సమీక్ష : “కొరమీను” – స్లో గా ఉన్నా మెప్పిస్తుంది

సమీక్ష : “కొరమీను” – స్లో గా ఉన్నా మెప్పిస్తుంది

Published on Dec 31, 2022 6:08 PM IST
Korameenu Movie-Review-In-Telugu

విడుదల తేదీ : డిసెంబర్ 31, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: ఆనంద్ రవి, కిషోరి ధాత్రక్, హరీష్ ఉత్తమన్, శత్రు, రాజా రవీందర్

దర్శకుడు : శ్రీపతి కర్రి

నిర్మాత: పెళ్లకూరు సామాన్య రెడ్డి

సంగీత దర్శకులు: అనంత నారాయణన్ AG

సినిమాటోగ్రఫీ: కార్తీక్ కొప్పెర

ఎడిటర్: విజయ్ వర్ధన్ కె

 

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో మరి చిన్న బడ్జెట్ చిత్రం “కొరమీను” కూడా ఒకటి. యువ నటీనటులు ఆనంద్ రవి, కిశోరి ధాత్రక్, శత్రు తదితరులు నటించిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

ఇక కథలోకి వస్తే..విజయవాడకి చెందిన ఐపీఎస్ ఆఫిసర్ మీసాల రాజుగా పిలవబడే సీతారామరాజు(శత్రు) తన డ్యూటీ లో చాలా స్ట్రిక్ట్ అండ్ క్రిమినల్స్ పాలిట సింహ స్వప్నం లాంటి వాడు కాగా తాను వైజాగ్ కి ట్రాన్స్ఫర్ అవుతాడు. మరి అక్కడ ఊహించని రీతిలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతడి మీసాన్ని గీసేస్తారు. దీనితో అక్కడ నుంచి బాగా ఇరిటేట్ అయ్యిన తాను వైజాగ్ లో కరుణ(హరీష్ ఉత్తమన్) అనే డ్రగ్ డీలర్ ఇల్లీగల్ వ్యవహారాలు తెలుసుకుంటాడు. మరి ఇక్కడ నుంచి తనకి ఎదురైన సవాళ్లు ఏంటి? కరుణ కి తన డ్రైవర్ కోటి(ఆనంద్ రవి) కి ఉన్న ఇష్యూ ఏంటి? ఇంతకీ రామరాజు ఎలాంటి స్టెప్ లు తీసుకున్నాడు ఇందులో మీనాక్షి(కిశోరి ధాత్రక్) పాత్ర ఎంతవరకు ఉంది అనేది తెలియాలి ఈ సినిమా చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఇది చిన్న సినిమానే కదా రెగ్యులర్ గానే ఉంటుంది అనుకుంటే ఆడియెన్స్ తప్పులో కాలేసినట్టే అని చెప్పాలి. కొన్ని సినిమాలు పెద్దగా ఎవరికీ తెలియకపోయినప్పటికీ మంచి కంటెంట్ కొత్త లైన్స్ తో వస్తాయి అని ఈ కోరమీను చెప్తుంది. మరి అందుకు తగ్గట్టే ఈ సినిమాలో పాత్రలు కానీ నరేషన్ కానీ ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది.

ఈ సినిమాలో మూడు ముఖ్య పాత్రలు కనిపిస్తాయి. మరి వాటిలో ముగ్గురు నటులు శత్రు, హరీష్ అలాగే ఆనంద్ రవిలు మంచి నటనను కనబరిచారు. డెఫినెట్ గా ఈ ముగ్గురు నటులు కూడా తమ షేడ్స్ తో, అత్యంత సహజమైన నటనతో సినిమాకి మరింత ప్లస్ అయ్యారు.

అలాగే ఈ ముగ్గురు పాత్రల మధ్య కనెక్షన్ కూడా సినిమాలో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇక ఈ సినిమాలో నటి కిశోరీ మరి హైలైట్ గా చెప్పుకోవాలి. మీనాక్షి పాత్రలో ఆమె ఒదిగిపోయింది. ఈమె పాత్ర కూడా కాస్త కొత్తగానే ఉంటుంది. అలాగే చివరి 20 నిమిషాల సినిమా నరేషన్ ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ సినిమాలో లైన్ కాస్త కొత్తగానే ఉన్నప్పటికీ నరేషన్ మాత్రం చాలా సీన్స్ లో స్లో గా సాగుతుంది. దీనితో ఆ కొన్ని సన్నివేశాలు మాత్రం మిగతా సినిమాపై ప్రభావం చూపిస్తాయి. అలాగే వాటి మూలాన సినిమా కూడా కాస్త పెద్దగానే ఉన్నట్టు అనిపిస్తుంది. అలాగే మరికొన్ని పాత్రలు అయితే మరింత బలంగా వాటిని డీటెయిల్స్ తో చూపించి ఉంటే బాగుండేది.

అలాగే ఎమోషన్స్ ని కూడా మరింత స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే కొన్ని సీన్స్ ఇంకా బెటర్ గా అనిపించేవి. ఇక సెకండాఫ్ లో నరేషన్ అంత గ్రిప్పింగ్ స్టార్ట్ లో అయితే కనిపించదు. దీనితో సెకండాఫ్ సో సో గానే అనిపిస్తుంది. మళ్ళీ లాస్ట్ లో కొంచెం పికప్ అవుతుంది.

 

సాంకేతిక వర్గం :

 

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. టెక్నీకల్ టీం లో అనంత నారాయణన్ ఇచ్చిన సంగీతం బాగుంది. అలాగే కార్తీక్ కొప్పెర ఇచ్చిన సినిమాటోగ్రఫీ సినిమా టోన్ కి బాగా ప్లస్ అయ్యింది. విజయ్ ఆనంద్ ఎడిటింగ్ మరికాస్త బాగా చెయ్యాల్సింది.

ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ని ఆనంద్ రవి అందించారు. తాను ఇంట్రెస్టింగ్ లైన్ ని అయితే పట్టుకొని రాగా దర్శకుడు శ్రీపతి ఆల్ మోస్ట్ సక్సెస్ఫుల్ గా దాన్ని హ్యాండిల్ చేసారు. ఓ మంచి సబ్జెక్టుని చాలా వరకు డీసెంట్ నరేషన్ తో కనబరిచారు. అలాగే మెయిన్ లీడ్ నుంచి సాలిడ్ పెర్ఫామెన్స్ లు కూడా తాను రాబట్టారు. అయితే కొన్ని పోర్షన్స్ లో మాత్రం ఇంకా బెటర్ వర్క్ చేసి ఉంటే ఖచ్చితంగా సినిమా అవుట్ ఫుట్ మరో లెవెల్లో వచ్చి ఉండేది.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “కొరమీను” చిత్రం కాస్త డిఫరెంట్ గా ట్రీట్ ఇస్తుంది. అలాగే మెయిన్ లీడ్ నటీనటులు తమ పాత్రల్లో విలక్షణ నటనతో మెప్పించి తీరుతారు. అయితే కాస్త నెమ్మదిగా సాగే కథనం, మరికొన్ని సన్నివేశాలు బెటర్ గా ప్రెజెంట్ చేయకపోవడం డిజప్పాయింట్ చేస్తాయి. జస్ట్ ఇవి పక్కన పెడితే ఈ వారానికి ఈ చిత్రం డీసెంట్ ట్రీట్ ని ఈ చిత్రం అందిస్తుంది.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు