌వికా స‌తీష‌న్ మరియు “సవారి” ఫేమ్ ప్రియాంక శ‌ర్మ ఇలా అందరూ బాగానే నటించారు. హ్రిషికేష్‌ కొన్ని సన్నివేశాల్లో మంచి నటన కనబరుస్తూ కొన్నిచోట్ల బాగానే సీరియస్ నెస్ క్రియేట్ చేశాడు.

ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన మాళ‌వికా స‌తీష‌న్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. సినిమాలో మరో మెయిన్ లీడ్ గా నటించిన ప్రియాంక శ‌ర్మ తన పెర్ఫార్మెన్స్ తో బాగా ఆకట్టుకుంది. ఆమె లుక్ కూడా చాలా బాగుంది. ఇక శివ‌మ్ మ‌ల్హోత్రా, సుబ్బు వేదుల మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేసారు.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాలోని కొన్ని సీన్స్ సాధారణ ప్రేక్షకులకు కొంత వరకు ఆసక్తి కలిగించొచ్చు కానీ.. మిగిలిన వర్గాల వారితో పాటు సగటు ప్రేక్షకులకు కూడా ఈ సినిమా రుచించదు. సినిమా నిండా సిల్లీ మెలో డ్రామాను మోతాదుకు మించి పెట్టి విసిగించారు. పైగా సినిమాలో చాలా సన్నివేశాలు పూర్తి సినిమాటిక్ గా ఇంట్రెస్ట్ కలిగించకుండా సాగుతాయి.

అయినా వాస్తవానికి పూర్తి దూరంగా సాగే ప్లేలో ఇక ఇన్ వాల్వ్ అయ్యే విధంగా ఇంట్రెస్టింగ్ సీన్స్ ఎలా వస్తాయి ?. కథనంలోని ప్రతి సన్నివేశం స్లోగా సాగుతూ అసలు కన్వీన్స్ కానీ విధంగా ముగుస్తోంది. దానికి తోడు ట్రీట్మెంట్ కూడా బోరింగ్ ప్లేతో సాగుతూ సినిమాలోని ఇంట్రెస్టింగ్ ను చంపేసింది.

అలాగే సినిమాలో సరైన ప్లో కూడా లేకపోవడం, మెయిన్ ట్రీట్మెంట్ లోని కంటెంట్ ఆసక్తికరంగా సాగకపోవడం, మరియు ప్రీ క్లైమాక్స్ అండ్ సెకండ్ హాఫ్ లోని కీలక సన్నివేశాలన్నీ బాగా స్లోగా సాగుతూ నిరుత్సాహ పరచడం వంటి అంశాలు సినిమాకి ప్రధాన మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి.

సాంకేతిక విభాగం:

సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు సుబ్బు వేదుల కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో మెప్పించే ప్రయత్నం చేసినా, కథాకథనాలను ఆకట్టుకునే విధంగా రాసుకోలేకపోయారు. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. సంగీత దర్శకుడు అందించిన సంగీతం బాగుంది. ఎడిటర్ వర్క్ పర్వాలేదు. నిర్మాతలు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

తీర్పు:

బొమ్మ‌ల‌కొలువు అంటూ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్ల‌ర్ గా వచ్చిన ఈ సినిమా అంతిమంగా నిరాశపరిచింది. సినిమా ఆకట్టుకునే విధంగా సాగలేదు. మెయిన్ ట్రీట్మెంట్ ఆసక్తికరంగా సాగకపోవడం, సినిమా స్లోగా సాగుతూ నిరుత్సాహ పరచడం, బోరింగ్ ప్లే వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. కానీ, కొన్ని ట్విస్ట్ లు బాగున్నాయి. అలాగే కొన్ని సీన్స్, నటీనటుల పనితీరు పర్వాలేదు. ఐతే, ఓవరాల్ గా ఈ సినిమా మాత్రం నిరుత్సాహ పరుస్తోంది

123telugu.com Rating: 2/5

Reviewed by 123telugu Team 

Click Here For English Version

సంబంధిత సమాచారం

తాజా వార్తలు