సమీక్ష : డ్రైవర్ జమున – ఆకట్టుకోని బోరింగ్ థ్రిల్లర్

సమీక్ష : డ్రైవర్ జమున – ఆకట్టుకోని బోరింగ్ థ్రిల్లర్

Published on Dec 31, 2022 3:04 AM IST
Driver Jamuna Movie-Review-In-Telugu

విడుదల తేదీ : డిసెంబర్ 30, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు: ఐశ్వర్య రాజేష్, ఆదుకాలం నరేన్, కవిత భారతి, స్టాండప్ కమెడియన్ అభిషేక్ కుమార్, ఇళయ పాండి, మణికందన్ రాజేష్

దర్శకుడు : పి కిన్ స్లిన్

నిర్మాత: ఎస్పీ చౌతరి

సంగీత దర్శకులు: జీబ్రాన్

సినిమాటోగ్రఫీ: గోకుల్ బెనోయ్

ఎడిటర్: ఆర్. రామర్

 

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో లేటెస్ట్ గా తెరకెక్కిన థ్రిల్లింగ్ యాక్షన్ డ్రామా మూవీ డ్రైవర్ జమున. యువ దర్శకుడు కిన్ స్లిన్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ యొక్క టీజర్, ట్రైలర్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి. కాగా నేడు ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ మూవీ యొక్క సమీక్ష ఇప్పుడు చూద్దాం.

కథ :

జమున (ఐశ్వర్య రాజేష్) ఒక సాధారణ లేడీ క్యాబ్ డ్రైవర్. అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లి (శ్రీరంజని) ని చూసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటుంది. మరోవైపు ఒక రోజు ఎక్స్ మినిస్టర్ (ఆదుకాలం నరేన్) ని చంపాలని ఒక హంతకుల ముఠా కారులో బయలుదేరుతుంది. అయితే మార్గమధ్యంలో వారి కారు పాడవడంతో క్యాబ్ బుక్ చేస్తారు. డ్రైవర్ జామున వారిని క్యాబ్ లో తీసుకెళ్తుంది, అయితే దారి మధ్యలో వారి మాటలు, ఆలోచనలని బట్టి వారి గుట్టు మొత్తం పసిగడుతుంది జమున. పోలీసులు కూడా వారి కోసం వెతుకుతూ ఉంటారు. మరి అటువంటి సమయంలో డ్రైవర్ జమున ఏమి చేసింది, వారిని పోలీసులకు పట్టించిందా, లేక వారు మినిస్టర్ ని చంపేసారా, వంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకాలి అంటే డ్రైవర్ జమున సినిమా చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

ముందుగా ఇటువంటి మంచి థ్రిల్లింగ్ సబ్జెక్ట్ ని ఎంచుకున్న నటి ఐశ్వర్య రాజేష్ కి ప్రత్యేకంగా అభినందనలు తెలపాలి. అలానే ముఖ్యంగా తన డ్రైవర్ జమున పాత్రలో ఆమె నటించారు అనడం కంటే జీవించారు అని చెప్పాలి. ఆద్యంతం ఆమె పాత్ర ఆడియన్స్ ని ఎంతో ఆకట్టుకుంటుంది. అలానే హంతకుల ముఠా సభ్యుల్లో ఉన్నవారు కూడా బాగా నటించారు. ఇక సినిమాలో అక్కడక్కడా కొన్ని యాక్షన్, ఎమోషల్ సన్నివేశాలు బాగున్నాయి. మ్యూజిక్, కెమెరా వర్క్ వంటివి ఆడియన్స్ ని అలరిస్తాయి.

 

మైనస్ పాయింట్స్ :

నిజానికి ఈ సినిమా కోసం దర్శకుడు కిన్ స్లిన్ తీసుకున్న పాయింట్ సింపుల్ దే అయినా, దానిని స్క్రీన్ పై ఆడియన్స్ ని ఆకట్టుకునేలా తెరకెక్కించడంతో అతడు చాలావరకు విఫలం అయ్యాడు అనే చెప్పాలి. ముఖ్యంగా సినిమాలో చాలా వరకు ల్యాగ్ సీన్స్ ఆడియన్స్ ని ఇబ్బంది పెడతాయి. అలానే సినిమా ప్రారంభం తరువాత చాలా సేపటి వరకు అసలు సినిమా యొక్క మెయిన్ పాయింట్ ఏమిటి అనేది ఆడియన్స్ కి అర్ధం కాదు. సినిమా యొక్క నిడివి 90 నిముషాలు ఉన్నపటికీ కూడా చాలా వరకు సీన్స్ ని ట్రిమ్ చేసి ఉంటె బాగుండేది అనిపిస్తుంది. అయితే సినిమా యొక్క మెయిన్ పాయింట్ ని ప్రీ క్లైమాక్స్ వరకు దాచిపెట్టినందుకు డైరెక్టర్ ని మెచ్చుకోవచ్చు. సినిమాలో ఎక్స్ మినిస్టర్ కి సంబంధించిన సీన్స్ పెద్దగా ఆకట్టుకోవు, అలానే డ్రైవర్ జమున ఫ్లాష్ బ్యాక్ కూడా ఆడియన్స్ ని అంతగా అలరించదు.

 

సాంకేతిక విభాగం :

ముఖ్యంగా దర్శకుడు కిన్ స్లిన్ మూవీ స్టోరీ ని ఆడియన్స్ ని ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో మాత్రం పూర్తిగా ఫెయిల్ అయ్యారు అనే చెప్పాలి. సినిమాలో పలు ట్విస్ట్ ల వంటివి ఉంటె ఒకింత స్టోరీ పై ఇంట్రెస్ట్ ఉండేది. జీబ్రాన్ మ్యూజిక్, గోకుల్ ఫోటోగ్రఫి బాగుంది. ఎడిటింగ్ విభాగం బాగానే పని చేసినప్పటికీ కొన్ని సీన్స్ మాత్రం ట్రిమ్ చేయాల్సింది.

 

తీర్పు :

మొత్తంగా చెప్పాలి అంటే డ్రైవర్ జమున మూవీ బోర్ కొట్టించే థ్రిల్లర్ అని చెప్పాలి. ప్రధానంగా మెయిన్ రోల్ చేసిన ఐశ్వర్య రాజేష్ పెర్ఫార్మన్స్ తప్ప సినిమాలో పెద్దగా ఆకట్టుకునే అంశాలు ఏమి లేవు. ఇక థ్రిల్లర్ మూవీస్ చూడాలి అనుకునే వారిని కూడా ఈ డ్రైవర్ జమున మూవీ పెద్దగా ఆకట్టుకోదు, ఈ మూవీని పూర్తిగా స్కిప్ చేసేయవచ్చు.

123telugu.com Rating: 2/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు