సమీక్ష : “లెహరాయి” – ఆకట్టుకోని బోరింగ్ డ్రామా

సమీక్ష : “లెహరాయి” – ఆకట్టుకోని బోరింగ్ డ్రామా

Published on Dec 10, 2022 3:00 AM IST
Leharaayi Movie-Review-In-Telugu

విడుదల తేదీ : డిసెంబర్ 09, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు: రంజిత్ సొమ్మి, సౌమ్య మీనన్, రావు రమేష్, అలీ, నరేష్, సత్యం రాజేష్

దర్శకుడు : రామకృష్ణ పరమహంస

నిర్మాత: మద్దిరెడ్డి శ్రీనివాస్

సంగీత దర్శకులు: ఘంటాడి కృష్ణ

సినిమాటోగ్రఫీ: ఎంఎన్ బాలరెడ్డి

ఎడిటర్: ప్రవీణ్ పూడి

 

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో యంగ్ హీరో హీరోయిన్ లు రంజిత్ మరియు సౌమ్య లు నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ “లెహరాయి” కూడా ఒకటి. మరి ఈ చిత్రం అయితే ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

ఇక కథలోకి వస్తే.. చిన్నప్పుడు నుంచి పర్ఫెక్ట్ గా పెరిగినటువంటి అమ్మాయి మేఘన(సౌమ్య మీనన్) తన తండ్రి పురుషోత్తం(రావు రమేష్) కి తన లైఫ్ లో ఎవరినీ ప్రేమించను అని మాట ఇస్తుంది. అలాగే మరోపక్క తన లైఫ్ లో స్ట్రిక్ట్ గా ఉండే స్టూడెంట్ కార్తీక్(రంజిత్ సొమ్మి) కి ఆమె ఊహించని విధంగా ప్రపోజ్ చేస్తుంది. అయితే ఆమె ఎందుకు అతనికి ప్రపోజ్ చేయాల్సి వస్తుంది? అక్కడ నుంచి కథ ఎలా మలుపు తిరుగుతుంది? అలాగే పురుషోత్తం పరిస్థితి ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ చిత్రంలో కొంతమేర నరేషన్ ని కొత్తగా ప్రెజెంట్ చేసే ప్రయత్నం కనిపిస్తుంది. అలాగే ఇందులో ఎంచుకున్న ఓ కొత్త పాయింట్ కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. అలాగే హీరో రంజిత్ తాను చేసింది రెండు సినిమాలే అయినప్పటికీ చిత్రానికి బాగా సెటిల్ అయ్యాడని చెప్పొచ్చు. ముందు మీద పరిణితి చెందిన నటనతో అయితే తాను ఆకట్టుకుంటాడు. అలాగే తన లుక్స్ కానీ పలు సీన్స్ లో ఎమోషన్స్ కానీ బాగున్నాయి.

అలాగే హీరోయిన్ సౌమ్య మీనన్ తన రోల్ లో ఇంప్రెసివ్ పెర్ఫామెన్స్ ని కనబరిచింది అని చెప్పొచ్చు. అలాగే ఆమె సినిమాలో మంచి అందంగా కనిపించడంతో పాటుగా తెలుగులో తన మొదటి సినిమా కన్నా బెటర్ ప్రయత్నం ఆమెలో కనిపిస్తుంది. ఇక ఈ చిత్రంలో మరో కీలక నటుడు రావు రమేష్ కోసం ప్రత్యేకంగా పని లేదు. ఇలాంటి భాద్యతాయుతమైన పాత్రల్లో తాను ఒదిగిపోతారు. అదే విధంగా ఈ సినిమాలో కూడా కూతురి పట్ల అమితమైన ప్రేమ, భాద్యత కలిగిన తండ్రిగా కనిపించి మెప్పిస్తారు.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ చిత్రంలో కొత్త నరేషన్ లా అనిపించినప్పటికీ సినిమాలో కథ అయితే అంత కొత్తగా ఏమీ అనిపించదు. అలాగే పార్ట్ లు పార్ట్ లు అక్కడక్కడా సీన్స్ కొన్ని కామెడీ ఎపిసోడ్స్ బాగానే అనిపించినా అల్టిమేట్ గా మిక్స్ చేస్తే మాత్రం సినిమా అంత ఆకట్టుకునేలా అనిపించవు అలాగే ఫస్టాఫ్ లో బాగా అనవసర సన్నివేశాలు ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తాయి వీటిని తగ్గిస్తే బాగున్ను.

ఇక సినిమాలో మెయిన్ లీడ్ మధ్య మరింత మంచి ఇంట్రెస్టింగ్ వాతావరణం సెట్ చేసి ఉంటే బాగుండేది.. అలాగే సినిమాలో కొన్ని సాంగ్స్ ప్లేస్ మెంట్ బాగోలేదు. అలాగే మరిన్ని సన్నివేశాలు ఇంకా బెటర్ గా తెరకెక్కించి ఉంటే బాగుండేది.

 

సాంకేతిక వర్గం :

 

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు పర్వాలేదు అని చెప్పొచ్చు. అలాగే టెక్నీకల్ టీం లో అయితే ఘంటాడ్ కృష్ణ చేసిన సంగీతం బాగుంది అలాగే బాలిరెడ్డి ఇచ్చిన సినిమాటోగ్రఫీ నీట్ గా ఉంది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ ఇంకా బెటర్ గా చేయాల్సింది.

ఇక దర్శకుడు రామకృష్ణ పరమహంస విషయానికి వస్తే.. తాను కాస్త రొటీన్ కథనే ఎంచుకున్నాడు కానీ ప్రెజెంటేషన్ కూడా కొత్తగానే ట్రై చేసారు కానీ అది అంతగా పూర్తి స్థాయిలో మాత్రం కథనాన్ని ఎంగేజింగ్ గా నడిపించడంలో విఫలం అయ్యారని చెప్పాలి. అక్కడక్కడ ఎక్కడో తప్ప ఓవరాల్ గా తన వర్క్ ఆకట్టుకోదు.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “లెహరాయి” చాలా రొటీన్ డ్రామా అని చెప్పొచ్చు. మెయిన్ లీడ్ సహా నటుడు రావు రమేష్ పాత్రలు బాగున్నాయి కానీ సినిమాలో అంత ఎంగేజింగ్ గా కనిపించే నరేషన్ పెద్దగా కనిపించదు. డైరెక్షన్ వైఫల్యం బాగా కనిపిస్తుంది. దీనితో అయితే ఈ వారాంతానికి ఈ చిత్రం బోరింగ్ ట్రీట్ ఇస్తుంది.

 

123telugu.com Rating: 2/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు