సమీక్ష : డెడ్ పిక్సెల్స్ – డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో తెలుగు వెబ్ సిరీస్

సమీక్ష : డెడ్ పిక్సెల్స్ – డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో తెలుగు వెబ్ సిరీస్

Published on May 20, 2023 3:03 AM IST
 Dead Pixels Telugu Movie Review

విడుదల తేదీ : మే 19, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు: నిహారిక కొణిదెల, అక్షయ్ లగుసాని, సాయి రోనక్, హర్ష చెముడు, భావన సాగి, రాజీవ్ కనకాల, బిందు చంద్రమౌళి, జయశ్రీ రాచకొండ తదితరులు.

దర్శకులు : ఆదిత్య మండల

నిర్మాతలు: సమీర్ గోగటే, రాహుల్ తమడ, సాయిదీప్ రెడ్డి బోరా

సంగీత దర్శకులు: సిద్ధార్థ సదాశివుని

సినిమాటోగ్రఫీ: ఫహద్ అబ్దుల్ మజీద్

ఎడిటర్: సృజన అడుసుమిల్లి

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

ప్రముఖ ఓటిటి మాధ్యమం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో డేడ్ పిక్సెల్స్ అనే వెబ్ సిరీస్ ప్రస్తుతం ఆడియన్స్ ముందుకి వచ్చింది. బ్రిటిష్ టెలివిజన్ సిరీస్ గా తెరకెక్కి అక్కడి ఆడియన్స్ నుండి మంచి స్పందన అందుకున్న డేడ్ పిక్సెల్స్ ని అదే టైటిల్ తో తెలుగులో రీమేక్ చేసారు. మరి నేడు డిస్నీ హాట్ స్టార్ ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

 

కథ :

గాయత్రి (నిహారిక), భార్గవ్ (అక్షయ్ లగుసాని), మరియు ఆనంద్ (హర్ష చెముడు) బ్యాటిల్ ఆఫ్ థ్రోన్ అనే వీడియో గేమ్‌తో ఎక్కువగా కనెక్ట్ అవుతారు. వారి ఆఫీస్ లో కూడా అదే గేమ్ ఆడుతూ ఉంటారు. ఆ గేమ్ ఎలాగైనా పూర్తి చేయాలనే గోల్ వారందరికీ ఉంటుంది. రోషన్ ( సాయి రోనక్) ఒకానొక సమయంలో గాయత్రీ వాళ్ళ ఆఫీస్ లో జాయిన్ అవుతాడు. అనంతరం అతడి పట్ల ఆకర్షితురాలవుతుంది. ఆ తరువాత రోషన్ కూడా వారి గేమ్ లో జాయిన్ అవుతాడు. మరి అనంతరం ఏమి జరుగుతుంది, ఇంతకీ వారు గేమ్ పూర్తి చేసారా లేదా ? రోషన్ ఎంట్రీ తో అంతా ఏవిధంగా మారుతుంది ? ఇలాంటి ప్రశ్నలు అన్నిటికీ సమాధానాలు దొరకాలి అంటే డెడ్ పిక్సెల్స్ సిరీస్ చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

నిహారిక కొణిదెల వీడియో గేమ్ పట్ల ఔత్సాహికురాలిగా మంచి పెర్ఫార్మెన్స్ కనబరిచారు. అక్షయ్ లగుసాని, హర్ష, సాయి రోనక్ తమ తమ పాత్రల్లో డీసెంట్‌గా నటించారు. నిహారిక స్నేహితురాలిగా నటించిన భావన సాగి చాలా బాగా చేసింది. తన స్నేహితురాలిని మార్చడానికి ప్రయత్నించే వ్యక్తిగా ఆమె ఆకట్టుకుంది. అక్కడక్కడా కొన్ని కామెడీ సన్నివేశాలు బాగున్నాయి. అక్షయ్ మరియు రాజీవ్ కనకాల నటించిన సన్నివేశం బాగా వచ్చింది. రాజీవ్ తన పాత్రలో ఒదిగిపోయి నటించారు అనే చెప్పాలి.

 

మైనస్ పాయింట్స్ :

ఈ సిరీస్ ముఖ్యంగా గేమర్స్ లక్ష్యంగా సాగుతుంది, అయితే ఇతరులకు ఖచ్చితంగా బోరింగ్ రైడ్ అవుతుందనే చెప్పాలి. ఇది ఒకరకంగా అతి పెద్ద లోపం, ఎందుకంటే మెజారిటీ ఆడియన్స్ యొక్క మెప్పుని ఇది కోల్పోతుంది. అలరించే ఎంటర్టైన్మెంట్ అంశాలు లేకపోతే ఆడియన్స్ ఎటువంటివి అయినా చూడరు. అలానే ఈ సిరీస్ ద్వారా మేకర్స్ ఖచ్చితంగా ఏమి చెప్పాలనుకుంటున్నారు అనేది కూడా అస్పష్టంగా ఉంది. అన్ని సమయాలలో, పాత్రలకు ఒకే ఒక పని ఉంటుంది, అది వారు ఎక్కడ ఉన్నా గేమ్ ఆడటం అంతే. ఉదాహరణకు, సిరీస్ లోని పాత్రలలో ఒకరు పైలట్, కానీ అతను తన పని సమయంలో కూడా గేమ్ ఆడుతూనే ఉంటాడు. ఇతర పాత్రలు కూడా వారి ఆఫీస్ లో గేమ్‌ను ఆడుతూనే ఉంటారు, కానీ వారిని ప్రశ్నించడానికి లేదా వారు పని చేస్తున్నారా లేదా అని తనిఖీ చేయడానికి ఎవరూ కూడా ప్రయత్నించరు. ఆట తన వ్యక్తిగత జీవితాన్ని దెబ్బతీస్తోందని ఒక పాత్ర చివరికి గ్రహిస్తుంది. వాస్తవానికి, సిరీస్ లో ఇది చాలావరకు మనకు తెలిసిపోతుంది. కథ బాగున్నా కథనం రొటీన్ గా సాగుతుండడంతో పాటు సీన్స్ పండించడానికి కావలసిన ఎమోషన్స్ కూడా కనపడవు. గిల్టీ మైండ్స్ సిరీస్‌లో, ఆన్‌లైన్ గేమింగ్ గురించిన ఎపిసోడ్‌లలో ఒకటి, ఇందులో గేమ్‌పై ఉన్న అతి వ్యామోహం కారణంగా ఒక టీనేజ్ అబ్బాయి ఒక వ్యక్తిని చంపుతాడు. అటువంటి ఆన్‌లైన్ గేమ్‌లపై అవగాహన లేని లేదా ఆసక్తి లేని వారు కూడా వీడియో గేమ్‌ల యొక్క హానికరమైన దుష్ప్రభావాలతో బెంబేలెత్తుతారు. ఇక నాన్ గేమర్‌లను సైతం ఆకర్షించడానికి ఏదో అంశం ఒకటి చేర్చబడి ఉంటె బాగుండేది.

 

సాంకేతిక వర్గం :

సిద్ధార్థ సదాశివుని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సిరీస్ పర్వాలేదనిపిస్తుంది. అలానే మరికొన్ని సీన్స్ లో మరింతగా అలరించి ఉంటె బాగుండేదనిపిస్తుంది. ఫహద్ అబ్దుల్ మజీద్ సినిమాటోగ్రఫీ జస్ట్ ఓకే. ఎడిటింగ్ పర్వాలేదు. ఈ సిరీస్ చాలా తక్కువ లొకేషన్లలో చిత్రీకరించబడింది. అలానే నిర్మాణ విలువలు డీసెంట్‌గా ఉన్నాయి. దర్శకుడు ఆదిత్య మండల విషయానికి వస్తే, అతను సిరీస్‌తో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. ఈ సిరీస్ సాధారణ ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేయడానికి ఎటువంటి ప్రయత్నం జరగలేదు, కాబట్టి గేమర్‌లు కానివారు సిరీస్ నుండి వెంటనే డిస్‌కనెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కథాంశం వలె, కథనం కూడా క్లూలెస్ పద్ధతిలో సాగుతుంది. పైన పేర్కొన్న విధంగా, మేకర్స్ సిరీస్‌ని అందరికీ నచ్చేలా కొన్ని అంశాలను జోడించి సర్దుబాటు చేసి ఉంటే తప్పకుండా విజయం అందుకుని ఉండేవారు.

 

తీర్పు :

మొత్తం మీద, డెడ్ పిక్సెల్స్ అనేది గేమర్స్ కోసం ప్రత్యేకంగా ఉద్దేశించబడిన అత్యంత బోరింగ్ సిరీస్ అని చెప్పాలి. నిహారిక మరియు ఇతరులు వారి పాత్రలలో బాగా పెర్ఫార్మ్ చేసినప్పటికీ సిరీస్ పేలవమైన కథ మరియు కథనంతో ఆడియన్స్ యొక్క సహనాన్ని పరీక్షిస్తుంది. మీరు గేమర్ కాకపోతే, మీరు ఈ సిరీస్ చూడకుంటే బెటర్.

 

123telugu.com Rating: 2/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు