ఓటిటి సమీక్ష : ‘ఫర్జి’ – అమెజాన్ ప్రైమ్ లో తెలుగు డబ్బింగ్ సిరీస్

ఓటిటి సమీక్ష : ‘ఫర్జి’ – అమెజాన్ ప్రైమ్ లో తెలుగు డబ్బింగ్ సిరీస్

Published on Feb 12, 2023 3:06 AM IST
Farzi Web Series Review

విడుదల తేదీ : ఫిబ్రవరి 10, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు: షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి, కే కే మీనన్, రాశి ఖన్నా, భువన్ అరోరా, జాకీర్ హుస్సేన్, చిత్తరంజన్ గిరి, అమోల్ పాలేకర్, రెజీనా కాసాండ్రా, కావ్య థాపర్

దర్శకుడు : రాజ్ & డీకే

నిర్మాతలు: డి 2 ఆర్ ఫిలిమ్స్

సంగీత దర్శకులు: కేతన్ సోదా

సినిమాటోగ్రఫీ: పంకజ్ కుమార్

ఎడిటర్: సుమీత్ కోటియన్

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

ఇప్పటికే బుల్లితెర ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ దూసుకెళ్తున్న ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ నేడు ఫర్జి అనే మరొక థ్రిల్లింగ్ వెబ్ షో ని ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చింది. షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి, రెజీనా కాసాండ్రా, రాశి ఖన్నా వంటి నటులు కీలక పాత్రలు పోషించిన ఈ వెబ్ షో యొక్క సమీక్ష ఇప్పుడు చూద్దాం.

 

కథ :

చిన్న స్కెచ్ ఆర్టిస్ట్ గా తన జీవితాన్ని సాగిస్తుంటాడు సన్నీ ( షాదీ కపూర్). ఇక అతని తాతయ్య రన్ చేస్తున్న విప్లవ పత్రిక క్రాంతి పలు అప్పుల కారణంగా మూతపడుతుంది. దానితో మరొక దారిలేక తన స్నేహితుడు ఫిరోజ్ (భువన్ అరోరా) తో కలిసి దొంగనోట్ల ముద్రణని ప్రారంభిస్తాడు సన్నీ. దొంగనోట్ల చలామణిలో పేరుగాంచిన మన్సూర్ దలాల్ (కే కే మీనన్) సన్నీ యొక్క దొంగ నోట్ల ముద్రణ గురించి తెలుసుకుని అతడిని తన పార్టనర్ గా చేర్చుకుంటాడు. మరోవైపు మైఖేల్ (విజయ్ సేతుపతి) అనే టాస్క్ ఫోర్స్ అధికారి, ఇండియాలోని దొంగనోట్లని అరికట్టేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తుంటాడు. అందుకోసం ఒక టీమ్ ని ఏర్పాటు చేస్తాడు మైఖేల్, అందులో ఒక అధికారిణి గా మేఘన (రాశి ఖన్నా) పనిచేస్తూ ఉంటుంది. మరి ఇంతకీ ఫైనల్ గా మైఖేల్ ఆ దొంగనోట్ల ముఠాని పట్టుకున్నారా లేదా, మరి సన్నీ ఏవిధంగా తన తెలివిని ఉపయోగించాడు అనేటువంటి అంశాలు అన్ని కూడా తెరపై చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

నిజానికి ఎక్కువమంది ఆర్టిస్టులు కలిగిన ఇటువంటి షోని తెరపై చూపించాలి అంటే అది ఒకరకంగా రిస్క్ తో కూడుకున్నదే. అయితే అన్ని పాత్రలని సమానంగా హ్యాండిల్ చేస్తూ దర్శకులు రాజ్ అండ్ డీకే చాలా బాగా ఈ స్టోరీ ని తెరకెక్కించారు. ప్రతి ఒక్క పాత్ర ఈ షోలో ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంటుంది. అది మేఘన కానీ, దలాల్ కానీ, లేదా మరి ఇతర పాత్ర ఏదైనా కానీ. నిజానికి ఈ వెబ్ షో లో మరొక్కసారి తన ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ తో అదరగొట్టారు విలక్షణ నటుడు విజయ్ సేతుపతి, పలు సన్నివేశాల్లో ఆయన నటన ఎంతో బాగుంటుంది. ముఖ్యంగా సెంట్రల్ మినిష్టర్ తో ఆయన వ్యవహరించే టైంలో కామెడీ టైమింగ్, డైలాగ్స్ మరింత అలరిస్తాయి.

ఇక ముఖ్య పాత్ర చేసిన షాహిద్ కపూర్ ఫర్జి మూవీకి ప్రధాన ఆకర్షణ అని చెప్పాలి. కామెడీ, యాక్షన్, ఎమోషన్ ఇలా ప్రతి ఒక్క అంశంలో కూడా ఎంతో ఆకట్టుకున్నారు షాహిద్. ముఖ్యంగా దర్శకులు ఆ విధంగా తన పాత్రని అద్భుతంగా మలచడంతో పాటు అనుచరుడిగా నటించిన భువన్ అరోరా కూడా పెర్ఫార్మన్స్ అదరగొట్టారు. ఇక పెర్ఫార్మన్స్ కి మంచి స్కోప్ ఉన్న పాత్రలో కనిపించిన రాశి ఖాన్నా ఎంతో ఒదిగిపోయి నటించారు. కేకే మీనన్ కూడా అలరించారు. ఎలుక పిల్లి అట మాదిరిగా అటు పోలీసులు, ఇటు గ్యాంగ్ స్టర్స్ మధ్య వచ్చే ఛేజింగ్ సన్నివేశాలు ఏంటో బాగుంటాయి. షాహిద్ మరియు అతని గ్యాంగ్ దోపిడీ కోసం పేపర్ ఫ్యాక్టరీలోకి చొరబడే సన్నివేశం ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. ఆదిమాత్రమే కాదు చాలా సన్నివేశాలు మంచి లాజిక్ తో సాగుతాయి.

 

మైనస్ పాయింట్స్ :

అయితే ఈ వెబ్ షో కి కొంత మైనస్ ఎక్కువ నిడివి కలిగి ఉండడం. అది చూసే ఆడియన్స్ పై కొద్దిగా ప్రభావం చూపిస్తుంది. ఎడిటింగ్ విభాగం దీనిపై కొంత బాగా వర్క్ చేసి అక్కడక్కడా కొన్ని సీన్స్ ట్రిమ్ చేయాల్సింది. మధ్యలో వచ్చే కొన్ని సీన్స్ పర్వాలేదనిపిస్తాయి, వాటిని మరింత ఆకట్టుకునేలా తీయాల్సింది. భాష వాడకంతో పాటు వయొలెన్స్ తో కూడిన సీన్స్ ఈ షోకి కాస్త ఇబ్బంది అని చెప్పాలి.

 

సాంకేతిక విభాగం :

పంకజ్ కుమార్ ఫోటోగ్రఫి తో పాటు కేతన్ సోదా అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంతో బాగున్నాయి. ఈ వెబ్ షో కోసం నిర్మాతలు పెట్టిన ఖర్చు మనకు తెరపై చక్కగా కనపడుతుంది. అయితే ఎడిటింగ్ విభాగం వారి పనితీరు మాత్రం యావరేజ్ అనే చెప్పాలి. ఇక తెలుగు డబ్బింగ్ మాత్రం ఎంతో బాగుంది. ఇక దర్శకులు రాజ్ అండ్ డీకే ఇద్దరూ కూడా ఫర్జి వెబ్ షో ని ఎంతో ఆకట్టుకునేలా తెరకెక్కించారు. మధ్యలో వచ్చే ఎంటర్టైనింగ్ సీన్స్ తో పాటు చాలావరకు స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ గా ఉంటుంది. పాత్రధారుల యొక్క పెర్ఫార్మన్స్ ప్రధాన ఆకర్షణ. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ చూసేవారికి ఇందులో మంచి సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఉంది. అది ఎంతో బాగుంటుంది. ఫైనల్ గా ఈ వెబ్ షో యొక్క నిడివి మాత్రం కాస్త తగ్గించాల్సిందే.

 

తీర్పు :

మొత్తంగా చూసుకున్నట్లైతే, ఫర్జి వెబ్ షో మంచి సీన్స్, స్క్రీన్ ప్లే, పాత్రధారుల ఆకట్టుకునే పెర్ఫార్మన్స్, ఎంటర్టైన్మెంట్, కామెడీ, యాక్షన్ సీన్స్ వంటి వాటితో అలరిస్తుంది. అయితే అక్కడక్కడా కొంత ఇబ్బంది కలిగించే సీన్స్ తో పాటు ఎక్కువ రన్ టైం వంటివి
దీనిని ఇబ్బంది పెట్టె అంశాలు. అయితే హ్యాపీగా ఈ వెబ్ షోని మీ ఫ్యామిలీ తో చూసి ఎంజాయ్ చేయవచ్చు.

123telugu.com Rating: 3.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు