ఓటిటి రివ్యూ : మోడరన్ లవ్ హైదరాబాద్ – తెలుగు వెబ్ సిరీస్ – అమేజాన్ ప్రైమ్ లో ప్రసారం

ఓటిటి రివ్యూ : మోడరన్ లవ్ హైదరాబాద్ – తెలుగు వెబ్ సిరీస్ – అమేజాన్ ప్రైమ్ లో ప్రసారం

Published on Jul 9, 2022 3:02 AM IST
Modern Love Hyderabad Movie Review

విడుదల తేదీ : జులై 8, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు: ఆది పినిశెట్టి, నిత్యా మీనన్, రీతు వర్మ, సుహాసిని, రేవతి, నరేష్, మాళవిక నాయర్, అభిజీత్ దుద్దాల, నరేష్ అగస్త్య, కోమలీ ప్రసాద్, ఉల్కా గుప్తా

దర్శకత్వం : నగేష్ కుకునూర్, వెంకటేష్ మహా, ఉదయ్ గుర్రాల, దేవిక బహుధానం

నిర్మాత: ఎలాహీ హిప్టూల

సంగీత దర్శకుడు: ఎం ఎం కీరవాణి, స్మరన్ సాయి

సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాది

ఎడిటర్: రవితేజ గిరజాల

మోడ్రన్ లవ్ హైదరాబాద్ అనేది అమెరికన్ టెలివిజన్ సిరీస్ మోడరన్ లవ్ ఆధారంగా తెరకెక్కిన ఆరు ఎపిసోడ్ ల వెబ్ సిరీస్ ఆధారంగా తీసుకోబడింది. ఇక అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందొ చూద్దాం.

 

కథ :

 

మోడ్రన్ లవ్ హైదరాబాద్ అనేది ఆరు విభిన్న కథలను కలిగి ఉన్న ఒక సంకలన ధారావాహిక. ప్రతి కథ ఒక నిర్దిష్ట రకమైన సంబంధాన్ని మరియు ప్రేమ యొక్క విభిన్న కోణాన్ని సూచిస్తుంది. అన్ని కథలు సార్వత్రికమైన ఒక సాధారణ మానవ భావన ‘ప్రేమ’ను అన్వేషిస్తాయి. ఇది వివిధ వయస్సుల సమూహాలు మరియు విభిన్న వ్యక్తుల ఆలోచనలకూ దృశ్యరూపకం. ఈ ఆరు కథలు, తల్లి మరియు కుమార్తెల సంబంధం విచ్ఛిన్నం, అవగాహన సమస్యలు గల జంట, అమ్మమ్మ మరియు ఆమె మనవడి మధ్య సంబంధం, నిర్మాత మరియు స్టాండ్-అప్ కమెడియన్ మధ్య సంబంధం, కుమార్తె మరియు ఆమె తండ్రి మధ్య సంబంధం గురించి విశ్లేషణ, తన గురించిన రక్షణ, అలానే జీవితాన్ని ఎవరితో పంచుకోవాలనుకునే దాని గురించి ఆలోచనలతో గందరగోళంగా ఉన్న ఒక అమ్మాయి జీవితం. ఇలా ప్రతి కథకు భిన్నమైన నేపథ్యం ఉంది, కానీ అవన్నీ సందడిగా ఉండే చార్మినార్ కలిగిన నగరం హైదరాబాద్ లోనే జరుగుతాయి.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ వెబ్ సిరీస్ కి కథే ప్రధాన బలం. అలానే టేకింగ్ మన ప్రేక్షకుల అభిరుచికి మరియు నేటివిటీకి అనుగుణంగా చాలా బాగా కస్టమైజ్ చేయబడింది. కరోనా పాండెమిక్ సమయంలో బలవంతంగా ఉండాల్సిన తల్లి మరియు కుమార్తె గురించి కావచ్చు, లేదా తన కుమార్తె శ్రేయస్సు కోసం రహస్యంగా గూఢచర్యం చేసే అలవాటు కలిగిన తండ్రి గురించి, ఇలా పలు సీన్స్ ని టీమ్ ఎంతో బాగా తీసింది.

కథలు చాలా సరళంగా ఉంటాయి. అయినప్పటికీ అవి చాలా అద్భుతమైన మరియు హృదయపూర్వక క్షణాలతో తేలికైన రీతిలో వివరించబడ్డాయి, అలానే అవి మనల్ని ఎంతో ఆకట్టుకుంటాయి. చారిత్రక నగరం యొక్క సారాంశాన్ని కథలతో అద్భుతంగా మిళితం చేశారు. దానిని నేటి ఆధునిక కాలంలోని మానవ సంబంధాలకి మిళితం చేసి ఎంతో చక్కగా చూపించారు. సంభాషణలు బాగా వ్రాయబడ్డాయి మరియు లోతుగా ఉన్నాయి. సన్నివేశాలు అందంగా అల్లడం వల్ల పాత్రలు ఆకట్టుకుంటాయి.

ఇక ఈ వెబ్ సిరీస్ లో ప్రతి ఒక్క పాత్రదారి యొక్క పెర్ఫార్మన్స్ ఎంతో బాగుంది. ముఖ్యంగా సుహాసిని, నరేష్, నిత్యామీనన్, రేవతి, అద్భుతంగా నటించారు. ఇక ముఖ్యంగా రేవతి, నిత్యా మీనన్ అలానే నరేష్ ఉల్కా గుప్తాల కథలు మనకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

 

మైనస్ పాయింట్స్ :

 

మరోవైపు, కొన్ని ఎపిసోడ్‌లలోని కథనం అంత గొప్పగా లేదు మరియు అది కొంచెం సాగదీసినట్లు అనిపిస్తుంది. ఎడిటర్ కథలను మరింత ఆకట్టుకునేలా చేయడానికి కొన్ని ఎపిసోడ్‌లలో కొన్ని అనవసర సన్నివేశాలను తొలగించి ఉంటె బాగుండేదనిపించింది. కొన్ని సీన్స్ అయితే ఒకింత నెమ్మదిగా ఉన్నాయి. ఒక ఎపిసోడ్‌లోని తెలంగాణ డిక్షన్ బాగున్నప్పటికీ సంభాషణలను అర్థం చేసుకోవడం కష్టతరంగా అనిపిస్తుంది.

నిజానికి ఇందులో చూపించిన స్టోరీస్ అన్ని కూడా నిర్మలా సాగుతూ తదుపరి సీన్స్ ని, అలానే ఎండింగ్ ని ఒకింత ఈజీగా చెప్పేయగలిగేలా ఉన్నాయి. కొందరి పాత్రలు ఆకట్టుకున్నప్పటికీ, వారికి తక్కువగా స్క్రీన్ ప్రెజెన్స్ ఇచ్చారు. రెండు ఎపిసోడ్స్ తాలూకు ఎండింగ్ సీన్స్ అయితే అంతగా ఆకట్టుకోవు సరికదా, కొందరు ఆడియన్స్ ని నిరుత్సాహపరుస్తాయి.

 

టెక్నీకల్ అంశాలు :

 

టెక్నీకల్ గా ఈ మోడరన్ లవ్ హైదరాబాద్ వెబ్ సిరీస్ అద్భుతం అనే చెప్పాలి. రచయితలు నగేష్ కుకునూర్, శశి సుడిగల, బహాయిష్ కపూర్ అందరూ కూడా ఎంతో బాగా రాయడంతోప్ పాటు మంచి డైలాగ్స్ కూడా అందించారు. అలానే దర్శకులు నగేష్ కుకునూర్, వెంకటేష్ మహా, ఉదయ్ గుర్రాల, దేవిక బహుధానం కూడా తమ ఆకట్టుకునే దర్శకత్వ ప్రతిభతో వీటిని చక్కగా తెరకెక్కించారు.

ముఖ్యంగా నగేష్ కుకునూర్ అండ్ టీమ్ కి మెయిన్ క్రెడిట్ ఇవ్వాలి. ఎమోషనల్ గా ఆడియన్స్ అందరినీ ఆకట్టుకునేలా ఈ స్టోరీస్ ని ప్రెజెంట్ చేసిన విధానం గురించి ఎంతచెప్పినా తక్కువే. మ్యూజిక్ కూడా సన్నివేశాలకు తగ్గట్లుగా ఎంతో బాగుంది. ముఖ్యంగా టైటిల్ సాంగ్ అయితే మరింత బాగుంది. అలానే సినిమాటోగ్రఫీ కూడా ఈ వెబ్ సిరీస్ కి ఎంతో బలం. మన చారిత్రక నగరం హైదరాబాద్ ని ఎంతో అద్భుతంగా చూపించారు. ఇక రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఈ వెబ్ సిరీస్ కి మరొక ఆకర్షణ.

 

తీర్పు :

 

మొత్తంగా ఈ మోడరన్ లవ్ హైదరాబాద్ అనే వెబ్ సిరీస్ లోని కథలు, పాత్రదారుల ఆకట్టుకునే నటన ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది. కథా రచన, పాత్రల ఔచిత్యం, సింపుల్ గా సాగె స్టోరీస్ ని అందరినీ ఆకట్టుకునేలా ఎంటర్టైనింగ్ గా తీసిన విధంగా ఎంతో బాగుంది. ప్రేమ లోని మ్యాజిక్ ని తెలిపేలా సాగె ఈ వెబ్ సిరీస్ తప్పక చూడాలి. చాలావరకు ఇవి ఆకట్టుకున్నప్పటికీ అక్కడక్కడా కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు మంచి హృద్యమైన లవ్ స్టోరీస్ ఇష్టపడే వారైతే తప్పకుండా ఏ మోడరన్ లవ్ హైదరాబాద్ స్టోరీస్ మీకు నచ్చుతుంది. అలానే మీకు మంచి టైం పాస్ కూడా అవుతుంది.

123telugu.com Rating: 3.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు