సమీక్ష : గౌరవం – స్లోగా సాగే మెలోడ్రామా

సమీక్ష : గౌరవం – స్లోగా సాగే మెలోడ్రామా

Published on Apr 19, 2013 10:10 PM IST
First Posted at 18:50 on Apr 19th
GouravamTelugu విడుదల తేదీ : 19 ఏప్రిల్ 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
దర్శకుడు : రాధా మోహన్
నిర్మాత : ప్రకాష్ రాజ్ 
సంగీతం : ఎస్. థమన్
నటీనటులు : అల్లు శిరీష్, యామి గౌతమి, ప్రకాష్ రాజ్ …

అల్లు వారి ఫ్యామిలీలో చిన్నవాడైన అల్లు శిరీష్ మెగా ఫ్యామిలీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. అందరిలా కాకుండా వైవిధ్యమైన కథను ఎంచుకొని ‘గౌరవం’ అనే సినిమాతో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాకి రాధా మోహన్ దర్శకత్వం వహించగా యామిని గౌతం, ప్రకాష్ రాజ్ లు ప్రధాన పాత్రలలో నటించారు. ఇప్పుడు ఈ సినిమా ఎలా వుందో? అల్లు శిరీష్ కి చెప్పుకోదగ్గ హిట్ అయ్యిందో లేదో చూద్దాం.

కథ :

అర్జున్ (శిరీష్) ఒక ధనవంతుని కుమారుడు, అతను చాలా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ వుంటాడు. ఒక రోజు అతని తండ్రి ఎస్.ఎమ్ పల్లి అనే గ్రామానికి బిజినెస్ పనిమీద పంపిస్తాడు. అర్జున్ బెస్ట్ ఫ్రెండ్ శంకర్ కూడా అదే గ్రామానికి చెందిన వాడు కావడంతో ఎంతో సంతోషంతో అక్కడకు వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన అర్జున్ కి ఆరు నెలల క్రితం ఆ ఊరిలో దనికుడైన భూస్వామి పశుపతి కూతురిని తన ఫ్రెండ్ శంకర్ తీసుకోని పారిపోయాడని తెలుస్తుంది. ఆ తర్వాత అర్జున్ శంకర్ తల్లిదండ్రులను కలిసి జరిగిన నిజాలను తెలుసుకుంటాడు. దానితో అర్జున్ అక్కడే వుండి తన ఫ్రెండ్ గురించి తెలుసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఈ విషయంలో యంగ్ లాయర్ యామిని (యామి గౌతమి) కూడా అర్జున్ కి సహాయ పడుతూ వుంటుంది. అర్జున్ ఎలా ఈ మిస్టరీని చేదించాడు? అసలు ఇంతకీ ఏం జరిగింది? ఆ ఊరి ప్రజలకి జరిగిన వాస్తవాన్ని ఎలా తెలియజేసాడో? తెలుసుకోవాలంటే ‘గౌరవం’ సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమా స్టోరీ చాలా కొత్తగా వుంది. అల్లు శిరీష్ ‘గౌరవం’ లాంటి డీసెంట్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. తను మాములుగా రొటీన్ కమర్షియల్ సినిమాలను కాకుండా ఒక వైవిద్యమైన సినిమాని ఎన్నుకున్నాడు. సెకండాఫ్ లోవచ్చే కొన్ని సన్నివేశాలలో శిరీష్ నటన బాగుంది. యామి గౌతం చూడడానికి చాలా అందంగా కనిపించింది. తన పాత్రకి పూర్తి న్యాయం చేసింది. ప్రకాష్ రాజ్ పాత్రకి పర్ఫెక్ట్ గా సరిపోయాడు కానీ ఆ పాత్రలో గొప్పగా చేయాల్సినంత ఏమీ లేదు. ఈ సినిమాలో సస్పెన్స్ ఎలిమెంట్స్ చాలా బాగున్నాయి. ప్రకాష్ రాజ్ కొడుకు పాత్రలో నటించిన అతను చాలా సూపర్బ్ గా నటించాడు. బ్రహ్మాజీ, ఎల్.బి శ్రీరామ్ ల నటన బాగుంది.

మైనస్ పాయింట్స్ :

‘గౌరవం’ సినిమా చాలా స్లోగా సాగుతూ మన ఆలోచనల్ని రేకెత్తించేలా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ సినిమా చాలా పెద్దగా వున్నట్టు అనిపిస్తుంది. సాంగ్స్ , డాన్స్ మరియు మిగిలిన కమర్షియల్ ఎలిమెంట్స్ ఏవి ఈ సినిమాలో లేవు. ఈ సినిమాలోని క్లైమాక్స్ లో ఎక్కువగా మెసేజ్ ఇచ్చారు. ఇంటర్వల్ ఎపిసోడ్, స్టూడెంట్స్ ఎపిసోడ్స్ ఆశించినంత స్థాయిలో లేవు. ఈ సినిమాలో యామి గౌతం పాత్రకి పెద్దగా ప్రాదాన్యత లేదు, శిరీష్ ప్రక్కన ఉండడానికే అన్నట్టుగా వుంది. కొన్ని సెంటిమెంట్ సీన్స్, నెగటివ్ ఎమోషన్ సన్నివేశాలు కాస్త బోర్తింగ్ గా అనిపిస్తాయి. ట్రాజిడీ, రియాలిటీని ఇష్టపడే తమిళ ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చుతుంది. అయితే ఇలాంటి సినిమాలు తెలుగు ప్రేక్షకులకు అంతగా నచ్చవు.

సాంకేతిక విభాగం :

‘గౌరవం’ సినిమాలోని పాటలు బిలో యావరేజ్ గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, విలేజ్ వాతావరణాన్ని చాలా బాగా చూపించారు. డైలాగ్స్ సింపుల్ గా ఉన్నాయి. రాధా మోహన్ అందించిన స్క్రీన్ ప్లే సెకండాఫ్ లో చాలా బాగుంది కానీ ఫస్ట్ హాఫ్ లోనే ఇంకాస్త బాగుండాల్సింది.

తీర్పు :

మొత్తంగా మనిషిలో ఆలోచనని రేకెత్తించే కొత్త స్టొరీ ‘గౌరవం’. సినిమా స్లోగా ఉండడం, ఎక్కువ సెంటి మెంట్ సీన్స్, తెలుగు ఆడియన్స్ మెచ్చే కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం చెప్పదగిన మైనస్ పాయింట్స్. మొదటి సినిమాలో అల్లు శిరీష్ నటన చాలా డీసెంట్ గా ఉంది.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

రివ్యూ – అవద్. ఎం

అనువాదం – నగేష్ మేకల

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు