సమీక్ష : ‘మై డియర్ భూతం’ : ఓన్లీ పిల్లలను మాత్రమే ఆకట్టుకుంటుంది !

సమీక్ష : ‘మై డియర్ భూతం’ : ఓన్లీ పిల్లలను మాత్రమే ఆకట్టుకుంటుంది !

Published on Jul 16, 2022 3:02 AM IST
My Dear Bootham Movie Review

విడుదల తేదీ : జులై 15, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: ప్రభుదేవా, రమ్యా నంబీశన్, అశ్వంత్, పరం గుహనేష్, సాత్విక్, శక్తీ, కేశిత, సంయుక్త,ఇమ్మాన్ అన్నాచి, సురేష్ మీనన్, లొల్లు సభా, స్వామినాథన్ తదితరులు.

దర్శకత్వం : ఎన్. రాఘవన్

నిర్మాత: రమేష్ పి పిళ్ళై

సంగీత దర్శకుడు: డి ఇమ్మాన్

సినిమాటోగ్రఫీ: యూకే సెంథిల్ కుమార్

ఎడిటర్: శాన్ లోకేష్


ప్రభుదేవా ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా ‘మై డియర్ భూతం’. అభిషేక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రమేష్ పి పిళ్ళై ఈ మై డియర్ భూతం సినిమాను నిర్మించారు. కాగా ఈ సినిమా ఈ రోజే ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ:

కర్ణముఖి (ప్రభుదేవా) భూత లోకానికి మహారాజు. అయితే, ఓ ముని శాపం కారణంగా భూలోకంలో రాయిలా మారిపోతాడు. ఆ శాపం నుంచి బయటకు రావాలంటే.. ఆ రాయిని ఎవరో ఒకరు స్పర్శించాలి. అలాగే ఆ వ్యక్తినే, ఆ కర్ణముఖి ప్రతిమలోని మంత్రాన్ని చదవాలి. అప్పుడే కర్ణముఖి తన లోకానికి వెళ్లగలడు. ఇక, మరోపక్క శ్రీరంగం శ్రీనివాసరావు (అశ్వంత్) అనే పిల్లాడు నత్తితో బాధపడుతుంటాడు. స్కూల్‌ లో కూడా శ్రీనివాసరావును చూసి అందరూ నవ్వుతూ ఉంటారు. కొందరు అవమానిస్తుంటారు. . చివరకు అతని తల్లి (రమ్య నంబీశన్) కూడా శ్రీనివాసరావు సమస్యను సరిగ్గా అర్థం చేసుకోదు. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీరంగం శ్రీనివాసరావు అనుకోకుండా కర్ణముఖి ప్రతిమను తాకుతాడు. కర్ణముఖి బయటకు వస్తాడు. కానీ.. తన లోకానికి వెళ్ళాలి అంటే.. శ్రీనివాసరావు మంత్రం చదవాలి. మరి, నత్తితో బాధపడే శ్రీనివాసరావు ఆ మంత్రం సరిగ్గా చదివాడా ? లేదా ?, కర్ణముఖి తన లోకానికి తిరిగి వెళ్తాడా ? లేదా ?, చివరకు ఈ కథ ఎలా ముగిసింది ? అనేది మెయిన్ కథ.

ప్లస్ పాయింట్స్:

ఇలాంటి కథతో నిజానికి ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే, ఈ కథని ఎన్ని సార్లు సినిమాగా తీసినా, ఇలాంటి సినిమాని చూసిన ప్రతి సారి కొత్తగానే ఉంటుంది. కారణం విజువల్స్. అలాగే పిల్లలకు నచ్చే అంశాలు సినిమాలో ఉండటం. అలాగే ఈ సినిమా కూడా కిడ్స్ కు బాగానే నచ్చుతుంది. భూత లోకపు రాజు కర్ణముఖి గా ప్రభుదేవా చాలా బాగా నటించాడు. ఇటు ఎమోషనల్ సీన్స్ లోనూ, అటు కామెడీ సీన్స్ లోనూ ప్రభుదేవా నటన సినిమాకు ప్లస్ అయ్యింది.

శ్రీరంగం శ్రీనివాసరావు గా నటించిన కిడ్ అశ్వంత్ కూడా అద్భుతంగా నటించాడు. ఈ సినిమాలో నటించిన పిల్లలు, వారి సీన్స్ కూడా చాలా క్యూట్ గా సాగుతాయి. తల్లిగా నటించిన రమ్యా నంబీశన్ కూడా చాలా బాగా నటించింది. అలాగే చివరి పది నిమిషాలు మరియు క్లైమాక్స్ ను తెరకెక్కించిన విధానం బాగుంది. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. దర్శకుడు ఎమోషన్స్ ను కూడా బాగా హ్యాండిల్ చేశాడు.

మైనస్ పాయింట్స్:

ఈ చిత్రం విజువల్స్ పరంగా ఆకట్టుకున్నా.. కథనం పరంగా మాత్రం ఈ సినిమాలో ఎలాంటి కొత్తధనం లేదు. అలాగే ఫస్ట్ హాఫ్ లో మరియు సెకండాఫ్ లలో వచ్చే కొన్ని సాగదీత సీన్స్ బోర్ కొడతాయి. పైగా ఇంట్రెస్ట్ గా సాగని మెయిన్ సీక్వెన్స్ స్, అదే విధంగా ముందుగానే అర్ధమయ్యే కొన్ని సన్నివేశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి.

అయితే, దర్శకుడు ఎన్. రాఘవన్ సినిమాను ఆసక్తికరమైన విజువల్స్ తో నడిపాదు. అలా నడిపినా.. స్లోగా సాగే సీన్స్ తో కొన్నిచోట్ల స్క్రీన్ ప్లే ను బాగా సాగదీశాడు. అలాగే సెకండాఫ్ లో కూడా కొన్ని సీన్స్ బోర్ గా సాగుతాయి. ఆ సీన్స్ లోని ఎలిమెంట్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండి ఉంటే ఈ సినిమా పూర్తి సంతృప్తికరంగా ఉండి ఉండేది. అలాగే సినిమాలో కొన్ని సన్నివేశాలు ఏ మాత్రం లాజిక్ లేకుండా సాగాయి

సాంకేతిక విభాగం:

ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. సినిమాటోగ్రఫీ వర్క్ అద్భుతంగా ఉంది. సినిమాలోని వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ సన్నివేశాలతో పాటు మిగిలిన సన్నివేశాలను కూడా కథాకథనాలకు అనుగుణంగా చాలా అందంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. అయితే సినిమాలో స్లోగా సాగే సీన్స్ ను సాధ్యమైనంత వరకు ట్రీమ్ చేసి ఉంటే.. సినిమాకి ప్లస్ అయ్యేది. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

తీర్పు:

ఈ ‘మై డియర్ భూతం’ పిల్లలకు నచ్చుతుంది. కిడ్ శ్రీను జీవితంలోకి భూతం వచ్చి చేసే అద్భుతాలను ప్రతి కిడ్ ఎంజాయ్ చేస్తాడు. అలాగే నత్తి లాంటి మానసిక సమస్యలతో బాధపడే పిల్లలకు సంబంధించి ఇచ్చిన మెసేజ్ కూడా చాలా బాగుంది. అయితే, స్లోగా సాగే సీన్స్ తో అక్కడక్కడ బోరింగ్ ట్రీట్మెంట్ తో, బలం లేని మెయిన్ సీక్వెన్స్ స్ ఈ సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. మొత్తానికి ఈ చిత్రం కిడ్స్ కు మాత్రం విజువల్ ట్రీట్ లా అనిపిస్తుంది.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు