సమీక్ష : క్షీరసాగర మథనం – స్లోగా సాగే ఎమోషనల్ డ్రామా

సమీక్ష : క్షీరసాగర మథనం – స్లోగా సాగే ఎమోషనల్ డ్రామా

Published on Aug 7, 2021 3:04 AM IST
Ksheera Sagara Madhanam movie review

విడుదల తేదీ : ఆగస్టు 06, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ :  2.75/5

నటీనటులు : మానస్ నాగులపల్లి, సంజయ్ రావ్, గౌతమ్ శెట్టి, అక్షత సోనావని తదితరులు

దర్శకుడు: అనిల్ పంగులూరి

నిర్మాతలు : శ్రీ వేంకటేశ పిక్చర్స్ మరియు ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్
సంగీత దర్శకుడు : అజయ్ అరసడ
సినిమాటోగ్రఫీ : సంతోష్ షానమోన్
ఎడిటర్: వంశీ అట్లూరీ


మానస్‌ నాగులపల్లి, ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్‌ రావ్, గౌతమ్ శెట్టి, అక్షత సోనావని ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం “క్షీరసాగర మథనం”. భావోద్వేగంతో కూడిన ఏడు పాత్రల సమాహారంగా తెరకెక్కిన ఈ చిత్రం నేడు థియేటర్లలో రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

కథ:

గోవింద్ (గౌతమ్ శెట్టి), ఓంకార్ (సంజయ్ రావ్), ప్రియాంత్ (యోగేశ్), భరత్ (మహేశ్ కొమ్ముల), ఇషిత (అక్షత సోనావని), విరిత (చరీష్మశ్రీకర్) ఆరుగురు సాఫ్ట్‌వేర్ టెకీలు. రిషి (మానస్ నాగులపల్లి) వీరు పనిచేసే కంపీనీలో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. అయితే క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్న రిషికి, సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే ఇషితకు మధ్య ఉన్న అనుబంధం ఏమిటీ? గోవింద్ మరియు విరిత మధ్య ఎలాంటి ప్రేమ బంధం ఏర్పడింది? ఓంకార్ చేసిన పని వల్ల ఈ ఐదుగురు ఎలాంటి ప్రమాదంలో పడతారు? చివరకు ఆ ప్రమాదం నుంచి ఎలా బయటపడతారు అనేది తెలియాలంటే స్క్రీన్‌పై ఈ సినిమాను చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్:

ఈ కథలో నటీనటులందరూ వారి పాత్రల్లో చక్కగా ఫర్ఫార్మ్ చేశారు. రిషి (మానస్ నాగులపల్లి)-ఇషిత (అక్షత సోనావని) మరియు గోవింద్ (గౌతమ్ శెట్టి)-విరిత (చరీష్మశ్రీకర్)ల మధ్య వచ్చే లవ్ యాంగిల్స్ ఆకట్టుకున్నాయి. ఎమోషన్ టచ్ కూడా బాగానే ఉంది. ఇక భరత్ (మహేశ్ కొమ్ముల) పండించిన కామెడీ సీన్స్ బాగా ఆకట్టుకున్నాయి.

ఇకపోతే దర్శకుడు రాసుకున్న కథనంలో ఫస్టాఫ్ రొటీన్ మరియు నెమ్మదిగా అనిపించినా సెకాండాఫ్‌లో కాస్త ఊపందుకుంటుంది. చివరలో క్లైమాక్స్‌ను కూడా కాసింత టెన్షన్ పెట్టేలా చూపించడం బాగుంది. ఇక పైట్ సీన్స్‌ను కూడా పర్వాలేనిపించేలా చూపించారు. స్క్రీన్‌ప్లే కూడా ఒకే అనిపించింది.

మైనస్ పాయింట్స్:

ఫస్టాఫ్ మొత్తం రొటీన్‌గా మరియు స్లోగా సాగుతూ కథనాన్ని కాస్త దెబ్బతీసింది. ఇదే కాకుండా ఇంటర్వెల్ వరకు దర్శకుడు మెయిన్ స్టోరీలోకి కథను తీసుకురాలేకపోయాడు. ఇక విలన్ షేడ్‌ని బాగానే చూపించినప్పటికీ అతడికి కేటాయించిన కథను ఇంకాస్త ఎలివేట్ చేసి చూపించి ఉండాల్సింది.

ఇకపోతే దర్శకుడు నటుల క్యారెక్టర్స్ పరంగా రాసుకున్న కథనాలు బాగానే ఉన్నాయి కానీ ఓవరాల్‌గా మెయిన్ కథకు ఇంకాస్త బెటర్ ట్రీట్మెంట్ అందించి ఉంటే బాగుండేది అనిపించింది.

సాంకేతిక విభాగం:

ఇక సాంకేతిక విభాగానికి వస్తే దర్శకుడు సాఫ్ట్‌వేర్ కుర్రాళ్ల లైఫ్ ఎలా ఉంటుందనేది చూపిస్తూనే వారి పనితీరును కూడా బాగా చూపించాడు. అయితే తెలియకుండానే హ్యూమన్ బాంబ్‌లుగా మారిన సమయంలో ఒకింత ఏమీ చేయలేని స్థితిలో చూపించి, చివరకు టెక్నికల్‌గా వారే ఆ సమస్యను సాల్వ్ చేసుకోవడం బాగానే అనిపించినప్పటికీ ఎందుకో ఇక్కడే కాస్త కథకు మెరుగులుదిద్ది ఉంటే బాగుండనిపించింది. ఎందుకంటే హ్యూమన్ బాంబ్ అంటే అషామాషీ విషయం కాదనేది గుర్తించుకోవాలి.

ఇకపోతే ఈ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మెయిన్ హైలెట్‌గా నిలిచిందని చెప్పాలి. ఉన్నంతలో పాటలు కూడా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదనిపించింది. శ్రీ వేంకటేశ పిక్చర్స్ మరియు ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ కలిసి సినిమాను నిర్మించిన తీరు కూడా బాగుంది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే భావోద్వేగంతో కూడిన ఏడు పాత్రల సమాహారంగా తెరకెక్కించిన “క్షీరసాగర మథనం” స్టోరీ పెద్దగా లేకపోయినా నటీనటులకు ఇచ్చిన కథనం లవ్ మరియు ఎమోషన్ సీన్స్ ఒకింత ఆకట్టుకుంటాయి. అయితే ఒక్క సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు మాత్రమే కాకుండా డీసెంట్ స్టోరీలను కోరుకునే వారికి మరియు ఎమోషన్స్‌తో కూడుకున్న ఫ్యామిలీ డ్రామాలను కోరుకునే వారికి కూడా ఈ సినిమా నచ్చే ఛాన్స్ ఉంది.

123telugu.com Rating :  2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు