పాటల సమీక్ష : “క్రాక్” – మాస్ అండ్ ఎనర్జిటిక్ ఆల్బమ్

పాటల సమీక్ష : “క్రాక్” – మాస్ అండ్ ఎనర్జిటిక్ ఆల్బమ్

Published on Jan 7, 2021 4:02 PM IST


మాస్ మహారాజ్ రవితేజ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం “క్రాక్”. మంచి స్వింగ్ లో ఉన్న థమన్ సంగీతం అందించిన ఈ ఆల్బమ్ మొత్తం బయటకు వచ్చింది. మరి ఇది ఎలా ఉందో ఓ లుక్కేద్దాం.

పాట 1 : ‘భూమ్ భద్దల్’

 

Bhoom Bhaddhal

ఈ ఆల్బమ్ నుంచి విడుదలైన మొట్ట మొదటి సాంగ్ ఇది. మంచి హై ఎండ్ లో ఈ సాంగ్ కు ఈ కాంబోపై ఉన్న అంచనాలకు తగ్గట్టే రిలీజ్ చేశారు. మంగ్లీ మరియు సింహాలు పాడిన ఈ పాట పక్కా మాస్ అండ్ ఎనర్జిటిక్ బీట్ అని చెప్పాలి. ఇది ఐటెం నెంబర్ కాబట్టి ఆ హై ను మంగ్లీ సూపర్బ్ గా మ్యాచ్ చేసింది. అయితే ఇందులో థమన్ రొటీన్ బీట్ కాస్త అనిపించినా మంచి మసాలా బీట్ లా ఉంది ఫైనల్ గా..

 

Mass Biryani

పాట 2: ‘మాస్ బిర్యానీ ‘

 

ఇక ఈ ఆల్బమ్ నుంచి వచ్చిన మరో మాస్ సాంగ్ ఈ “మాస్ బిర్యానీ”. కాసర్ల శ్యామ్ సాహిత్యం ఈ సాంగ్ లో స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. అలాగే ఇందులో కూడా థమన్ బీట్స్ అమేజింగ్ గా ఉంటాయి. మంచి ఎనర్జిటిక్ గా రవితేజ ఎనర్జీను మ్యాచ్ చేసే విధంగా అనిపిస్తాయి. రాహుల్ నంబియార్ ఆలపించిన ఈ సాంగ్ విజువల్ గా ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది.

 

పాట 3: ‘భలేగా తగిలావే బంగారం ‘

 

Balega Tagilyave Bangaram

ఈ సినిమా ఆల్బమ్ లో ఇది మూడో పాట అలాగే ఇది బెస్ట్ సాంగ్ అని కూడా చెప్పాలి. థమన్ దీనిని కాస్త కొత్త స్టయిల్ లో మంచి క్యాచీ ట్యూన్ తో కొట్టాడని చెప్పాలి. దీనికి తోడు అనిరుష్ గాత్రం దీనిని మరో లెవెల్ కు తీసుకెళ్లింది. ప్రముఖ సాహిత్య రచయిత రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాట ఈ ఆల్బమ్ లో స్యూర్ షాట్ హిట్ అని చెప్పాల్సిందే.

 

Ala Korameesam Polisoda

పాట 4: ‘కోర మీసం పోలీసోడా ‘

 

ఇక ఇందులో నాలుగోది చివరి పాట “కోరమీసం పోలీసోడా”. రవితేజ మరియు శృతి హాసన్ ల మధ్య రొమాంటిక్ టచ్ ఇది. వినసొంపుగా ఉండే లిరిక్స్ రమ్యా బెహరా వాయిస్ ఈ సాంగ్ ను మంచి ఫీల్ లోకి తీసుకెళ్తుంది. అలాగే పోలీస్ తమ వృత్తి పట్ల ఎంత సీరియస్ గా ఉంటారు,మరి అందులో రొమాంటిక్ యాంగిల్ ను మ్యాచ్ చెయ్యడం ఈ సాంగ్ లో బాగా అనిపిస్తుంది.

 

తీర్పు :-
ఇక మొత్తంగా చూసుకున్నట్టయతే మెయిన్ గా మాస్ ఆడియెన్స్ ను టార్గెట్ చేస్తూ వస్తున్న ఈ చిత్రంలో థమన్ జస్ట్ డీసెంట్ జాబ్ అందించారని చెప్పాలి. అన్ని పాటలు కూడా ఆడియో పరంగా వినడానికి బాగానే ఉంటాయి. కానీ ఓ రెండే రొటీన్ గానే అనిపిస్తాయి. కానీ రవితేజ మరియు థమన్ ల కాంబో అంటే ఇంతకు ముందు ఉన్న అంచనాలకు తగ్గ ఆల్బమ్ అనే చెప్పొచ్చు. అలాగే ఈ ఆల్బమ్ విజువల్ గా మంచి ట్రీట్ ఇచ్చే అవకాశం ఉంది. మరి అది వెండితెర మీదనే చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు