ఓటిటి రివ్యూ : “హనీ మూన్” – తెలుగు వెబ్ సిరీస్ “ఆహా”లో ప్రసారం

Published on Nov 29, 2020 8:00 pm IST

తారాగణం: నాగభూషణ్, సంజన ఆనంద్, పవన్ కుమార్, అపూర్వ భరద్వాజ్, ఆనంద్ నినాసం, మహాదేవ్, పూర్ణ, అర్చన కోటిగే

నిర్మాతలు: నివేదా శివరాజ్ ‌కుమార్ & సక్కత్ స్టూడియో

దర్శకత్వం: సక్కత్ స్టూడియో క్రియేటివ్ టీంతో నాగభూషణ్

డాప్: శ్రీషా కుదువల్లి – రాహుల్ రాయ్

సంగీతం: వాసుకి వైభవ్

ఎడిటర్: ప్రదీప్ నాయక్

మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ “ఆహా”లో లేటెస్ట్ గా టీజర్ తో మంచి బజ్ ను సంతరించుకున్న తెలుగు వెబ్ సిరీస్ “హనీ మూన్”. అలా డీసెంట్ బజ్ నడుమ ఆహా లో స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం రండి.

 

కథ :

ఓ కొత్తగా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా పెళ్లి జంట ప్రవీణ్(నాగభూషణ్) అలాగే తేజశ్వని(సంజన) వారి హనీమూన్ కోసం కేరళకు వెళ్తారు. అయితే ప్రవీణ్ చాలా నెమ్మదస్తుడు పెద్దగా ఏ విషయంలోనూ ఓపెన్ కాడు. కానీ తేజశ్విని అలా కాదు చాలా ఓపెన్ మైండెడ్ అండ్ డామినేటింగ్ గా ఉంటుంది. మరి అసలు పూర్తి భిన్నమైన మైండ్ సెట్ ఉన్న ఈ ఇద్దరు జంట నడుమ వారి హనీ మూన్ లో ఏం జరిగింది. లాస్ట్ కి ఈ ఇద్దరు ఏమవుతారు అన్నదే అసలు కథ.

 

ఏమి బాగుంది?

ఈ సిరీస్ కి ప్రధాన ఆకర్షణ ఏమిటంటే అది మంచి కథనం అని చెప్పాలి. దర్శకుడు రాసుకున్న విధానమే కాదు దాన్ని ఆవిష్కరించిన విధానం చాలా బాగుంది. ఇద్దరి జంట నడుమ ఎంగేజింగ్ గా సాగే డ్రామా చాలా ప్లెసెంట్ గా ఉంటుంది. అలాగే పెళ్ళైన కొత్త జంట మధ్య ఉండే చిన్న చిన్న స్పర్ధలు, గొడవలును మంచి ఎమోషనల్ గా చూపించారు.

ఇక నటీనటుల విషయానికి వస్తే మెయిన్ లీడ్ నాగభూషణ్ సంజనాలు మంచి ఎస్సెట్ అని చెప్పాలి. వారు తమదైన మెచ్యూర్ నటనతో ఆకట్టుకున్నారు. ఎమోషన్స్ డైలాగ్స్ బాగా పండించారు. ఇక అలాగే ఈ సిరీస్ ఇంత బాగా రావడానికి నిర్మాతల నిర్మాణ విలువలు కూడా దోహదపడ్డాయి. మంచి కెమెరా వర్క్, నిర్మాణ విలువలు, ఎడిటింగ్ వర్క్, కొన్ని లొకేషన్స్ ఇలా అన్ని ఈ సిరీస్ లో బాగా అనిపిస్తాయి.

 

ఏమి బాగాలేదు?

మెయిన్ లీడ్ అయినటువంటి ఇద్దరి లైఫ్ లో పెళ్ళికి ముందు జీవితాల కోసం చూపించిన కొన్ని సన్నివేశాలు అంతగా ఇంప్రెస్ చెయ్యవు అలాగే కామెడీ కూడా అంతగా వర్కౌట్ కాలేదు.

ఇక అలాగే ఈ సిరీస్ ను మరిన్ని ఎపిసోడ్స్ తీసే స్కోప్ ఉన్నా కేవలం 6 ఎపిసోడ్స్ తోనే ముగించేయడం కాస్త బాధాకరం. వీటికి మించి ఇంకా ఈ సిరీస్ లో వేలెత్తి చూపే అంశాలు ఉండవు.

 

తీర్పు :

ఇక మొత్తంగా చూసుకుంటే ఈ హనీమూన్ సిరీస్ ఆకట్టుకునే కథనం, నటీనటుల పెర్ఫామెన్స్ లు మరియు ఎమోషన్స్ తో మంచి ఇంప్రెసివ్ గా ఉంటుంది. కాకపోతే కొన్ని అనవసర సన్నివేశాలు రిపీటెడ్ అనిపించే స్క్రీన్ ప్లే లను పక్కన పెడితే ఈ డీసెంట్ వెబ్ సిరీస్ ను ప్రతీ ఒకరు చూడవచ్చు.

Rating: 3/5

సంబంధిత సమాచారం :

More