సమీక్ష : క్షత్రియ – లాజిక్ ఉంటే బాగుండేది.!

సమీక్ష : క్షత్రియ – లాజిక్ ఉంటే బాగుండేది.!

Published on Jan 1, 2014 8:00 PM IST
Kshatriya1 విడుదల తేదీ : 01 డిసెంబర్ 2014
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
దర్శకుడు : ఉదయ్ చందు
నిర్మాత : వి. మహేందర్ ,జయేందర్ రెడ్డి. ఎం
సంగీతం : విశ్వ
నటీనటులు : శ్రీకాంత్, కుంకుమ్, కోట, రావు రమేష్…

శ్రీకాంత్, కుంకుమ్ హీరో హీరోయిన్ గా నటించిన సినిమా ‘క్షత్రియ’. ఈ సినిమా ఈ రోజు రాష్ట్రమంతటా విడుదలైంది. ఈ సినిమాకి ఉదయ్ చందు దర్శకత్వం వహించాడు. విశ్వ సంగీతాన్ని అందించిన ఈ సినిమాని వి. మహేందర్, జయేందర్ రెడ్డి నిర్మించాడు. ఈ సినిమాలో కోటశ్రీనివాస రావు, రావు రమేష్, జయప్రకాశ్ రెడ్డి ప్రధాన పాత్రలలో నటించారు. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథ :

తనకు నచ్చితే డబ్బుల కోసం ఏమన్నా చేసే రౌడీ శ్రీకాంత్. మధు (కుంకుమ్) రాజ వంశానికి చెందిన అమ్మాయి. లండన్ లో పుట్టి పెరిగిన మధు ఇండియా మీద ప్రేమతో ఇండియాకి వచ్చేస్తుంది. దావూద్ (జయప్రకాశ్ రెడ్డి) శ్రీకాంత్ కి మధుని ఫాలో అవుతూ తను ఎక్కడికి వెళ్తుందో, ఎం చేస్తుందో ఎప్పటికప్పుడు తనకి చెప్పమని ఒప్పందం కుదుర్చుకుంటాడు.

మధు ఇండియాకి వచ్చిన విషయం తెలుసుకున్న మధు తాతయ్య (కోట శ్రీనివాస్ రావు) క్షుద్ర మాంత్రికుని ద్వారా చంపించాలి అనుకుంటాడు. మాంత్రికుడు చేసే క్షుద్ర ప్రయోగాల వల్ల మధు పలు సమస్యలను ఎదుర్కొంటూ ఉంటుంది. ఇవన్నీ చూసిన శ్రీ కాంత్ దీనికి కారణం ఏమిటా అని ఆరా తీయడం మొదలు పెడితే మధుకి సంబందించిన ఓ నమ్మలేని నిజం తెలుస్తుంది. ఆ నమ్మలే ని నిజం ఏమిటి? మధుని సొంత తాతయ్య ఎందుకు చంపాలనుకున్నాడు? అసలు దావూద్ ఎందుకు శ్రీ కాంత్ ని ఫాలో అవమన్నాడు? అనేది మీరు వెండితెరపైనే చూడాలి..

ప్లస్ పాయింట్స్ :

శ్రీకాంత్ ఎప్పటిలానే తనకు ఇచ్చిన పాత్రకి న్యాయం చేసాడు. కుంకుమ్ నటన కొన్ని చోట్ల బాగుంది, కానీ కొన్ని చోట్ల మాత్రం మెప్పించలేకపోయింది. మానసిక వైద్యుడిగా, నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో రావు రమేష్ చాలా బాగా చేశాడు. అలాగే కోట శ్రీనివాస్ రావు, జయప్రకాష్ రెడ్డిల నటన పరవాలేదానిపించారు. సినిమాలో శ్రీకాంత్ నిధిని చేదించడం, ఇంట్లో దెయ్యం లేదని ఇదంతా టెక్నిక్ తో చేశారని చూపించే విదానం బాగుంది. సినిమాలో సెకండాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

సెకండాఫ్ తో పోల్చుకుంటే ఫస్ట్ హాఫ్ కాస్తా నెమ్మదిగా, బోరింగ్ గా సాగుతుంది. సినిమాలో కామెడీ లేదు. కామెడీ పెట్టాలని ఎంచుకున్న కామెడీ నటులను కూడా డైరెక్టర్ సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. పాటలు, బాలేవు దానికి తోడూ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి ఆస్కారం ఉంది, కానీ ఈ సినిమాలో అది కూడా బాలేకపోవడం చెప్పదగిన మైనస్ పాయింట్.

శ్రీకాంత్ నటనని పక్కన పెట్టి డైరెక్టర్ రాసుకున్న పాత్ర విషయానికి వస్తే డైరెక్టర్ ఏ మాత్రం లాజిక్ అనేది లేకుండా రాసుకున్నాడని చెప్పాలి. ఎందుకంటే స్వతహాగా శ్రీ కాంత్ ఓ రౌడీ కానీ ఓ డిటెక్టివ్ మాదిరిగా ఎవరూ చేదించలేని విషయాలను చేదిన్చేస్తూ ఉంటాడు. అసలు అవన్నీ వీదేలా చేస్తున్నాడు రా బాబు అనే అనుమానం ప్రేక్షకులకి వస్తుంది. సినిమాలో దెయ్యంపై చిత్రీకరించిన సన్నివేశాలు అంత బాగోలేవు.

సాంకేతిక విభాగం :

సినిమాలో కథ ఓకే. కానీ దానిని తెరకెక్కించిన విధానం అంత నమ్మశక్యంగా లేదు. స్క్రీన్ ప్లే విషయంలో కాస్త జాగ్రత్త తీసుకొని సినిమా నిడివి తగ్గించి వేగంగా సాగేలా ప్లాన్ చేసుకొని ఉంటె బాగుండేది. స్టొరీ లైన్ మంచిదే ఎంచుకున్న డైరెక్టర్ కథలో లాజిక్స్, కామెడీ లాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది. పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అస్సలు బాలేవు. డైలాగ్స్ పరవాలేదు. సినిమాటోగ్రఫీ జస్ట్ ఒకే. ఎడిటర్ ఫస్ట్ హాఫ్ పై శ్రద్ధ తీసుకొని కొన్ని అనవసర సీన్స్ ని కత్తిరించి ఉంటె బాగుండేది. ప్రొడక్షన్ విలువలు చెప్పుకునే స్థాయిలో లేవు.

తీర్పు :

శ్రీ కాంత్ నటించిన ‘క్షత్రియ’ సినిమా గత సినిమాలకంటే కాస్త బెటర్ గా ఉంది. సైంటిఫిక్ గా కొన్ని పాయింట్స్ బాగా చూపించిన డైరెక్టర్ లాజిక్స్ విషయంలో మాత్రం ఫెయిల్ అయ్యాడు. పరవాలేదనిపించే నటీనటుల నటన, కొన్ని సస్పెన్స్ ఎలిమెంట్స్ ఈ సినిమాకి ప్లస్ అయితే కామెడీ, మ్యూజిక్, నో లాజిక్స్ చెప్పదగిన మైనస్ పాయింట్స్. రాజ వంశస్తుల గురించి ఆసక్తి ఉన్న వారు లాజిక్స్ లేకుండా ఈ సినిమా చూస్తే నచ్చే అవకాశం ఉంది.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

నగేష్ మేకల

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు