సమీక్ష : మసక్కలి – అర్ధం లేని ప్రేమ కథ

సమీక్ష : మసక్కలి – అర్ధం లేని ప్రేమ కథ

Published on Sep 14, 2018 4:12 PM IST
Masakali movie review

విడుదల తేదీ : సెప్టెంబర్ 13, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 1.75/5

నటీనటులు : సాయి రోనాక్, శ్రావ్య

దర్శకత్వం : నబి ఏనుగుబాల

నిర్మాతలు : నమిత్ సింగ్

సంగీతం : మిహిరామ్స్

సినిమాటోగ్రఫర్ : సుభాష్ దొంతి

ఎడిటింగ్ : శివ శర్వాని

సాయి రోనాక్ , శ్రావ్య జంటగా నూతన దర్శకుడు నబి ఏనుగుబాల తెరకెక్కించిన చిత్రం మసక్కలి. నిన్న ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా వుందో ఇప్పుడు చూద్దాం .

కథ :

సూర్య (సైక్రియాట్రిస్టు స్టూడెంట్) ఆకాంక్ష (శిరీష ) అనే అమ్మాయితో ప్రేమలో పడుతాడు. ఆమెను కలుసుకోవాలని ఏంతగానే ప్రయతిస్తుంటాడు. ఈ క్రమంలో చాలా ధనవంతురాలైన శృతి ని కలుస్తాడు సూర్య. శృతి మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ తో బాధ పడుతుంది. ఆమెకు ట్రీట్మెంట్ చేయడానికి సూర్య ఆమె ఇంటికి వస్తాడు. శృతి ఒక పక్క చాలా పొగరు పట్టిన అమ్మయిలా బిహేవ్ చేస్తూ మనీ కి వాల్యూ ఇస్తూ మరో పక్క మంచి అమ్మాయిల సేవ చేస్తూ వుంటుంది. అసలు శృతి ఆలా మారడానికి గల కారణం ఏమిటి? చివరికి శృతి కథ ఏమైంది ? ఇంతకీ ఆకాంక్ష ఎవరు ? సూర్య , ఆకాంక్ష కలుసుకున్నారా ? అనేదే మిగితా కథ.

 

ప్లస్ పాయింట్స్ :

ఈసినిమాతో హీరోగా పరచియమైన సాయి రోనాక్ సూర్య పాత్రకు కరెక్ట్ గా సరిపోయాడు. లుక్స్ పరంగా కూడా ఆకట్టుకొని మంచి నటన కనబర్చాడు. ఇక శృతి పాత్రలో నటించిన శ్రావ్య మెప్పించింది. మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ కలిగిన అమ్మయి పాత్రలో చక్కగా నటించింది. సీనియర్ నటుడు కాశి విశ్వనాద్ సూర్య తండ్రి పాత్రలో బాగా నటించాడు. నవీన్ ఉన్నంతలో కాస్త నవ్వించాడు.

 

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు నబి మంచి ప్రేమ కథను తెరకెక్కించాలని దానికి స్ప్లిట్ పర్సనాలిటీ ని జోడించి ఈ కథను రాసుకున్నాడు. కాని తెర మీద అది పూర్తిగా తేలిపోయింది. కథ ఏమంత ఆసక్తిగా లేకున్నా కథనంతో నైనా మేజిక్ చేయాలి కానీ ఇక్కడ అది కూడా వర్క్ అవుట్ కాలేదు.

అర్ధం లేని పాత్రలు విసుగుతెప్పించే డైలాగ్స్ ఇలా అన్ని విషయాలల్లో దర్శకుడి వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. దర్శకుడు మెయిన్ పిల్లర్ అలాంటి ఆయన దగర్నుంచే సరైన అవుట్ ఫుట్ లేనప్పుడు మిగితా వారు కూడా అలానే తయారవుతారు. ఈ సినిమా పరిస్థితి కూడా అలాగే వుంది.

 

సాంకేతిక వర్గం :

దర్శకుడు నబి ఈలాంటి ఒక డిఫికల్ట్ స్టోరీ ని ఎంచుకొని దాన్ని సరిగ్గా తెర మీదకు తీసుకరాలేకపోయాడు. సినిమా చాలా చోట్ల విసుగుతెప్పిస్తూ సాగుతుంది. ఇక శివ శర్వాని ఎడిటింగ్ పర్వాలేదు. మిహిరామ్స్ సంగీతం సోసో గా వుంది వున్న మూడు పాటల్లో ఒక్కటి కూడా ఆకట్టుకోదు . సుభాష్ దొంతి ఛాయాగ్రహణం బాగుంది. నమిత్ సింగ్ నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి .

 

తీర్పు :

ఒక డిఫ్రెంట్ ప్రేమ కథతో వచ్చిన ఈ మసక్కలి మ్యాజిక్ చేయలేకపోయింది. కామెడీ యాక్షన్, రొమాన్స్ వంటి ఎలిమెంట్స్ ఏవి లేకుండా బోర్ కొట్టించే కథనంతో విసుగు తెప్పించే డైలాగ్స్ తో సాదా సీదాగా తెరకకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్ట్టుకునే అవకాశం అయితే లేదు.

123telugu.com Rating : 1.75/5

Reviewed by 123telugu Team

 

Click here for English Review

 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు