సమీక్ష : మరకతమణి – కాస్త నవ్వించే థ్రిల్లర్

Marakathamani movie review

విడుదల తేదీ : జూన్ 16, 2017

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

దర్శకత్వం : ఏఆర్కే. శ్రావణన్

నిర్మాత : శ్రీ చక్ర ఇన్నోవేషన్స్, రుషి మీడియా

సంగీతం : డిబు నినన్ థామస్

నటీనటులు : ఆది పినిశెట్టి, నిక్కీ గల్రాని

తమిళ సినిమాలకి తెలుగులో ఆదరణ పెరిగిన తరుణంలో చిన్న నుండి పెద్ద స్థాయి సినిమా వరకు ప్రతి ఒక్కటి తెలుగులోకి అనువాదమవుతున్నాయి. ఆ సాంప్రదాయాన్నే అనుసరిస్తూ ఆది పినిశెట్టి, నిక్కీ గల్రానిలు జంటగా నటించిన ‘మరగద నానయం’ తమిళంలో పాటు తెలుగులో కూడా ‘మరకతమణి’ పేరుతో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఒక లుక్కేద్దాం…

కథ:

ఈ సినిమా కథ మొత్తం ప్రాచీన వజ్రం ‘మరకతమణి’ చుట్టూ తిరుగుతుంది. ఒకానొక దశలో ఆ వజ్రాన్ని దొంగలించాలని ప్రయత్నించిన ప్రతి ఒక్కరు అంతుపట్టని రీతిలో చనిపోతుంటారు. అలాంటి సమయంలోనే చిన్న స్మగ్లర్ అయిన అది ముందుకొచ్చి ఆ వజ్రాన్ని దొగలించడానికి సిద్దమవుతాడు.

అలా జీవితాన్ని రిస్కుతో పెట్టిన ఆదికి ఒక పూజారి వజ్రాన్ని దొంగిలించే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోకుండా ఉండటానికి దుష్ట శక్తుల సహాయం తీసుకోమని చెబుతాడు. పూజారి సలహా ప్రకారం ఆది ఎలాంటి దుష్ట శక్తుల్ని మేల్కొలిపాడు ? ఎలా మేల్కొలిపాడు ? ఆ వజ్రాన్ని ఎలా దొంగిలించాడు ? అనేదే తెరపై నడిచే కథ.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలో ప్రధానంగా ఆకట్టుకునే అంశం దుష్ట శక్తుల్ని కథలో ఇన్వాల్వ్ చేయడం. ఈ అంశం మీద పండించిన కామెడీ చాలా బాగా వర్కవుట్ అయింది. విలన్స్ హీరోని వెంబడించడం, ఆత్మల నైపథ్యంలో సాగే ఎంటర్టైన్మెంట్ వంటి వాటిని బాగా హ్యాండిల్ చేశారు.

హీరో ఆది పినిశెట్టి తన పాత్ర మేరకు సిన్సియర్ గా నటించాడు. కథనంలో విలీనం అయ్యేలా ఉండే అతని పెర్ఫార్మెన్స్, హీరోయిన్ నిక్కీ గల్రానికి, అతనికు మధ్య నడిచే ట్రాక్ ఆసక్తికరంగా ఉన్నాయి. హీరోయిన్ కూడా తన పాత్రలో మెచ్చుకునే రీతిలో నటించింది. ఆత్మగా నటించిన రాందాస్ నటన భలేగా నవ్వించింది. సెకండాఫ్లో ఆటను తన గ్రూప్ తో కలిసి చేసిన కామెడీ సెకండాఫ్లో బాగా పండి సినిమాను చాలా వరకు నిలబెట్టింది.

మైనస్ పాయింట్స్ :

సినిమా కథ చాలా వరకు ఊహాత్మకమైనదే కావడం మూలాన కొన్ని సన్నివేశాలు మరీ విపరీతంగా తోచాయి. దుష్ట శక్తులకు రావడం, హీరోకి సహాయం చేయడం వంటి అంశాలు బాగున్నా ఫస్టాఫ్లో ఇవి కాస్త ఓవర్ గా వెళ్ళినట్టు అనిపించింది. సినిమాలోని చాలా పాత్రలు తెలిసినవై ఉండకపోవడం, కీలక పాత్రలు చేసిన చాలా మంది తమిళ నటులు కూడా కొత్తవారు కావడం తెలుగు వెర్షన్ కు నష్టం కలిగించే అంశంగా పరిణమించింది.

నిక్కీ గల్రాని, ఆది పినిశెట్టిల మధ్య రొమాంటిక్ ట్రాక్ కాస్త ఎక్కువవడంతో సినిమా కొంచెం పక్కదారి పట్టినట్టు అనిపించింది. సినిమా ఫస్టాఫ్ నెమ్మదిగా ఉండటంతో కథనంలో కీలకమైన ట్విస్ట్ రావడనికి కొంచెం ఎక్కువ సమయం పట్టింది. అలాగే కామెడీ ట్రాక్ బాగున్నా అది నడిచే సమయంలో కూడా కథనం ట్రాక్ తప్పిన భావన కలిగింది. సినిమా ఆరంభంలో విలన్ పాత్ర బాగానే కనిపించినా సినిమా క్లైమాక్స్ దశకు చేరుకునే సరికి అది కాస్త సిల్లీగా మారిపోయి నిరుత్సాహపరిచింది.

సాంకేతిక విభాగం :

సినిమాలో కెమెరా వర్క్ చాలా బాగుంది. చాలా సన్నివేశాలు ఆసక్తికరంగా, భయానకంగా అనిపించాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది చిత్రానికి చాలా వరకు సహాయపడింది. డబ్బింగ్ పర్లేదనిపించినా నిర్మాణ విలువలు మాత్రం బాగున్నాయి.

ఇక దర్శకుడు శరవణన్ విషయానికొస్తే సినిమా పరంగా అతని పనితనం బాగుంది. అతను తయారు చేసుకున్న కథ కాస్త అతిగా అనిపించినా దానికి మంచి కామెడీని, మంచి ఇంటర్వెల్ ట్విస్టును జోడించడంతో ఆసక్తికరంగా తయారై సెకండాఫ్ బాగా ఆకట్టుకుంది. ఫస్టాఫ్ వేగాన్ని ఇంకాస్త పెంచి కీలకమైన మలుపును ఇంకొంచెం ముందుగా చూపించి ఉంటే సినిమా ఇంకా ఆసక్తికరంగా ఉండేది.

తీర్పు:

మొత్తం మీద చెప్పాలంటే ఈ ఫాంటసీ థ్రిల్లర్ టైమ్ పాస్ కోసం చూడడిగిన సినిమాగా ఉంది. దర్శకుడు సరైన సమయంలో మంచి కామెడీని, ఆసక్తికరమైన మలుపును కథనంలో జోడించడంతో స్టోరీ విపరీతంగా అనిపించడం అనే నెగెటివ్ అంశం కాస్త మరుగునపడింది. కామెడీ థ్రిల్లర్స్ ను ఇష్టపడుతూ, కొన్ని లాజిక్స్ ను పట్టించుకోకపోతే ఈ వీకండ్లో ఈ సినిమా మంచి చాయిస్ అవుతుంది.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click here for English Review

సంబంధిత సమాచారం :