సమీక్ష : “కృష్ణ వ్రింద విహారి” – ఆకట్టుకునే ఫన్ డ్రామా

సమీక్ష : “కృష్ణ వ్రింద విహారి” – ఆకట్టుకునే ఫన్ డ్రామా

Published on Sep 24, 2022 3:04 AM IST
Krishna Vrinda Vihari Movie Review

విడుదల తేదీ : సెప్టెంబర్ 23, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు: నాగ శౌర్య, షిర్లే సెటియా, రాధికా శరత్‌కుమార్, వెన్నెల కిషోర్, తదితరులు

దర్శకత్వం : అనీష్ ఆర్. కృష్ణ

నిర్మాత: ఉషా ముల్పూరి

సంగీతం: మహతి స్వరసాగర్

సినిమాటోగ్రఫీ: సాయిశ్రీరామ్

ఎడిటర్: తమ్మిరాజు

 

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

లేటెస్ట్ గా థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో “కృష్ణ వ్రింద విహారి” కూడా ఒకటి. దర్శకుడు అనీష్ కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రంలో యంగ్ హీరో నాగ శౌర్య అలాగే షిర్లే షెటియా హీరోయిన్ గా నటించారు. మరి ఓ రొమాంటిక్ సహా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

ఇక కథలోకి వస్తే.. కృష్ణాచారి(నాగ శౌర్య) ఒక బ్రాహ్మణ కుటుంబం నుంచి కనిపించే డీసెంట్ కుర్రాడు. తనకి హైదరాబాద్ లో ఓ సాఫ్ట్ వేర్ జాబ్ కోసం రాగా అక్కడ వ్రిందా(షిర్లే) ని చూసి ప్రేమలో పడతాడు. అక్కడ నుంచి ఆమె ప్రేమని ఎలా గెలుస్తాడు? అలాగే తన ఫ్యామిలీ పరంగా తనని పెళ్లి చేసుకోడానికి ఉన్న అడ్డంకులు ఏంటి? ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? ఏఈ క్రమంలో కృష్ణాచారి ఎలాంటి సమస్యలో పడతాడు? ఫైనల్ గా వీరి జంటకి ఎలాంటి ముగింపు ఉంటుంది అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెర పై చూసి తెలుసుకోవాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ చిత్రంలో నాగ శౌర్య కనిపించిన పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుందని చెప్పాలి. గతంలో తాను ఎన్నో సెటిల్డ్ రోల్స్ చేసాడు కానీ ఇది వాటికి భిన్నంగా ఉండగా దానిని తాను చాలా ఈజ్ గా చేసి ఆకట్టుకుంటాడు. అలాగే తన కామెడీ టైమింగ్ కూడా ఈ సినిమాలో చాలా కొత్తగా బాగుంటుంది. కృష్ణాచారిగా డీసెంట్ నటన తన అమయాకత్వం చాలా బాగున్నాయి.

ఇక హీరోయిన్ షిర్లే సెటియా కి ఈ చిత్రం ఓ మంచి డెబ్యూట్ అని చెప్పాలి. సినిమాలో చాలా క్యూట్ గా అందంగా కనిపించడమే కాకుండా నటన పరంగా కూడా తాను బాగా ఇంప్రెస్ చేస్తుంది. అలాగే మెయిన్ లీడ్ లో మంచి కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. అలాగే తన రోల్ కి ఆమెనే డబ్బింగ్ చెప్పుకోవడం మరో మంచి విషయం.

ఇక ఈ సినిమాలో కనిపించిన సీనియర్ నటి రాధికా కూడా మంచి పాత్రలో కనిపించి మెప్పించారు. ఇంకా ఈ చిత్రంలో కనిపించే కామెడీ సినిమాకి మరి మంచి ఎసెట్ అని చెప్పాలి. చాలా చోట్ల మంచి ఫన్ ఈ చిత్రంలో కనిపిస్తుంది. దీనితో అయితే సినిమా కథనం చాలా వరకు మంచి ఎంటర్టైనింగ్ గా డీసెంట్ గా కొనసాగుతుంది.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ చిత్రంలో ఫన్ తో కూడిన సాలిడ్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ కనిపిస్తుంది. కానీ ఇదే సినిమాలో ఒకింత కథ మెయిన్ పాయింట్ కి పక్కదారి పట్టించినట్టు అనిపిస్తుంది. కామెడీ ఎపిసోడ్స్ బాగానే ఉంటాయి కానీ వీటి మూలానా సినిమాలో కావాల్సిన బలమైన ఎమోషన్స్ అంత బాగా ఎలివేట్ అయినట్టుగా అనిపించదు.

దీనితో సినిమాలో సరైన ఎమోషన్స్ కనిపించవు. ఈ విషయంలో కూడా దర్శకుడు కాస్త జాగ్రత్త పడాల్సింది. ఇంకా సినిమాలో కొన్ని సీన్స్ లో అయితే లాజిక్స్ కూడా బాగా మిస్సవుతాయి సెకండాఫ్ లో ఇవి బాగా కనిపిస్తాయి. ఇంకా కొన్ని సీన్స్ లో విజువల్స్ అయితే అంత నాచురల్ గా ఉన్నట్టుగా కూడా కనిపించవు.

 

సాంకేతిక వర్గం :

 

ఈ చిత్రానికి నాగ శౌర్య ఫ్యామిలీ నుంచే నిర్మాణం వహించడం జరిగింది. వారి ప్రొడక్షన్ వాల్యూస్ అయితే బాగున్నాయి. చాలా వరకు సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించారు. ఇంకా టెక్నికల్ టీం లో అయితే మహతి సాగర్ తన సంగీతంతో మరోసారి మెప్పిస్తాడు. అలాగే సాయి శ్రీరామ్ ఇచ్చిన సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. ఇక సినిమాలో డైలాగ్స్ సెక్షన్ కూడా బాగుంది. ముఖ్యంగా సింగిల్ లైనర్స్ బాగున్నాయి. ఎడిటింగ్ బాగుంది.

ఇక దర్శకుడు అనీష్ కృష్ణ విషయానికి వస్తే తన గత సినిమాలని మించి ఆడియన్స్ ని ఆకట్టుకునేలా చాలా బాగా డైరెక్ట్ చేసారని చెప్పాలి. ప్రస్తుతం అన్ని వర్గాల ఆడియెన్స్ కి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ న టార్గెట్ చేసుకొని తీసిన ఈ చిత్రం తన ఫన్ నరేషన్ తో ఆకట్టుకుంటాడు. కాకపోతే సినిమాలో బలమైన ఎమోషన్స్ ఎక్కడా కనిపించవు. వీటితో అయితే మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ని ఆశించేవారికి చిన్న డిజప్పాయింట్మెంట్ తప్పదు. ఇది మినహా తన ఫస్ట్ సినిమాకి దర్సకునిగా తాను అయితే సక్సెస్ అయ్యాడు.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “కృష్ణ వ్రింద విహారి” లో మెయిన్ లీడ్ నుంచి ఫ్రెష్ పెర్ఫార్మన్స్ లు అలాగే కావాల్సినంత ఫన్ కంటెంట్ తో మంచి ఎంటర్టైన్మెంట్ ఆడియెన్స్ కి దొరుకుతుంది. కాకపోతే సినిమాలో అంతా కామెడీనే ఫిల్ అయ్యి ఉండడం వల్ల ఎమోషన్స్ బాగా మిస్సయ్యాయి. ఇది పక్కన పెడితే ఈ వారాంతానికి థియేటర్స్ లో ఈ చిత్రం మంచి ఫన్ ఎంటర్టైన్మెంట్ ని అందిస్తుంది.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు