సమీక్ష : “కెప్టెన్” – డిజప్పాయింట్ చేసే థ్రిల్లర్ డ్రామా

సమీక్ష : “కెప్టెన్” – డిజప్పాయింట్ చేసే థ్రిల్లర్ డ్రామా

Published on Sep 9, 2022 3:00 AM IST
Aakasa Veedhullo Movie Review

విడుదల తేదీ : సెప్టెంబర్ 08, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నటీనటులు: ఆర్య, ఐశ్వర్య లక్ష్మి, సిమ్రాన్, హరీష్ ఉత్తమన్, కావ్య శెట్టి మరియు ఇతరులు

దర్శకత్వం : శక్తి సౌందర్ రాజన్

నిర్మాతలు: ఎస్ ఎన్ ఎస్ మూవీ ప్రొడక్షన్ & షో పీపుల్

సంగీత దర్శకుడు: డి ఇమ్మాన్

సినిమాటోగ్రఫీ: ఎస్ యువ

ఎడిటర్: ప్రదీప్ ఇ రాఘవ

లేటెస్ట్ గా ట్రైలర్ తో ఒక్కసారిగా సౌత్ ఇండియన్ సినిమా దగ్గర ట్రైలర్ తో ఆసక్తి రేపిన చిత్రం “కెప్టెన్”. హీరో ఆర్య మరియు పలు వినూత్న చిత్రాల దర్శకుడు శక్తి సౌందరాజన్ తెరకెక్కించిన ఈ చిత్రం హాలీవుడ్ లెవెల్ ట్రీట్ బజ్ తో ఈరోజు థియేటర్స్ లోకి వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

ఇక కథ లోకి వస్తే.. విజయ్ కుమార్(ఆర్య) ఒక అనాథ కాగా తాను మిలట్రీలో తన తోటి సైనికుల్ని తన ఫ్యామిలీగా భావిస్తాడు. మరి ఇదిలా ఉండగా 50 ఏళ్ల నుంచి నిర్మానుష్యంగా ఎలాంటి కదలిక లేని ఓ ప్రాంతాన్ని మళ్ళీ యాక్టీవ్ చెయ్యాలని ప్రభుత్వం నుంచి ఆర్డర్ రాగా అక్కడికి ముందు వెళ్లిన ఓ రెండు బ్యాచ్ లు అనుకోని విధంగా కనిపించకుండా పోతాయి. దీనితో ఈ షాకింగ్ సంఘటన వెనక ఉంది ఏంటి? అక్కడేమైనా వింత జంతువులు ఉన్నాయా? ఒకవేళ ఉంటే అవి అక్కడికి ఎలా వచ్చాయి?మరి వాటిని విజయ్ ఆపగలుగుతాడా లేదా అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ సినిమాలో మెయిన్ గా దర్శకుడు తీసుకున్న సబ్జెక్ట్ కి ఇలాంటి అటెంప్ట్ చెయ్యాలన్న తన ఆలోచనకి హర్షించాలి. ఇక నటీ నటుల్లో అయితే ఆర్య ఈ సినిమాలో సాలిడ్ పెర్ఫామెన్స్ అందించాడు. చాలా సినిమాలకి తన లుక్ పరంగా చాలా మార్చుకునే ఆర్య గత సార్పట్ట నుంచి నటనలో కూడా చాలా బాగా చేస్తూ వస్తున్నాడు. అలాగే ఈ సినిమాకి కూడా తన లోని షేడ్స్ బాగా చూపించాడు.

ఇంకా యాక్షన్ సీక్వెన్స్ లు అయితే మరింత ఆసక్తిగా కనిపిస్తాయి. అలాగే సిమ్రాన్ కూడా కీలక పాత్రలో కనిపించగా ఆమె మంచి పెర్ఫామెన్స్ తో కనిపిస్తారు. ఇంకా సినిమాలో కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ అయితే బాగానే ఆకట్టుకుంటాయి. ఇంకా కావ్య శెట్టి, హరీష్ ఉత్తమన్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ సినిమాలో చెప్పుకోక తప్పదు కానీ చాలా మంది పడ్డ డౌట్స్ అన్నీ నిజం అవుతాయని చెప్పాలి. సినిమా ట్రైలర్ మరియు పోస్టర్స్ చూసినప్పుడే చాలా మందికి హాలీవుడ్ సినిమా తరహాలో ఒక మార్క్ పడిపోయింది. అయితే మేకర్స్ ఆ టైప్ లో ఉండదు అని అన్నారు కానీ సినిమా కూడా మరీ అంత థ్రిల్లింగ్ గా లేకపోగా చాలా డల్ గా కనిపిస్తుంది. దీనితో ఆడియెన్స్ లో ఖచ్చితంగా ఆసక్తి బాగా నశిస్తుంది.

ఇక ట్రైలర్ టైం లోనే సినిమా గ్రాఫిక్స్ చాలా పేలవంగా కనిపించాయి. పోనీ సినిమా ప్రింట్ లో ఈయన బెటర్ గా ఉంటాయి అనుకుంటే డిజప్పాయింట్ చేసే విధంగా సినిమాలో కూడా ఉంటాయి. దీనితో ఇది సినిమాలో మరో బిగ్ మైనస్ గా కనిపిస్తుంది. డెఫినెట్ గా ఈ తరహా సినిమాలు చేసేటప్పుడు గ్రాఫిక్స్ పలు ఆబ్జెక్ట్స్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదు.

ఇది ఈ సినిమాలో బాగా మిస్సయ్యింది. సినిమాలో నటి ఐశ్వర్య లక్ష్మి రోల్ కూడా డిజప్పాయింట్ చేస్తుంది. ఇంకా సినిమా నిడివి కూడా తక్కువే ఉంది పర్లేదు అనుకుంటే పొరపాటే ఇంత తక్కువ నిడివి ఉన్నా కూడా ఈ సినిమాలో ఉన్న చాలా లోపాలతో అయితే మెప్పించలేకపోతుంది.

 

సాంకేతిక వర్గం :

 

ఈ సినిమాలో నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి కానీ ఇంకొన్ని విషయాల్లో మాత్రం కాంప్రమైజ్ అయ్యి సినిమా ప్రోడక్ట్ అవుట్ పుట్ సరిగ్గా తీసుకురాలేకపోయారు. ముఖ్యంగా టెక్నీకల్ విభాగంలో గ్రాఫిక్స్ వర్క్ బాగా డిజప్పాయింట్ చేస్తుంది. ఇంకా సంగీతం విషయంలో డి ఇమాన్ సాలిడ్ వర్క్ ఈ సినిమాకి అందించాడు. అలాగే ఎస్ యువ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ విషయంలో చెప్పడానికి ఏమి లేదు.

ఇక దర్శకుడు శక్తి విషయానికి వస్తే తాను ఎప్పటికప్పుడు కొన్ని రేర్ సబ్జెక్టు లు టచ్ చెయ్యడం నిజంగా బాగుంటుంది కానీ దానిలో కాస్త రొటీన్ ఫ్లేవర్ కూడా బాగానే కనిపిస్తుంది. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం చాలా ఎక్కువ నిర్లక్ష్యమే కనిపిస్తుంది. దీనితో టోటల్ గా సినిమా ఫలితం దెబ్బ తిన్నది అని చెప్పక తప్పదు. నరేషన్ కానీ తన గ్రాఫికల్ ప్రెజెంటేషన్ గాని ఏది మెప్పించదు. టెడ్డి, టిక్ టిక్ టిక్ సినిమాలతో పోలిస్తే ఇది తన నుంచి చాలా వరస్ట్ వర్క్.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ ఈ “కెప్టెన్” సినిమా ఏవో అంచనాలు తో వచ్చినా ఈ సినిమా మాత్రం రీచ్ అవ్వడంలో ఫెయిల్ అయ్యిందని చెప్పక తప్పదు. ఒక్క ఆర్య సిన్సియర్ పెర్ఫామెన్స్ కోసం తప్ప సినిమాలో గొప్పగా చెప్పుకోడానికి ఏమీ ఉండదు. దర్శకుడు శక్తి మాత్రం ఈసారి బాగా నిరాశపరిచారు. ఓవరాల్ గా అయితే ఈ చిత్రం ఆడియెన్స్ ని థ్రిల్ చెయ్యదు.

123telugu.com Rating: 2.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు