సమీక్ష : “బుట్ట బొమ్మ” – మెసేజ్ కోసం మాత్రమే

సమీక్ష : “బుట్ట బొమ్మ” – మెసేజ్ కోసం మాత్రమే

Published on Feb 5, 2023 12:01 AM IST
Butta Bomma Movie-Review-In-Telugu

విడుదల తేదీ : ఫిబ్రవరి 04, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: అనిఖా సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ట, నవ్య స్వామి తదితరులు

దర్శకుడు : శౌరి చంద్రశేఖర్ టి రమేష్

నిర్మాతలు: నాగ వంశీ ఎస్, సాయి సౌజన్య

సంగీత దర్శకులు: గోపీ సుందర్

సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు

ఎడిటర్: నవీన్ నూలి

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

అనికా సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ఠ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ బుట్టబొమ్మ. మలయాళ సూపర్ హిట్ కప్పేలా కి రీమేక్ గా రూపొందిన ఈ చిత్రం నేడు రిలీజ్ అయ్యింది. మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

 

సత్య (అనికా సురేంద్రన్) మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చెందిన అమ్మాయి. చిన్న పల్లెటూరిలో తన ఫ్యామిలీతో లైఫ్ లీడ్ చేస్తుంటుంది. ఈ క్రమంలో ఓ రాంగ్ కాల్ ద్వారా మురళి (సూర్య వశిష్ఠ) తో పరిచయం అవుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. ఈ లోపు సత్యకి తన గ్రామానికి చెందిన చిన్నితో పెళ్లి కుదురుతుంది. దాంతో సత్య మురళి కోసం ఒంటరిగా వైజాగ్ వచ్చేస్తోంది. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో సత్యకి మురళి గురించి షాకింగ్ విషయం తెలుస్తోంది. ఇంతకీ ఏమిటి ఆ నిజం ?, అసలు మురళి ఎవరు ?, ఈ మధ్యలో రామకృష్ణ (అర్జున్ దాస్) పాత్ర ఏమిటి?, రామకృష్ణ ఎందుకు సత్యని ఫాలో అవుతున్నాడు? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన సూర్య వశిష్ఠ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. మరో కీలక పాత్రలో నటించిన అర్జున్ దాస్ టెర్రిఫిక్ గా కనిపించారు. తన డైలాగ్ డెలివరీ మరియు తన బాడీ లాంగ్వేజ్ తో అర్జున్ దాస్ చాలా బాగా మెప్పించాడు. ఇక హీరోయిన్ గా నటించిన అనికా సురేంద్రన్ కూడా తన క్యూట్ అండ్ హోమ్లీ లుక్స్ లో అందంగా కనిపిస్తూ.. తన నటనతోనూ ఆకట్టుకుంది.

ఈ సినిమాలో సత్య (అనికా సురేంద్రన్) పాత్ర.. ఆ పాత్రకు సంబంధించిన లవ్ ట్రాక్.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన మురళి పాత్ర.. అలాగే అర్జున్ దాస్.. ఆ పాత్ర తాలూకు పాయింట్ అఫ్ వ్యూ.. ముఖ్యంగా సినిమా నేపథ్యం.. ఇలా మొత్తానికి ఈ సినిమాలో గుడ్ పాయింట్ తో పాటు గుడ్ మెసేజ్ ఉంది. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

 

మైనస్ పాయింట్స్ :

 

బట్టబొమ్మ మెయిన్ పాయింట్ లో మ్యాటర్ ఉన్నపటికీ.. ఆ పాయింట్ కి తగ్గట్టు స్క్రీన్ ప్లే రాసుకోవడంలో రచయిత గణేష్ కుమార్ రావూరి పూర్తిగా విఫలం అయ్యాడు. స్క్రీన్ ప్లే లో ఎక్కడా ఇంట్రెస్ట్ లేదు. పైగా చాలా చోట్ల కొన్ని కీలక సన్నివేశాలు కూడా చాలా పేలవంగా ఉన్నాయి. అసలు ఇలాంటి కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు కథలో క్యూరియాసిటీ అండ్ టెన్షన్ బిల్డప్ చేస్తూ ప్లే రాసుకోవాలి. కానీ, ఈ కథలో తర్వాత రాబోయే సీన్ ఏమిటి అనేది సగటు ప్రేక్షకుడికి కూడా క్లారిటీగా అర్ధం అవుతుంది.

ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ గ్రాఫ్ పెరగాలి. కానీ ఈ సినిమాలో అది కూడా మిస్ అయింది. కథలో టెంపో పెంచకుండా సినిమాని తక్కువ నిడివిలో ముగించారు. దాంతో సినిమా అసంపూర్ణంగా ముగించిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక గణేష్ రావూరి డైలాగ్స్ లో కూడా మెరుపులు లేవు. పైగా సింగిల్ ట్రాక్ మీదే సెకండ్ హాఫ్ మెయిన్ ప్లాట్ మొత్తం సాగడంతో సినిమాలో అదే పెద్ద మైనస్ అయింది. దానికి తోడు కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఫేక్ గా అనిపిస్తాయి. ఓవరాల్ గా దర్శకుడు మంచి మెసేజ్ అయితే ఇచ్చాడు గానీ, అది స్క్రీన్ మీద బాగా వర్కౌట్ కాలేదు.

 

సాంకేతిక విభాగం :

 

టెక్నికల్ గా చూసుకుంటే.. సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదే విధంగా సినిమాటోగ్రఫీ వర్క్ కూడా సినిమాకి హైలైట్ గా నిలుస్తోంది. ఎడిటింగ్ వర్క్ సినిమాకి తగ్గట్టు ఉంది. సినిమాలో నిర్మాతలు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.

 

తీర్పు :

 

బుట్ట బొమ్మ అంటూ వచ్చిన ఈ చిత్రంలో మెయిన్ కాన్సెప్ట్, కొన్ని లవ్ సీన్స్ మరియు క్లైమాక్స్ బాగున్నాయి. అయితే, ఇంట్రెస్టింగ్ గా సాగని ట్రీట్మెంట్ తో పాటు ప్లే బాగా స్లోగా సాగడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. ఐతే, సినిమాలో అనికా, అర్జున్ దాస్, సూర్య వశిష్ఠ ల నటన ఆకట్టుకున్నాయి. ఓవరాల్ గా ఈ చిత్రం ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు