సమీక్ష : “హేయ్ సినామిక” – ఆకట్టుకోని సిల్లీ డ్రామా

సమీక్ష : “హేయ్ సినామిక” – ఆకట్టుకోని సిల్లీ డ్రామా

Published on Mar 4, 2022 3:01 AM IST
Hey Sinamika Review In Telugu

విడుదల తేదీ : మార్చి 03, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు: దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్, అదితి రావ్ హైదరీ, నక్షత్ర నగేష్

దర్శకత్వం : బృందా

నిర్మాత: జియో స్టూడియోస్ మరియు గ్లోబల్ వన్ స్టూడియోస్

సంగీత దర్శకుడు: గోవింద్ వసంత

సినిమాటోగ్రఫీ: ప్రీతా జయరామన్

ఎడిటర్ : రాధా శ్రీధర్

 

మళయాళ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ కోసం మన టాలీవుడ్ ఆడియెన్స్ కి కూడా కొంతమేర బాగానే తెలుసు. మరి ఈ హీరో సరసన అదితి రావు హైదరి హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం “హే సినామిక”. ఈరోజు విడుదల అయ్యిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

ఇక కథలోకి వచ్చినట్టు అయితే.. ఆర్యన్(దుల్కర్ సల్మాన్) మరియు మౌనా(అదితి రావు హైదరి) లు ఇద్దరు పెళ్ళైన జంటగా కనిపిస్తారు. అయితే ఈ ఇద్దరిలో ఆర్యన్ అతి ప్రేమ వల్ల మాత్రం మౌనా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది.. దీనితో అతడి నుంచి విడాకులు తీసుకోవాలని ఓ సైకాలజిస్ట్ మలార్(కాజల్ అగర్వాల్) ని సంప్రదిస్తుంది. అయితే ఇక్కడ నుంచి కట్ చేస్తే మలార్, ఆర్యన్ ని ప్రేమించడం మొదలు పెడుతుంది. తన సమస్య చెప్పుకోడానికి వెళ్లిన ఆమె భర్తపై మలార్ మనసు పారేసుకోవడం ఏంటి? ఈ మధ్యలో ఆర్యన్ ఎవరి వైపు నిలుస్తాడు? అతనంటే ఇష్టం ఉన్న మలార్ వైపా? తాను ఇష్టపడే.. తనంటే ఇష్టం లేని తన భార్య వైపా అనేది తెలియాలి అంటే ఈ సినిమాని చూసి తెలుసుకోవాలి.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ చిత్రం మొత్తంలో క్లైమాక్ ఒకింత బాగా ఇంప్రెస్ చేస్తుందని చెప్పాలి. అక్కడ ఎమోషన్స్ కానీ అన్ని సమస్యలకి ఇచ్చిన ముగింపు గాని ఆకట్టుకునే విధంగా అనిపిస్తాయి. అలాగే సినిమా చివరికి వచ్చే నాటికి దుల్కర్ తన నటనతో ఆకట్టుకుంటాడు.

కానీ ఈ సినిమాలో స్పెషల్ మెన్షన్ మాత్రం అదితికి ఇవ్వాలి. ఈమె ఈ సినిమాలో మంచి ఎమోషన్స్ ని పండించి తన పెర్ఫామెన్స్ తో కట్టిపడేస్తుంది. తన లుక్స్ తో మాత్రమే కాకుండా ఓ భర్త పట్ల తన భార్యకు ఉండే అన్ని హావభావాలను ఆమె చక్కగా అభినయపరిచింది. తన రోల్ వరకు ఇదో మంచి విషయం అని చెప్పాలి.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ చిత్రంలో మాత్రం డ్రా బ్యాక్ పెద్ద ఎత్తునే కనిపిస్తాయని చెప్పాలి. అసలేమాత్రం కొత్తదనం లేని కథ, కథనంలు పెద్ద మైనస్ లు కాగా వాటిపై ప్రధాన తారాగణం నుంచి సరైన ఎమోషన్స్ రాబట్టుకోలేకపోవడం మరో మైనస్. అస్లు దుల్కర్ లాంటి నటుడిని పెట్టుకొని అతని పాత్రని సరైన నరేషన్ కానీ డీటెయిల్స్ కానీ లేకుండా ఎస్టాబ్లిష్ చెయ్యడం బాగా నిరాశపరిచే అంశం.

పైగా దానికి తగ్గట్టే దుల్కర్ కూడా ఈ సినిమాలో చాలా డల్ గా కనిపిస్తాడు. ఇంకా అతడి పాత్ర అసలు ఎందుకు అలా ప్రవర్తిస్తుందో అర్ధ కాకుండా ఉంటుంది. అస్సలు ఈ సినిమా దుల్కర్ ఎందుకు ఎంచుకున్నాడో అతడికే తెలియాలి. అలాగే ఇద్దరి భార్యాభర్తల మధ్య వచ్చిన ఆ కాన్ ఫ్లిక్ట్ ని కూడా అంత ఎఫెక్టీవ్ గా ఎస్టాబ్లిష్ చేసినట్టు కనిపించదు.

సినిమా స్టార్టింగ్ కూడా ఏమంత ఆసక్తిగా ఉండదు ఆ తర్వాత కూడా ఆసక్తిగా సాగదు. ఇక అలాగే ఇంకో పెద్ద మైనస్ ఏమిటంటే కాజల్ చేసిన మలార్ అని చెప్పాలి. ఈమె తన పాత్రలో ఏ సినిమాలో కూడా చూపించని విధంగా కనిపిస్తుంది. లుక్స్ పరంగా అయితే కాజల్ ఈ సినిమాలో బాగా డిజప్పాయింటింగ్ గా ఉంటుంది.

అలాగే ఈ పాత్ర కూడా చాలా సిల్లీ గా ఎంటర్ అయ్యినట్టు అనిపిస్తుంది. ఎక్కడా పొంతన లేకుండా చాలా సిల్లీ పాయింట్స్ తో ఈమె రోల్ కనిపిస్తుంది. వీటితో పాటుగా సినిమా ఫస్ట్ హాఫ్ అయితే ఆడియెన్స్ సహనానికి పరీక్షే అని చెప్పాలి. ఎటెటో తీసుకెళ్లే నరేషన్ పైగా సాగదీతగా అనిపించడం అదితి చేసిన రోల్ లో కూడా ఎన్నో లోపాలు కనిపించడం సినిమాపై ఆసక్తి మరింత సన్నగిల్లేలా చేస్తాయి.
 

సాంకేతిక వర్గం :

 

ఈ చిత్రంలో సాంకేతిక విభాగంలో మ్యూజిక్ వర్క్ బాగుంది, అలాగే కెమెరా వర్క్ కూడా బానే ఉంది. అలానే తెలుగు డబ్బింగ్ కూడా బాగానే వచ్చింది. కానీ ఎడిటింగ్ లో ఓ 15 నిముషాలు తీసేయాల్సింది. ఇక ఈ సినిమా డైరెక్షన్ కి వస్తే..

ఈ సినిమాకి గాను ఫీమేల్ కొరియోగ్రాఫర్ బృంద మొదటిసారి దర్శత్వంలోకి ఎంటర్ అయ్యి పరిచయం అయ్యారు. అయితే ఈమె మొదటి ప్రయత్నమే వైఫల్యంతో స్టార్ట్ అయ్యిందని చెప్పక తప్పడంలేదు. పరమ రొటీన్ ప్లాట్ లైన్ ని తీసుకొని దాన్ని అంతకు మించి డల్ నరేషన్ చాలా లోటు పాట్లు తో తెరకెక్కించారు.

సినిమాలో లాస్ట్ పది పదిహేను నిమిషాలు మినహా చెప్పుకోడానికి అంత గొప్ప అంశాలే ఈ సినిమాలో కనిపించవు. అలాగే దుల్కర్, కాజల్ లాంటి నటులని పెట్టుకొని కూడా వారిని సరిగ్గా వినియోగించుకోలేకపోయారు. ఓవరాల్ గా అయితే డైరెక్షన్ లో తాను ఇంకా గ్రౌండ్ వర్క్ చెయ్యాల్సి ఉంది.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ “హే సినామికా” చిత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోదని చెప్పాలి. ఒక్క అదితి రావు హైదరి పెర్ఫామెన్స్ లాస్ట్ 15 నిమిషాలు అలా తప్ప మిగతా అన్ని అంశాల్లో ఈ సినిమా విఫలం అయ్యింది. సరైన నరేషన్ లేకపోవడం, అనేక సిల్లీ అంశాలు సహా లాజిక్స్ మిస్ అవ్వడం వంటివి ఆడియెన్స్ ని ఏమాత్రం మెప్పించవు. ఒకవేళ ఈ సినిమా చూసే ఉద్దేశం ఉంటే అది మీరు మానుకుంటేనే మంచిది.

 

123telugu.com Rating : 2/5

Reviewed by 123telugu Team

 

Click Here For English Version

సంబంధిత సమాచారం

తాజా వార్తలు