సమీక్ష : కృష్ణ అండ్ హిజ్ లీల – నెమ్మదిగా సాగినా అలరిస్తుంది

సమీక్ష : కృష్ణ అండ్ హిజ్ లీల – నెమ్మదిగా సాగినా అలరిస్తుంది

Published on Jun 25, 2020 8:45 PM IST
Krishna And His Leela Review

Release date : June 25th, 2020

123telugu.com Rating : 3/5

తారాగణం : సిద్దు జొన్నలగడ్డ, శ్రద్దాశ్రీనాథ్, షాలిని

రచన&దర్శకత్వం : రవికాంత్ పేరేపు

నిర్మాత : సురేశ్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 కామ్ మోషన్ పిక్చర్స్, సంజయ్ రెడ్డి

సంగీతం : శ్రీచరణ్ పాకాల

థియేటర్స్ బంద్ నేపథ్యంలో చిన్న సినిమాలు ఓ టి టి లో విడుదల అవుతుండగా.. కృష్ణ అండ్ హిజ్ లీల కూడా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రావడం జరిగింది. దగ్గుబాటి రానా నిర్మించిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం…

 

కథ :

కృష్ణ (సిద్ధూ జొన్నలగడ్డ) సత్య(శ్రద్ధ శ్రీనాథ్) ఇద్దరూ ప్రేమించుకొని విడిపోతారు. సత్యతో బ్రేక్ వలన అప్సెట్ లో ఉన్న కృష్ణ… రాధా(షాలిని) ప్రేమలో పడతాడు. ఉద్యోగం నిమిత్తం బెంగుళూరు వెళ్లిన కృష్ణకు తన మాజీ లవర్ సత్య కనిపిస్తుంది. సత్య మరలా కృష్ణకు దగ్గిర అవుతుంది. ఈ నేపథ్యంలో కృష్ణ…సత్య మరియు రాధాలతో ఒకరికి తెలియకుండా మరొకరితో రిలేషన్ కొనసాగిస్తూ ఉంటాడు. ఏక కాలంలో ఇద్దరితో ప్రేమాయణం సాగిస్తున్న కృష్ణ ట్రై యాంగిల్ లవ్ స్టోరీ ఎలా ముగిసింది అనేది మిగతా కథ…

 

ప్లస్ పాయింట్స్ :

ప్రేమ.. ప్రియురాళ్ల విషయంలో స్పష్టత లేని కన్ఫ్యూస్డ్ లవర్ గా యంగ్ హీరో సిద్దూ ఆకట్టుకున్నారు. క్లిష్టమైన పాత్రలో సిద్దూ మేమేకమై నటించాడు. రొమాన్స్ అండ్ ఎమోషన్స్ పండించడంలో సక్సెస్ అయ్యాడు.

ఎప్పుడో మొదలైన ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాధ్ లుక్ ప్రెసెంట్ లుక్ కి భిన్నంగా ఉంది. హీరో సిద్ధూ ఆమె కెమిస్ట్రీ బాగా కుదిరింది. వీరి మధ్య రొమాన్స్ అండ్ ఎమోషన్స్ సహజంగా సాగాయి. ఇక మరో యంగ్ హీరోయిన్ షాలిని అనుభవం లేకున్నా పాత్రకు న్యాయం చేసింది. నేటి అమ్మాయిల మనస్తత్వాన్ని ప్రతిబింబించేలా ఉండే పాత్రలో ఆమె ఒదిగిపోయారు. డిఫరెంట్ మూడ్స్ తో సాగే ఆమె పాత్రకు ఆమె గుడ్ ఛాయిస్ అనిపించింది.

ఇక కమెడియన్ హర్ష మంచి పాత్ర దక్కించుకోగా ఝాన్సీ, సంపత్ తమ పరిధిలో అలరించారు. శ్రీచరణ్ పాకాల సాంగ్స్ మెచ్చుకోవాల్సిన మరో అంశం. ప్రేమ విషయంలో నేటి యువత అస్పష్ట వైఖరి చక్కగా ప్రస్తావించారు.

 

మైనస్ పాయింట్స్ :

ఏక కాలంలో ఒకరికి తెలియకుండా..మరొకరితో ప్రేమ వ్యవహారం నడపడం అనేది గతంలో అనేక హిందీ మరియు తెలుగు చిత్రాలలో ప్రస్తావించిన అంశమే. కాబట్టి ఇదో కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిత్రం అని చెప్పలేం.

అలాగే ట్రై యాంగిల్ లవ్ స్టోరీకి మంచి ముగింపు ఇవ్వలేక పోయారు దర్శకుడు రవికాంత్. ఇక క్లైమాక్స్ లో కూడా ఎమోషన్స్ అంతగా పండలేదు. దానితో పాటు అనేక దశలలో కథనంలో వేగం లోపించింది.
 

సాంకేతిక విభాగం :

అత్యున్నత నిర్మాణ విలువలు కలిగిన ఈ చిత్రంలో కెమెరా వర్క్ ఆకట్టుకుంది. ఎడిటింగ్ పర్వాలేదు. ముందుగా చెప్పుకున్నట్లు శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ అద్భుతం. పాటలతో పాటు.. నేపథ్య సంగీతం సినిమాకు మంచి ఫీల్ అందించింది. ఇక డైలాగ్స్ మరో ఆకట్టుకొనే అంశం.

ఇక డైరెక్టర్ రవికాంత్ విషయానికి వస్తే ఎంచుకున్న సబ్జెక్టు పాతదే అయినా తన నెరేషన్ తో మెప్పించే ప్రయత్నంలో కొంత వరకు సక్సెస్ అయ్యాడు. ఆయన రాసుకున్న సన్నివేశాలు.. డైలాగ్స్ మరియు కథనం సినిమాకు ఆకర్షణ జోడించింది. ఐతే క్లైమాక్స్ మరింత ఆసక్తి కరంగా మలచాల్సింది. అలాగే ఆశించిన స్థాయిలో ఎమోషన్స్ పలికించ లేకపోయారు.

తీర్పు :

నేటి తరం యువత ప్రేమ, రిలేషన్స్ విషయంలో వారి ప్రవర్తన, ఆలోచనా విధానం వంటి విషయాలను ఈ మూవీలో దర్శకుడు ప్రస్తావించారు. హీరో హీరోయిన్స్ నటన, మ్యూజిక్ అండ్ రొమాన్స్ ఈ మూవీలో ఆకట్టుకొనే అంశాలు. రొటీన్ స్టోరీ కావడంతో పాటు, నెమ్మదిగా సాగే కథనం నిరాశపరిచే అంశాలు. అయిన్నప్పటికీ ఆసక్తికర సన్నివేశాలు, అలరించే సంభాషణలు మెప్పిస్తాయి. మొత్తంగా ఈ లాక్ డౌన్ లో కృష్ణ అండ్ హిజ్ లీల మంచి ఛాయిస్ గా చెప్పవచ్చు.

123telugu.com Rating : 3/5
Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు