సమీక్ష : “కబ్జ” – బోరింగ్ యాక్షన్ డ్రామా

Kabzaa Movie Review In Telugu

విడుదల తేదీ : మార్చి 17, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు: ఉపేంద్ర, కిచ్చా సుదీప్, శివ రాజ్‌కుమార్, శ్రియ శరణ్, మురళీ శర్మ, పోసాని కృష్ణ మురళి, కోట శ్రీనివాసరావు, జాన్ కొక్కెన్, సుధ, అనూప్ రేవన్న, కబీర్ సింగ్ దుహన్, దేవ్ గిల్ & ఇతరులు

దర్శకుడు : ఆర్ చంద్రు

నిర్మాతలు: ఆర్ చంద్రు

సంగీత దర్శకులు: రవి బసృర్

సినిమాటోగ్రఫీ: ఏజే శెట్టి

ఎడిటర్: మహేష్ ఎస్ రెడ్డి

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

పాన్ ఇండియా మార్కెట్ లో ఓ రేంజ్ లో రైజ్ అవుతున్న సినిమా పరిశ్రమలో కన్నడ ఇండస్ట్రీ కూడా ఒకటి. మరి వీరి నుంచి లేటెస్ట్ గా వచ్చిన మరో సాలిడ్ పీరియాడిక్ మల్టీ స్టారర్ చిత్రమే “కబ్జ”. రియల్ స్టార్ ఉపేంద్ర, కిచ్చా సుదీప్ మరియు స్టార్ హీరో శివన్న కలయికలో దర్శకుడు ఆర్ చంద్రు తెరకెక్కించిన ఈ సినిమా అంచనాలు అందుకునేలా ఉందో లేదో సమీక్షలో చూద్దాం రండి.

 

కథ :

 

ఇక కథలోకి వస్తే..ఓ స్వాతంత్ర ఉద్యమ కుటుంబం నుంచి వచ్చిన ఆర్కేశ్వర(ఉపేంద్ర) భారత వైమానిక దళంలో ఆఫీసర్ గా పని చేస్తూ ఉంటాడు. అయితే తాను, మధుమతి(శ్రేయ శరణ్) లు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోగా మరోపక్క అమరాపుర ప్రాంతంలో పాలిటిక్స్, గ్యాంగ్ స్టర్ లు ఆ ప్రాంతంలో పైచేయి కోసం మారణ కాండతో దానిని పెద్ద క్రైమ్ వరల్డ్ గా మార్చేస్తారు. మరి ఇలాంటి ఓ సామ్రాజ్యంలోకి ఆర్కేశ్వర ఎందుకు అడుగు పెడతాడు? తాను వచ్చి ఈ మాఫియాలో ఎలా నిలబడిగలిగాడు? అలాగే ఈ కథలో నటులు కిచ్చా సుదీప్, శివన్న ల పాత్రలు ఎంత ప్రభావం చూపాయి అనేది తెలియాలి అంటే ఈ సినిమాని వెండితెరపై చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ చిత్రంలో కనిపించే గ్రాండ్ విజువల్స్ కొన్ని సన్నివేశాల్లో ఇంప్రెసివ్ గా ఉంటాయని చెప్పాలి. కొన్ని సీన్స్ ని సాలిడ్ లెవెల్లో చూపించారు. అలాగే ఈ సినిమాలో యాక్షన్ బ్లాక్ లు కూడా బాగానే వర్కౌట్ అవుతాయి. ఇంటర్వెల్, సహా సినిమాలో కనిపించే యాక్షన్ సీక్వెన్స్ లు మంచి యాక్షన్ ని కోరుకునే ఆడియెన్స్ కి అయితే బాగానే అనిపిస్తాయి.

ఇక నటీ నటుల్లో అయితే ఉపేంద్ర నటన కోసం మన తెలుగు ఆడియెన్స్ కి కూడా బాగా తెలుసు. తన ప్రతి ఎమోషన్ కోసం తెలిసిన వారు ఉపేంద్ర నటనతో అయితే ఈ సినిమాలో ఇంప్రెస్ అవుతారు. తన లుక్ గాని యాక్షన్ గాని సినిమాలో సాలిడ్ గా ఉంటాయి. ఇక క్యామియో రోల్స్ లో కనిపించిన కిచ్చా సుదీప్ మరియు శివ రాజ్ కుమార్(శివన్న) లు తమదైన పాత్రలతో సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచారు.

 

మైనస్ పాయింట్స్ :

 

ఇక ఈ సినిమాలో నిరాశ పరిచే అంశాలు విషయానికి వస్తే..ఈ సినిమా టీజర్ చూసినప్పుడే చాలా మందికి టేకింగ్ అంతా ఆల్రెడీ చూసిన కేజీయఫ్ ని తలపించింది. దీనితో మళ్ళీ ఆ తరహా సినిమానే మళ్ళీ మళ్ళీ తీయడం ఎందుకు చాలా మందిలో అనిపించింది. అయితే కంప్లీట్ సినిమాలో ఏమన్నా కొత్తగా ఉంటుందా అనుకుంటే.. లేదనే చెప్పాలి.

చాలా వరకు కేజీయఫ్ తరహాలోనే సినిమాలో సన్నివేశాలు అగుపిస్తాయి. దీనితో మరోసారి వేరే ప్రపంచపు కేజీయఫ్ చూసినట్టే అనిపించక మానదు. వీటితో పాటుగా సినిమాని వాయిస్ ఓవర్ లో నరేట్ చేయడం, కొన్ని యాక్షన్ సీన్స్ కూడా ఆ సినిమానే తలపిస్తాయి. ఇలా కబ్జ చూస్తున్నంతసేపు కేజీయఫ్ చాలా మంది మైండ్ లో రన్ అవ్వొచ్చు. ఇక ఈ సినిమా లైన్ కూడా రొటీన్ గానే ఉంది.

అలాగే మరో ప్రధాన మైనస్ ఏదైనా ఉంది అంటే సినిమాలో సరైన ఎమోషన్స్ సినిమాలో లేకపోవడం అని చెప్పాలి. కథనం ఎలాగో రొటీన్ గా ఉన్నప్పటికీ సరైన సాలిడ్ ఎమోషన్స్ పడి ఉంటే వాటితో అయినా ఈ సినిమా కాస్త ఎంగేజింగ్ గా ఉండేది. ఇక అలాగే సెకండాఫ్ లో చాలా సీన్స్ ఆడియెన్స్ కి బోర్ గా అనిపించవచ్చు. లవ్ ట్రాక్ హైలైట్ అవ్వలేదు, ఆకట్టుకోని నరేషన్ వంటివి బాగా డిజప్పాయింట్ చేస్తాయి.

 

సాంకేతిక వర్గం :

 

ఈ సినిమాలో నిర్మాణ విలువలకి మాత్రం ఎలాంటి వంక పెట్టడానికి లేదు. సినిమాకి పెట్టిన ఖర్చు పీరియాడిక్ విజువల్స్ ని ఆ వాతావరణాన్ని బాగా చూపించారు. ఇందులో సినిమాటోగ్రఫీ బాగా హైలైట్ అయ్యింది. ఇక సంగీత దర్శకుడు రవి బసృర్(కేజీయఫ్ ఫేమ్) ఇచ్చిన స్కోర్ బాగా ఓవర్ డెసిబుల్స్ లో ఉంది. ఎడిటింగ్ బాగా చెయ్యాల్సింది. అలాగే తెలుగు డబ్బింగ్ కూడా మరీ అంత బాగాలేదు.

ఇక దర్శకుడు ఆర్ చంద్రు విషయానికి వస్తే..తాను మాత్రం డిజప్పాయింట్ చేస్తాడని చెప్పక తప్పదు. సినిమాలో గ్రాండ్ విజువల్స్ ని ప్రెజెంట్ చేయడంలో పెట్టిన శ్రద్ధ సినిమా కథ కథనాల్లో తాను పెట్టలేదు. చాలా వరకు కేజీయఫ్ షేడ్స్ లోనే సినిమాని ప్రెజెంట్ చేసిన విధానం పెద్దగా కొత్త ట్రీట్ ని ఏమీ ఇవ్వదు. పైగా బోరింగ్ నరేషన్ సినిమాని మరింత నీరుగారుస్తుంది. ఓవరాల్ గా అయితే తన వర్క్ బాగాలేదు.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “కబ్జ” లో యాక్షన్ గ్రాండ్ విజువల్స్ మరియు క్యాస్టింగ్ అనే పేరు తప్ప అసలు సినిమాలో పెద్దగా విషయమే లేదు. సరైన కథ, కథనాలు లేవు పైగా ఎమోషన్స్ కూడా అంతగా వర్కౌట్ కావు. దీనితో ఏదో ఊహించుకొని సినిమాకి వెళ్లిన వారికి ఈ సినిమా బోరింగ్ ట్రీట్మెంట్ తో నిరాశే మిగులుస్తుంది.

123telugu.com Rating: 2/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :