సమీక్ష : హలో వరల్డ్ వెబ్ సిరీస్ (జీ5లో ప్రసారం )

సమీక్ష : హలో వరల్డ్ వెబ్ సిరీస్ (జీ5లో ప్రసారం )

Published on Aug 14, 2022 8:41 PM IST
 Karthikeya 2 Movie Review

విడుదల తేదీ : ఆగష్టు 12, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు: ఆర్యన్ రాజేష్, రామ్ నితిన్, నిఖిల్, సుదర్శన్, అనిల్ గీలా, నయన్ కరిష్మా, అపూర్వ అల్లా, నిత్యా శెట్టి, స్నేహల్ కామత్ తదితరులు.

దర్శకత్వం : శివ సాయి వర్ధన్

నిర్మాతలు: నిహారిక కొణిదెల

సంగీత దర్శకుడు: పి.కె.దండి

సినిమాటోగ్రఫీ: రాజు ఎదురురోలు

 

జీ 5లో ‘హలో వరల్డ్’ అనే మరో వెబ్ సిరీస్‌ మన ముందుకొచ్చింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే బ్యానర్‌పై నిహారిక కొణిదెల ఈ సిరీస్ ని నిర్మించారు, గీతా సుబ్రమణ్యం ఫేమ్ శివసాయి వర్ధన్ జలదంకి ఈ సిరీస్ కి దర్శకత్వం వహించారు, అయితే, ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం.

 

కథ:

వివిధ ప్రాంతాల నుంచి, వివిధ పరిస్థితుల నుంచి వచ్చిన ఎనిమిది మంది యువకులు భారీ ఐటీ కంపెనీలోకి అడుగుపెడతారు. వీరందరూ ఐటీ కంపెనీల వాతావరణం గురించి భిన్నమైన భావాలు కలిగి ఉంటారు. జీవితంలో తాము ఊహించిన దానికంటే చాలా ఎక్కువ ఉందని వీళ్లు అర్థం చేసుకుంటారు.
8 మంది వ్యక్తులు తమ సొంత కలలు కలిగి ఉన్నప్పటికీ చివరకు తమ కలలని నెరవేర్చుకోవడానికి ఎలా పోరాడారు అనేది మిగతా కథ. ఈ మధ్యలో రాఘవ్ (ఆర్యన్ రాజేష్), ప్రార్థన (సదా) వీరికి ఎలాంటి సపోర్ట్ చేశారు ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్లు :

ఈ సిరీస్ లో ఇష్టపడే మొదటి విషయం ఈ సిరీస్ నేపథ్యం. కార్పొరేట్ ప్రపంచంలోకి ప్రవేశించే కొత్త వారు ఎలా ఉంటారు ?, వారి ఆలోచనలు ఎలా ఉంటాయి ? అనే కోణంలో సాగిన ఈ సిరీస్ ఆసక్తిగా ఉంటుంది. ఇక ఈ సిరీస్ లో నటించిన ప్రధాన తారాగణంతో ప్రతి ఒకరు సులభంగా కనెక్ట్ అవుతారు. అలాగే, ఈ ప్రధాన పాత్రల నేపథ్యాలు కూడా బాగున్నాయి.

నటీనటుల ప్రదర్శన కూడా మంచి అనుభూతిని ఇస్తోంది. ఒకే ఫ్లేవర్‌ లో సాగే ఈ సిరీస్ లోని కొన్ని ఎలిమెంట్స్.. గతంలో వచ్చిన కొన్ని చిత్రాలలో చూసినప్పటికీ బాగానే ఆకట్టుకున్నాయి. అలాగే ఆఫీస్ బ్యాక్‌ డ్రాప్‌ లో వచ్చే సీన్స్, మరియు ప్రతి IT ఉద్యోగి సులభంగా రిలేట్ చేసుకోగలడు.

అలాగే విభిన్న పాత్రలతో రైటింగ్ టీమ్ అద్భుతమైన పని చేసింది. పాత్రల మధ్య బంధం అద్భుతంగా ప్రదర్శించబడింది. కొన్ని సన్నివేశాలను చూస్తుంటే.. స్నేహితులతో మన జ్ఞాపకాలను ఖచ్చితంగా నెమరువేసుకుంటాం. ప్రధాన తారాగణం అంతా సరసమైన పని చేశారు. ఆర్యన్ రాజేష్ మరియు సదా వారి వారి పాత్రలలో స్థిరమైన నటనను కనబర్చారు. కార్పొరేట్ ప్రపంచంలో డైనమిక్స్ మరియు సంఘర్షణలు చక్కగా ప్రదర్శించబడ్డాయి.

 

మైనస్ పాయింట్లు:

నటీనటుల ప్రదర్శన బాగున్నా.. ప్రధాన లోపాల విషయానికి వస్తే.. భాష అందరికీ సరిగ్గా అర్థం కాదు. ఈ సిరిస్ లో ఐటీకి సంబంధించిన చాలా సాంకేతిక అంశాలను ఉపయోగించారు. సాధారణ వీక్షకుడికి, ఇది తలకు మించిన బాష కావచ్చు. అక్కడక్కడా కొన్ని డబ్బింగ్ సమస్యలు కూడా ఉన్నాయి. అలాగే చివరి రెండు ఎపిసోడ్‌లు కాస్త తడబడ్డాయి.

ప్రదర్శన కార్పొరేట్ ప్రపంచానికి సంబధించి మంచి కంటెంట్ తీసుకున్నప్పటికీ, ప్లే చాలా స్లోగా లాజిక్ లెస్ గా సాగింది. ఉదాహరణకు, యువకులు జూమ్ మీట్‌లో కంపెనీ డైరెక్టర్‌తో కనెక్ట్ అవ్వడానికి సిస్టమ్‌ను హ్యాక్ చేయడం, అలాగే ప్రాజెక్ట్ కోసం అతన్ని ఒప్పించడం వంటి సన్నివేశాలు చాలా స్లోగా సాగాయి.

కొన్ని పాత్రలను మరింత మెరుగ్గా రాయొచ్చు. ఆర్యన్ రాజేష్ మరియు ఈ ఎనిమిది మంది మధ్య బలమైన సన్నివేశాలు లేవు.

 

సాంకేతిక అంశాలు:

తెలుగులో ఎక్కువ ఆఫీస్ డ్రామాలు రాలేదు. కాబట్టి ఈ సిరీస్ అందరికీ కనెక్ట్ అవుతుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సినిమాటోగ్రాఫర్ రాజు ఆఫీస్ లొకేషన్స్ ని బాగా క్యాప్చర్ చేసాడు. దండి సంగీతం బాగుంది. మరియు కథనానికి సరిపోయింది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ చాలా క్రిస్ప్ గా ఉంది. దర్శకుడు శివ సాయి వర్ధన్ విషయానికి వస్తే, అతను కార్పొరేట్ ప్రపంచంలోని కొన్ని పాత్రల ఆధారంగా చాలా ఆకర్షణీయమైన ప్రదర్శనను రూపొందించాడు.

 

తీర్పు:

ఈ ‘హలో వరల్డ్’ అనేది కార్పొరేట్ ప్రపంచాన్ని ఎస్టాబ్లిష్ చేస్తోంది. దర్శకుడు శివ సాయి వర్ధన్ ప్రధాన తారాగణం నుండి మంచి నటనను రాబట్టాడు. మరియు పర్ఫెక్ట్ గా పాత్రలను డిజైన్ చేసుకున్నాడు. ఈ సిరీస్‌ను మరింత మెరుగ్గా చేయడానికి కొన్ని అంశాలను మెరుగైన పద్ధతిలో జోడించి ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ, ఈ ఆఫీస్ డ్రామా బాగానే ఆకట్టుకుంది.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు