సమీక్ష : ‘చెప్పాలని ఉంది’ – కాన్సెప్ట్ బాగుంది, కానీ గాడి తప్పింది

Cheppalani Undi Movie Review

విడుదల తేదీ : డిసెంబర్ 09, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: యష్ పూరి, స్టెఫీ పటేల్, సత్య, తనికెళ్ళ భరణి, సునీల్, పృథ్వీ రాజ్, రఘు బాబు, ఆలీ

దర్శకుడు : అరుణ్ భారతి ఎల్

నిర్మాతలు: వాకాడ అంజన్ కుమార్, యోగేష్ కుమార్

సంగీత దర్శకులు: అస్లాం కేయి

సినిమాటోగ్రఫీ: ఆర్పీ డి ఎఫ్ టి

ఎడిటర్: నందమూరి హరిబాబు

 

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి తో గాడ్ ఫాదర్ వంటి సక్సెస్ఫుల్ మూవీ తరువాత యువ నటుడు యష్ పూరి హీరోగా అరుణ్ భారతి ఎల్ దర్శకత్వంలో తెరకెక్కిన చెప్పాలని ఉంది అనే మూవీని రూపొందించారు ప్రతిష్టాత్మక సూపర్ గుడ్ ఫిలిమ్స్ వారు. ఇక అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకి వచ్చింది. మరి ఈ మూవీ యొక్క సమీక్షను ఇప్పుడు చూద్దాం.

కథ :

చందు (యష్ పూరి) తెలుగు భాషని ఎంతో ఇష్టపడే మంచి సోషల్ రెస్పాన్సిబిలిటీ కలిగిన ఒక టివి న్యూస్ రిపోర్టర్. అయితే తన లైఫ్ ఎంతో ఇంపార్టెంట్ రోజు కోసం ఎదురు చూస్తున్న చందు, సరిగ్గా దానికి ఒకరోజు ముందు అనుకోకుండా ఒక యాక్సిడెంట్ కి గురవుతాడు. దానివలన అతడు తెలుగు భాష ని పూర్తిగా మర్చిపోయి ఒక విచిత్రమైన భాష మాట్లాడుతుంటాడు. అయితే అప్పటికే లవ్ లో ఉన్న చందూ ని తన లవర్ వెన్నెల (స్టెఫీ పటేల్) సైతం అతడి భాషని అర్ధం చేసుకోలేకపోతుంది. మరి ఆ తరువాత ఏమైంది, చందూకి మళ్ళి తెలుగు భాష గుర్తుకు వచ్చిందా, అనంతరం అతడి ప్రేమ, జీవితం ఎలా సాగింది, అతడు ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నాడు అనేటువంటి ప్రశ్నలు అన్నింటికీ సినిమానే సమాధానం.

 

ప్లస్ పాయింట్స్ :

ముందుగా దర్శకుడు అరుణ్ భారతి ఈ రకమైన మంచి కాన్సెప్ట్ ని తీసుకోవడం ఎంతో బాగుంది. అలానే అతడు దానిని స్క్రీన్ పై తెరకెక్కించిన విధానం కూడా బాగానే అనిపిస్తుంది. ఇక హీరో యష్ పూరి తన ఆకట్టుకునే పెర్ఫార్మన్స్, కామెడీ టైమింగ్, డ్యాన్స్ ఇలా అన్నింటిలో తనకంటూ ఆడియన్స్ లో మంచి క్రేజ్ దక్కించుకున్నారు. అలానే హీరోయిన్ స్టెఫీ పటేల్ కూడా తన పాత్ర యొక్క పరిధి మేరకు అందం, అభినయంతో అలరించింది. ఇక ఇతర నటులు సత్య, పృథ్వీరాజ్ వంటి వారు సినిమా మొత్తం తమ కామెడీ తో ఆకట్టుకున్నారు. తనికెళ్ళ భరణి, రాజీవ్ కనకాల వంటి వారు తమ తమ పాత్రల్లో మరొక్కసారి ఒదిగిపోయి నటించి అలరించారు.

 

మైనస్ పాయింట్స్ :

నిజానికి మన మాతృభాషాని కాపాడుకోవడం, గౌరవించడం వంటి కాన్సెప్ట్ ని దర్శకుడు ఎంచుకున్నప్పటికీ, దానిని పక్కాగా ఆడియన్స్ కి చేరువయ్యేలా తీయడంలో మాత్రం విఫలం అయ్యారు అనే చెప్పాలి. సినిమాలో కొన్ని అనవసరమైన సన్నివేశాలు ఉన్నాయి, ముఖ్యంగా అవి సెకండ్ హాఫ్ లో ఆడియన్స్ కి ఇబ్బందిగా ఉంటాయి. అలానే సినిమా యొక్క క్లైమాక్స్ సన్నివేశాలు మనకు ఒకింత బలవంతంగా పెట్టినట్లు అనిపిస్తాయి. స్క్రీన్ ప్లే ని దర్శకుడు మరింత ఆకట్టుకునే విధానంలో రాసుకుని ఉంటె బాగుండేది. నిజానికి హీరో, హీరోయిన్స్ పెర్ఫార్మన్స్ బాగున్నప్పటికీ, సినిమా యొక్క కథనం చప్పగా ఉండడంతో అవి సినిమాకి పెద్దగా మేలు చేయవు.

 

సాంకేతిక వర్గం :

స్టోరీ బాగున్నా దానిని ఆడియన్స్ నాడి పెట్టుకునేలా మాత్రం దర్శకుడు తీయలేకపోయాడు. చాలావరకు సన్నివేశాలు సాగతీతగా ఉండడంతో పాటు సెకండ్ హాఫ్ లో ఆడియన్స్ కొన్ని సీన్స్ అలరించవు. ఇక సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడితే, సినిమా ఆద్యంతం ఫోటోగ్రఫి బాగుందనే చెప్పాలి. ఇక ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ ముందు వచ్చే మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది. ఇక సాంగ్స్ కూడా ఒకసారి సినిమా చూస్తే వినాలని అనిపిస్తాయి.

 

తీర్పు :

మొత్తంగా చెప్పాలి అంటే, ఈ చెప్పాలని ఉంది మూవీ మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కినప్పటికీ కథనంలో లోపం వలన ఆడియన్స్ కి చేరువ కాదు. పృథ్వీ, సత్య వంటి వారి కామెడీ బాగుంది. హీరో హీరోయిన్స్ ఇద్దరూ కూడా తమ యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు. అయితే ముఖ్యంగా బోరింగ్ స్క్రీన్ ప్లే, సెకండ్ హాఫ్ లో సాగతీత, అనవసర సన్నివేశాలు వంటివి చెప్పాలని ఉంది మూవీకి ఇబ్బందికరంగా మారాయి. ఓకే పర్లేదు కాస్త టైం పాస్ కి చూడాలి అనుకునే వారికి మాత్రమే ఈ మూవీ నచ్చుతుంది.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :