ఓటిటి సమీక్ష : మజా మా – అమెజాన్ లో ప్రసారం అవుతున్న హిందీ మూవీ

ఓటిటి సమీక్ష : మజా మా – అమెజాన్ లో ప్రసారం అవుతున్న హిందీ మూవీ

Published on Oct 7, 2022 12:12 AM IST
Plan A Plan B Movie Review

విడుదల తేదీ : అక్టోబర్ 06, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: మాధురి దీక్షిత్, గజరాజ్ రావు, రిత్విక్ భౌమిక్, బార్ఖ సింగ్, శ్రీష్టి శ్రీవాస్తవ, రజిత్ కపూర్, షీబా చడ్డా

దర్శకత్వం : ఆనంద్ తివారి

నిర్మాతలు: అమృత్ పాల్ సింగ్ బింద్రా

సంగీతం: సౌమిల్ స్రిన్గార్ పురే

సినిమాటోగ్రఫీ: దెబోజీత్ రే

ఎడిటర్: సంయుక్త కాజా

 

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

ఇటీవల పలు సినిమాలు, వెబ్ సిరీస్ లు ప్రసారం చేస్తూ ఆడియన్స్ నుండి మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ప్రముఖ ఓటిటి మాధ్యమం అమెజాన్ ప్రైమ్ వారు తొలిసారిగా నిర్మించిన ఒరిజినల్ ఫిలిం మజా మా. ఈ మూవీలో ప్రముఖ సీనియర్ బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ ప్రధాన పాత్ర చేసారు. మరి ఈ మూవీ యొక్క పూర్తి సమీక్షని ఇప్పుడు చూద్దాం.

 

కథ :

తేజస్ పటేల్ (రిత్విక్ భౌమిక్) ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు. ఇక పల్లవి తేజస్ (మాధురి దీక్షిత్), మనోహర్ పటేల్ (గజరాజ్ రావు) అతని తల్లి తండ్రులు. యుఎస్ఏ లో వర్క్ చేసే తేజస్, అక్కడే ఈషా హన్సరాజ్ (బర్ఖ సింగ్) అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆమె ఒక ఎన్నారై. అయితే మొదటి నుండి ఆమె పట్ల ఎంతో శ్రద్ధ చూపించే ఆమె తల్లితండ్రులు, తన ప్రేమ విషయం తెలుసుకుని తేజస్ కుటుంబంతో పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్లిన సమయంలో అనుకోకుండా ఒక అడ్డంకి ఏర్పడుతుంది. ఇంతకీ అది ఏంటి, అసలు తేజస్ తో ఈషా పెళ్లి జరుగుతుందా లేదా అనేదే మిగతా కథ.

 

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే రిలీజ్ వరకు ఎక్కడా కూడా మూవీ యొక్క మెయిన్ ప్లాట్ ని యూనిట్ రివీల్ చేయకపోవడం. ఇక థియేటర్ కి వచ్చిన ప్రేక్షకుడికి ఆ పాయింట్ ఒకింత షాక్ కి గురి చేస్తుంది. నిజానికి అదే పాయింట్ తో గతంలో సినిమాలు వచ్చినా ఈ మూవీలో మాత్రం ఫస్ట్ గంట సేపు దానిని బాగానే డీల్ చేసారు. ఈషా తల్లితండ్రులు నిర్వహించే లై డిటెక్టర్ టెస్ట్ సీన్స్ వంటివి సినిమాలో నవ్వులు పూయిస్తాయి. ఇక ఈ మూవీకి మరొక ప్రధాన బలం మాధురి దీక్షిత్ నటన. తన పాత్రలో ఆమె జీవించేసారు అని చెప్పాలి. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె నటన మరింత అద్భుతం. గజరాజ్ రావు, రిత్విక్ భౌమిక్ ఇద్దరూ కూడా తమ తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేసారు. సినిమాలో కొన్ని డైలాగ్స్, కీలక సీన్స్ ఎంతో ఆకట్టుకోవడంతో పాటు మనల్ని ఆలోచింపచేస్తాయి.

 

మైనస్ పాయింట్స్ :

నిజానికి డైరెక్టర్ మూవీలో కీలక పాయింట్ ని మొదట గంటసేపు ఎంతో బాగా డీల్ చేసారు డైరెక్టర్. అయితే ఆ తరువాత నుండి సినిమా చాలా వరకు తేలిపోతుంది. అలానే చివరి గంట సాదాసీదాగా సాగడంతో పాటు ఆడియన్స్ కి పెద్దగా రుచించదు. ఇక తీసుకున్న పాయింట్ ని మరింతగా ఎలివేట్ చేసే స్కోప్ ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే ఆకట్టుకునేలా రాసుకోకపోవడంతో పాటు చివరి గంటలో చాలా వరకు అవసరం లేని సన్నివేశాలు ఇబ్బంది పెడతాయి. అలానే ఈ మూవీ మెయిన్ ప్లాట్ అన్ని వర్గాల ఆడియన్స్ కి సూట్ కాదు. ఇక క్లైమాక్స్ సీన్స్ అసహజంగా ఉండడంతో పాటు అప్పటికప్పుడు పాత్రధారులు మారిపోవడం అనేది నమ్మశక్యంగా అనిపించదు. ఈ మూవీకి మరొక పెద్ద మైనస్ ఏంటంటే, ప్రధానమైన క్యారెక్టర్ కి ఎక్కువ స్కోప్, స్క్రీన్ టైం ఇవ్వకపోవడం. దానివలన దర్శకుడు చెప్పదలచుకున్నది ఆడియన్స్ కి కనెక్ట్ కాదు.

 

సాంకేతిక విభాగం :

సౌమిల్ స్రిన్గార్ పురే అందించిన సాంగ్స్, అక్కడక్కడ బిజిఎమ్ బాగున్నాయి. సినిమాటోగ్రాఫర్ దెబోజీత్ రే విజువల్స్ ఇంప్రెసివ్ గా ఉంటాయి. ఇక నిర్మాతల భారీ నిర్మాణ విలువలు కూడా మనకి స్క్రీన్ ఫై ఎంతో భారీగా ఖర్చు చేసినట్లు తెలుస్తుంది. దర్శకుడు ఆనంద్ తివారి గురించి మాట్లాడుకుంటే, సెన్సిటివ్ టాపిక్ ని తీసుకున్న అతడు పర్వాలేదనిపించేలా మూవీని తెరకెక్కించారు. ఆయన ప్రయత్నం బాగున్నా కథనంలో చాలా లోపాలు మూవీ పై ప్రభావం చూపాయి. అయితే మూవీలో ప్రధాన క్యారెక్టర్స్ పెర్ఫార్మన్స్ బాగుంది.

 

తీర్పు :

మొత్తంగా చెప్పాలి అంటే మజా మా మూవీతో మేకర్స్ పెద్ద సాహసోపేతమైన ప్రయత్నం చేసారు. అయితే కథనంలో లోపాలు ఆడియన్స్ సహనానికి పరీక్ష పెడతాయి. మాధురి దీక్షిత్ సూపర్బ్ పెర్ఫార్మన్స్, మొదటి గంటసేపు సాగె ఆకట్టుకునే కథనం, కొన్ని మనసుని తాకే డైలాగ్స్ ఈ మూవీకి పెద్ద ప్లస్ పాయింట్స్. ఇక చివరి గంట సేపు, ముఖ్యంగా అసహజంగా అనిపించే క్లైమాక్స్ వంటివి ఈ వారం విడుదలైన ఈ మూవీకి కేవలం పర్వాలేదనిపించేదిగా మిగిల్చింది.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు