సమీక్ష : ఇ ఈ – ద్వితీయార్థం పర్వాలేదు

సమీక్ష : ఇ ఈ – ద్వితీయార్థం పర్వాలేదు

Published on Dec 22, 2017 7:00 PM IST
E Ee movie review

విడుదల తేదీ : డిసెంబర్ 22, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు : నీరజ్ శ్యామ్, నైరాషా

దర్శకత్వం : రామ్ గణపతిరావ్

నిర్మాత : లక్ష్మణ్ రావ్

సంగీతం : కృష్ణ చేతన్

సినిమాటోగ్రఫర్ : అమర్ బొమ్మిరెడ్డి

ఎడిటర్ : నరేష్ జొన్న

స్టోరీ, స్క్రీన్ ప్లే : రామ్ గణపతి రావ్

ఈ వారం రెండు పెద్ద సినిమాలతో పాటు ‘ఇ ఈ’ అనే చిత్రం కూడా విడుదలైంది. రామ్ గణపతిరావ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో నీరజ్ శ్యామ్, నైరాషా హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ :

సిద్దు (నీరజ్ శ్యామ్) కు అమ్మాయిలంటే అస్సలు పడదు. ప్రతి విషయంలోనూ వాళ్లకు వ్యతిరేకంగానే ఉంటాయి అతని ఆలోచనలు. కానీ అతను పనిచేసే కంపెనీకి హాసిని (నైరాషా) ఎండీగా వస్తుంది. మొదటిరోజు నుండి సిద్దు అంటే హాసిని పడదు.

అలా ఎప్పుడూ భిన్న ధ్రువాల్లా ఉండే వారిద్దరూ ఒక గురుజి సిద్దుకు పెట్టిన శాపం మూలాన ప్రేమలో పడతారు. కానీ ఇంతలోనే వేరొక అమ్మాయి వలన వారి ప్రేమలో కలహాలు ఏర్పడతాయి. దీంతో సిద్దు గురుజీని కలిసి శాప విమోచనం చేసుకుని తనకు తెలీకుండానే వేరొక శాపాన్ని పొందుతాడు. ఆ శాపం ఏంటి ? దాని వలన సిద్దు, హాసినిల జీవితాలు ఎలా తలకిందులయ్యాయి ? వాళ్ళు మళ్ళీ కలుసుకున్నారా లేదా ? అనేదే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

సినిమాకు ప్లస్ పాయింట్ సెకండాఫ్ కథనం. హీరో హీరోయిన్లు గురుజీ ఇచ్చిన రెండో శాపం కారణంగా ఆత్మలు ఒకరి శరీరాల నుండి ఇంకొకరి శరీరాల్లోకి మారుతాయి. అప్పటి నుండి మొదలయ్యే వాళ్ళ వింత జీవితం తమాషాగా సాగుతుంది. అప్పటి వరకు మెతగ్గా కనబడిన సిద్దు హాసినిలా తలపొగరుగా మారిపోవడం, గడుసుగా కనిపించిన హాసిని సిద్ధులా నెమ్మదిగా మారడం బాగుంది.

ఇక హీరో హీరోయిన్లు ఇంటర్వెల్ తర్వాత పాత్రలు మారిపోగానే నటనలో ఫస్టాఫ్ కు సెకండాఫ్ కు చాలా తేడా చూపించారు. ముఖ్యంగా హీరోయిన్ నైరాషా నటన ఇంప్రెస్ చేసింది. నీరజ్ శ్యామ్ పెర్ఫార్మెన్స్ కూడా కొన్ని చోట్ల బాగుంది. దర్శకుడు రామ్ గణపతిరావ్ మొదటి భాగాన్ని సరిగా హ్యాండిల్ చేయలేకపోయినా సెకండాఫ్ ను చాలా వరకు ఇంప్రెసివ్ గా చేశారు. హీరో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ మీద నడిచే కొన్ని సీన్స్ బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

సినిమాకు ప్రధాన మైనస్ ఫస్టాఫ్. ఫస్టాఫ్ ఇంటర్వల్ 10 నిముషాల ముందువరకు చాలా రొటీన్, బోర్ గా నడిచింది. అనవసరమైన సన్నివేశాలు కథానములో చాలానే ఉన్నాయి. ఆ కథనం కూడా పాతదే. ఇక కథలో కీలకమైన గురుజీ శాపాలు పెడుతుండటం అనే పాయింట్ కు ప్రేక్షకుడు కన్విన్స్ అయ్యే విధంగా వివరణ ఇవ్వలేకపోయారు దర్శకుడు. ఆ సన్నివేశాలు కూడా భలే సిల్లీగా, నమ్మశక్యం కానీ విధంగా అనిపిస్తాయి.

హీరో ఆఫీస్ కు సంబందించిన కొన్ని అనవసరమైన సన్నివేశాలు సినిమాను సాగదీయడానికే అన్నట్టు ఉన్నాయి. ఇక మధ్యలోకి వచ్చే పాటలు ముఖ్యంగా ఐటమ్ సాంగ్ తలనొప్పిగా అనిపించింది. హీరో హీరోల మధ్యన కథకు ముఖ్యమైన లవ్ ట్రాక్ సరైన రీతిలో పండలేదు. ఎక్కడా కూడా ఒకరి కోసం ఒకరు ఆరాటపడుతున్న భావన కలగలేదు. సినిమా ముగింపు కూడా చాలా బలహీనంగా ఉంటుంది.

సాంకేతిక విభాగం :

దర్శకుడు రామ్ గణపతిరావ్ తీసుకున్న పాయింట్ బాగానే ఉన్న దాన్ని ప్రేక్షకులు కన్విన్స్ అయ్యేలా చూపలేకపోయారు. సెకండాఫ్ కథనం మినహా ఫస్టాఫ్, క్లైమాక్స్ బోర్ కొట్టించాయి. కృష్ణ చేతన్ సంగీతం జస్ట్ ఓకే అనేలా ఉంది.

అమర్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ యావరేజ్ గా ఉంది. నరేష్ జొన్న తన ఎడిటింగ్ ద్వారా ఫస్టాఫ్ లోని కొన్ని సన్నివేశాలని తొలగించాల్సింది. నిర్మాతలు పాటించిన నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.

తీర్పు :

ఈ ‘ఇ ఈ’ చిత్రం యొక్క కాన్సెప్ట్ బాగానే ఉన్న ఎగ్జిక్యూషన్ కొంత సరిగా కుదరలేదు. బాగుందనిపించే సెకండాఫ్, అందులో హీరో హీరోయిన్ల పెర్ఫార్మెన్స్, కొన్ని కీలక సన్నివేశాలు, ఫ్యామిలీ ఎమోషన్స్ ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలు కాగా ప్రేక్షకుల్ని కన్విన్స్ చేయదగిన సీన్లు లేకపోవడం ప్రధాన బలహీనత. మొత్తం మీద ప్రేక్షకుల్ని సెకండాఫ్ నుండి ఎంటర్టైన్ చేయగల ఈ చిత్ర్రం కొత్త తరహా కాన్సెప్ట్ ఉన్న సినిమాల్ని, తమాషా కథనాన్ని కోరుకునే వారికి నచ్చుతుంది.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు