ఓటిటి సమీక్ష : మణిరత్నం “నవరస” నెట్ ఫ్లిక్స్ లో!

ఓటిటి సమీక్ష : మణిరత్నం “నవరస” నెట్ ఫ్లిక్స్ లో!

Published on Aug 7, 2021 5:11 PM IST
Navarasa Web Series review

విడుదల తేదీ : ఆగస్టు 06, 2021
123తెలుగు.కామ్ రేటింగ్ :  2.75/5
నటీనటులు : సూర్య, విజయ్ సేతుపతి, సిద్ధార్థ్, రేవతి, పార్వతి తిరువోతు, ప్రయాగ మార్టిన్, అరవింద్ స్వామి, ప్రసన్న, పూర్ణ, ఢిల్లీ గణేష్, రోహిణి, గౌతమ్ వాసుదేవ్ మీనన్, యోగి బాబు, రమ్య నంబీసన్, అదితి బాలన్, బాబీ సింహా, రిత్విక, శ్రీరామ్, అథర్వ, మణికుట్టన్, నేదుమూడి వేణు, అంజలి, కిషోర్

దర్శకులు: ప్రియదర్శన్, కార్తీక్ సుబ్బరాజ్, వసంత్, అరవింద్ స్వామి, బిజోయ్ నంబియార్, కార్తీక్ నరేన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, సర్జున్ కె ఎం, రథీంద్రన్ ఆర్. ప్రసాద్.

నిర్మాతలు : మణిరత్నం, జయేంద్ర పంచపాకేశన్

సంగీత దర్శకుడు : ఏ ఆర్ రెహమాన్, సంతోష్ నారాయణన్, సుందరమూర్తి కె ఎస్, రాజేష్ మురుగేశన్, కార్తీక్, రాన్ ఏతాన్ యోహాన్, గోవింద్ వసంత, జస్టిన్ ప్రభాకరన్, విశాల్ భరద్వాజ్

బ్యానర్లు: మద్రాస్ టాకీస్ మరియు క్యూబ్ సినిమా టెక్నాలజీస్.

ఇటీవల ఇండియన్ ఫిల్మ్ ఎంటర్టైన్మెంట్ లో చాలా ఆసక్తి రేపుతూ వచ్చిన సిరీస్ లేదా సినిమా “నవరస”. ఇండియన్ లెజెండరీ దర్శకులు మణిరత్నం నిర్మాణంలో ఏకంగా తొమ్మిది మంది స్టార్స్ తో తొమ్మిది మంది దర్శకులతో, సంగీత దర్శకులతో తెరకెక్కించిన ఈ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ఇటీవల దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ లో విడుదల అయ్యింది. మరి ఈ నవరసాల సమ్మేళనం ఎలా ఉందో సమీక్షలో పరిశీలిద్దాం రండి..

కథ :

ఈ సిరీస్ మొత్తం 9 మందిపై 9 భాగాలుగా అంటే తొమ్మిది ఎపిసోడ్లు గా విభజించబడింది.. మరి ఆ ఒకో ఎపిసోడ్ లోని ఉన్న అంతర్యం ఏమిటో చూద్దాం

మొదటగా ఎపిసోడ్ : ‘కరుణ’

ఈ ఎపిసోడ్ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతితో ఉంటుంది. మంచి ఎమోషనల్ గా ఒక రకమైన పగ మరియు విచారంతో సాలిడ్ ఎమోషన్స్ ను కనబరుస్తుంది. మొదటి నుంచి కూడా ఈ ఎపిసోడ్ మంచి ఎమోషన్స్ తో డీల్ అయ్యి నడుస్తుంది కానీ ఎండింగ్ కాకుండా ఇంకా ఎఫెక్టీవ్ గా ఇచ్చి ఉంటే చాలా బావుండేది..

ఎపిసోడ్ 2 : ‘హాస్యం’

ఈ సిరీస్ లో ఈ రసపు ఎపిసోడ్ కాస్త బెటర్ గా ఉంటుందని చెప్పాలి. తమిళ స్టార్ కమెడియన్ యోగిబాబు పై డిజైన్ చేసిన ఈ కామికల్ ఎపిసోడ్ డీసెంట్ గా ఉంటుంది. చాలా క్లీన్ కామెడీతో మొదటి నుంచి కూడా మంచి ఎంగేజింగ్ గా నడుస్తుంది. అలాగే ఇందులో యోగిబాబు కి చిన్నప్పటి రోల్ లో కనిపించిన నటుడు కూడా అవుట్ స్టాండింగ్ పెర్ఫామెన్స్ ని కనబరుస్తాడు.. ఓవరాల్ గా మాత్రం ఈ ఎపిసోడ్ చాలా బాగుంటుంది.

ఎపిసోడ్ 3 : ‘అద్భుతం’

మరి ఈ ఎపిసోడ్ మరో విలక్షణ నటుడు అరవింద స్వామిపై డిజైన్ చేయబడింది.. కాలానికి సంబంధించి ఏదైనా కూడా అద్భుతంగానే ఉంటుందని మనకి తెలుసు అలా ఈ ఎపిసోడ్ లో ఫ్యూచర్ ప్లాట్ ని తీసుకున్నారు. కానీ దానిలో రియలిస్టిక్ మూమెంట్స్ తక్కువ కనపడడం విచారకరం. దీనితో చూసేవారికి అంత ఎంటర్టైనింగ్ గా ఈ ఎపిసోడ్ అనిపించకపోవచ్చు.

ఎపిసోడ్ 4 : ‘బీభత్సం’

ఈ ఎపిసోడ్ కూడా ఈ సిరీస్ లో అంత ప్రభావవంతంగా అనిపించదు.. బాగా భయంగా ఫీల్ అయ్యే ఓ పెద్ద మనిషి చుట్టూతా ఈ కథ తిరుగుతుంది. కాకపోతే ఇది బాగా స్లో గా ఉండడం పెద్దగా ఎమోషన్స్ కూడా ఎఫెక్టీవ్ గా అనిపించకపోవడం, ఎండింగ్ గా సరిగ్గా ఉండకపోవడం వంటివి ఈ సిరీస్ లో లో రేటెడ్ ఎపిసోడ్ గా ఇది కూడా నిలుస్తుంది.

ఎపిసోడ్ 5 : ‘శాంతి’

ఈ ఎపిసోడ్ మరో టాలెంటెడ్ నటుడు బాబీ సింహా అలాగే డైరెక్టర్ కమ్ నటుడు గౌతమ్ మీనన్ లపై ఒక వార్ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది.. అయితే ఇది అక్కడక్కడా పర్వాలేదు అనిపిస్తుంది కానీ సాలిడ్ ఎమోషన్స్ కూడా ఉంటే బాగుణ్ణు అనిపిస్తుంది. ఓవరాల్ గా మాత్రం పర్లేదు అనిపిస్తుంది.

ఎపిసోడ్ : 6 ‘రౌద్రం’

ఈ సిరీస్ లో ఈ ఎపిసోడ్ ఒకటి కూడా బాగుటుందని చెప్పొచ్చు.. ఈ ఎపిసోడ్ ని డీల్ చేసిన విధానం కానీ ముగించిన తీరు కానీ ఆకట్టుకుంటాయి. అలాగే మంచి ఎమోషనల్ యాంగిల్ కూడా ఈ ఎపిసోడ్ ని బాగా రక్తి కట్టిస్తుంది.

ఎపిసోడ్ 7 : ‘భయానకం’

ఇందులో మరో స్టార్ నటుడు సిద్ధార్త్ కనిపిస్తాడు.. ఈ ఎపిసోడ్ అంతా కూడా డీసెంట్ గా మంచి స్టార్ట్ తో నడుస్తుంది. అలాగే క్లైమాక్స్ పార్ట్ కూడా ఆకట్టుకుంటుంది. కానీ మధ్యలో చిన్న ప్లాట్స్ డిస్టబెన్స్ గా అనిపిస్తాయి..

ఎపిసోడ్ 8 : ‘వీరం’

ఈ ఎపిసోడ్ కూడా ఇందాక చెప్పిన వార్ బ్యాక్ డ్రాప్ లోనే నడుస్తుంది.. కానీ ఇది కూడా పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా అనిపించదు. ఎమోషన్స్ లో లోపం, యాక్షన్ సీక్వెన్స్ వంటివి ఇంకా బాగా తీర్చిదిద్ది ఉంటే బాగుండేది..

ఫైనల్ గా ఎపిసోడ్ 9 : ‘శృంగారం’

ఇది అసలు ఈ సిరీస్ లో అంతా ఆసక్తికరంగా ఎదురు చూసింది స్టార్ హీరో సూర్య పై ఈ ఎపిసోడ్ ని డిజైన్ చేశారు. చాలా కాలం తర్వాత సూర్య ని మంచి రొమాంటిక్ యాంగిల్ లో చూడబోతున్నామని చాలా అందని ఎగ్జైట్ అయ్యారు. మరి వాటికీ తగ్గట్టే సూర్య జస్టిస్ చేసారని చెప్పాలి. ఎపిసోడ్ కాస్త లాంగ్ ఉన్నా ప్రధాన పాత్రధారుల మధ్య మంచి కెమిస్ట్రీ కనిపిస్తుంది. ఓవరాల్ గా మాత్రం సూర్య కోసం వారై పెర్ఫామెన్స్ కోసం ఈ ఎపిసోడ్ ని చూడొచ్చు.

తీర్పు :

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే మొత్తం 9 రకాల భావోద్వేగాలను తొమ్మిది మంది నటులు దర్శకులు టెక్నీషియన్స్ తో తీర్చదిద్దబడిన ఈ సిరీస్ లో కొన్ని ఎపిసోడ్స్ ఆకట్టుకున్న కొన్ని ఓకే అనిపిస్తాయి. నటీటీనటులు మాత్రం తమ బెస్ట్ ఇచ్చారని చెప్పొచ్చు. అలాగే కొన్ని స్టోరీ లైన్స్ ని ఇంకా బెటర్ గా ప్రెజెంట్ చేసి ఉంటే బాగుండేది. ఫైనల్ గా మాత్రం ఓటిటిలో కాస్త ఓపిక ఉంటే స్ట్రిక్ట్ గా ఓసారి ఈ సిరీస్ ని చూడొచ్చు.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు