ఓటిటి సమీక్ష : ఆనంద్ దేవరకొండ “హైవే” – తెలుగు చిత్రం ‘ఆహా’ లో

ఓటిటి సమీక్ష : ఆనంద్ దేవరకొండ “హైవే” – తెలుగు చిత్రం ‘ఆహా’ లో

Published on Aug 20, 2022 3:01 AM IST
highway Movie Review

విడుదల తేదీ : ఆగష్టు 19, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు: ఆనంద్ దేవరకొండ, అభిషేక్ బెనర్జీ, మానస రాధాకృష్ణన్, సయామి ఖేర్

దర్శకత్వం : కేవీ గుహన్

నిర్మాతలు: వెంకట్ తలారి

సంగీత దర్శకుడు: సైమన్ కె కింగ్

సినిమాటోగ్రఫీ: కేవీ గుహన్

ఎడిటర్: తమ్మిరాజు

 

లేటెస్ట్ గా ఓటిటి లో రిలీజ్ కి వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ చిత్రం “హై వే”. యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ అలాగే ప్రముఖ సినిమాటోగ్రాఫర్ టర్న్డ్ దర్శకుడు కే వి గుహన్ తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ ఇది. అయితే ఈ సినిమా మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా లో లేటెస్ట్ గా డైరెక్ట్ రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

ఇక కథలోకి వచ్చినట్టు అయితే.. విష్ణు(ఆనంద్ దేవరకొండ) ఒక ఫోటోగ్రాఫర్ తన జాబ్ కోసం అని బెంగళూర్ కి స్టార్ట్ అవుతాడు. అలాగే మరోపక్క తులసి(మానస రాధాకృష్ణన్) తన తల్లితో ఓ పౌల్ట్రీ ఫామ్ లో పనిచేస్తుంది. కానీ అక్కడ తన ఓనర్ వేధింపులు చూడలేక అక్కడ నుంచి పారిపోతుంది.. మరి ఇదిలా ఉంటే మరో పక్క ఓ సీరియల్ కిల్లర్ డి అలియాస్ దాస్(అభిషేక్ బెనర్జీ) వరుసగా 5 హత్యలు అందులోని ఆడవాళ్లనే చంపుతాడు. మరి దీనితో అతన్ని పట్టుకోవాలని పోలీసులు తీవ్రంగా గాలిస్తూ ఉంటారు. దీనితో అతడు వారి నుంచి తప్పించేకునే ప్రయత్నంలో అటు దాస్, తులసి లు ఇటు ఈ సైకో.. మరి ఈ ముగ్గురు ఎక్కడైనా ఎదురవుతారా? ఎదురయితే ఆ సైకో కిల్లర్ ఏం చేస్తాడు? ఇంతకీ పోలీసులు అతన్ని పట్టుకుంటారా లేదా అనేది తెలియాలి అంటే ఈ సినిమాని ఆహా లో చూడాల్సిందే.

 

 

ప్లస్ పాయింట్స్ :

ఈ చిత్రంలో ఆకట్టుకునే అంశాలు చాలానే ఉంటాయని చెప్పొచ్చు.. సినిమా మెయిన్ గా మూడు ప్రధాన పాత్రల మీద నడుస్తుంది. హీరో హీరోయిన్ అలాగే కిల్లర్ పాత్రలు ఆధ్యంతం ఆకట్టుకుంటాయి. వీటిని అయితే దర్శకుడు బాగా డిజైన్ చేశారు. అలాగే సినిమాలో స్టార్టింగ్ గాని విలన్ పాత్రకు సంబంధించి డెవలప్మెంట్ ఆసక్తిగా అనిపిస్తాయి. అంతే కాకుండా దానికి ఇచ్చిన ముగింపు అన్నీ కూడా బాగున్నాయి.

ఇక నటీనటుల విషయానికి వస్తే మెయిన్ లీడ్ ఆనంద్ దేవరకొండ అలాగే యంగ్ హీరోయిన్ మానస రాధా కృష్ణన్ ఆకట్టుకుంటారు. ఆనంద్ నుంచి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన మరో సినిమా ఇది. తాను ఇంతకు ముందు చేసిన వాటికన్నా మంచి మెచ్యూర్ రోల్ లో తాను కనిపించి ఆకట్టుకుంటాడు. అలాగే మానస రాధాకృష్ణన్ పవన్ ఫ్యాన్స్ కి బాగా తెలిసి ఉండొచ్చు..

ఆ టైం లో పవన్ 28వ సినిమాకి అంటూ బజ్ తెచ్చుకున్న ఈ హీరోయిన్ ని ఈ సినిమాకి ఎంపిక చేయగా ఈమె ఈ సినిమాతో డెఫినెట్ గా ఆశ్చర్యపరుస్తుంది. తన క్యూట్ లుక్స్ సహా నటనతో కూడా ఆకట్టుకుంది. మరి నటుడు అభిషేక్ బెనర్జీ అయితే తన సైకో పాత్రలో ఇంటెన్స్ పెర్ఫామెన్స్ ని చూపించాడు. తనదైన మ్యానరిజమ్స్.. నటనతో థ్రిల్ చేసాడు. ఇక సైయామి ఖేర్ తదితరులు సినిమాలో తమ పాత్రలకి బ్యాయం చేకూర్చారు.

 

 

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాలో కొన్ని అంశాలు లాజికల్ గా బాగానే అనిపిస్తాయి కానీ కొన్ని సీన్స్ విషయంలో మాత్రం లాజిక్స్ మిస్ అవ్వడంతో మాత్రం అవి ఇరికించినట్టుగా అనిపిస్తుంది. అలాగే మంచి ఆసక్తిగా ఉండే సినిమాలో కథతో సాగే విధంగా పాటలు ఉంటే బాగుంటుంది కానీ కావాలని పాటల్ని పెడితే అవి ఏమాత్రం వర్కౌట్ కావు సరిగా ఈ సినిమాలో కూడా అదే జరిగింది.

అలాగే మరికొన్ని సన్నివేశాల్లో అయితే కథనం కాస్త నెమ్మదించినట్టుగా అనిపిస్తుంది. దీనితో బోర్ భావన కలగొచ్చు. అలాగే సినిమాలో కొన్ని సీన్స్ ని మరింత ఇంట్రెస్టింగ్ మార్చే స్కోప్ ఉన్నా దర్శకుడు ఆ స్క్రీన్ స్పేస్ ని వినియోగించలేదు. అలాగే పలు చోట్ల గ్రాఫికల్ విజువల్స్ క్లియర్ గా తెలిసిపోతాయి..

 

సాంకేతిక వర్గం :

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు డీసెంట్ గా ఉన్నాయని చెప్పొచ్చు. ఇక టెక్నీకల్ టీం లో అయితే సైమన్ కే ఇచ్చిన పాటలు పర్వాలేదు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం సినిమాకి తగ్గట్టుగా ఓ రేంజ్ లో అనిపిస్తుంది. అలాగే డైలాగ్స్ బాగున్నాయి. ఎడిటింగ్ పర్వాలేదు..

ఇక సినిమాటోగ్రఫీ మరియు దర్శకత్వం వహించిన కేవీ గుహన్ విషయానికి వస్తే…సినిమాటోగ్రాఫర్ తాను మంచి వర్క్ ని అందించాడు. ఇక దర్శకునిగా కూడా పర్వాలేదని చెప్పొచ్చు. మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లాజిక్స్ తో పాత్రలను కలపడం, వాటికీ మంచి ముగింపు ఇవ్వడంతో ఇంప్రెస్ చేస్తాడు. కాకపోతే చిన్న చిన్న లోపాలు కూడా ఉన్నాయి. వాటిని సరి చేసుకుంటే ఇంకా బెటర్ నరేషన్ ని ఇవ్వగలడు.

 

తీర్పు :

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “హై వే” చిత్రంలో ఆకట్టుకునే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అలాగే ప్రధాన పాత్రలకి మంచి లాజిక్స్ తో కూడిన స్టార్ట్ ఎండ్ ఉంటాయి. కాకపోతే దర్శకుడు కొన్ని చోట్ల మాత్రం కథనం నెమ్మదిగా నడపడం, మరికొన్ని చోట్ల చిన్నపాటి లాజిక్స్ మిస్సవ్వడం వంటివి ఫ్లో ని దెబ్బ తీస్తాయి. వీటిని పక్కన పెడితే ఓ డీసెంట్ థ్రిల్లర్ ని చూడాలి అనుకుంటే ఈ సినిమా తప్పకుండా చూడొచ్చు.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు