సమీక్ష : నీ కోసం – ఆసక్తిగా సాగని ఎమోషనల్ లవ్ స్టోరీస్ !

సమీక్ష : నీ కోసం – ఆసక్తిగా సాగని ఎమోషనల్ లవ్ స్టోరీస్ !

Published on Sep 7, 2019 2:59 AM IST
Taramani movie review

విడుదల తేదీ : సెప్టెంబరు 06, 2019

123తెలుగు.కామ్ రేటింగ్ :  2/5
నటీనటులు : అరవింద్ రెడ్డి, అజిత్ రాధారామ్, శుభంగి పంత్, దీక్షితా పార్వతి త‌దిత‌రులు
స్క్రీన్ ప్లే,దర్శకత్వం : అవినాష్ కోకటి
నిర్మాత‌ : భారతి
సంగీతం : శ్రీనివాస్ శర్మ
సినిమాటోగ్ర‌ఫీ: శివక్రిష్ణ యెడుల పురమ్

 

అవినాష్ కోకటి దర్శకత్వంలో అరవింద్ రెడ్డి, శుభాంగి పంత్, అజిత్ రాధారామ్ – దీక్షితా పార్వతి హీరోహీరోయిన్లుగా భారతి నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి.. ఈ సినిమా, ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

 

కథ :

 

కౌటిల్య (అరవింద్ రెడ్డి) కార్తీక (శుభాంగి పంత్) ఇద్దరూ లవర్స్. అయితే తన లవర్ ఈ ప్రపంచంలో తనకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వాలని.. ప్రతి నిముషం తన గురించే ఆలోచించాలని కోరుకుంటుంటాడు కౌటిల్య. ఈ క్రమంలో కార్తీక చేసే చిన్న చిన్న తప్పులకు ఆమెతో ఎప్పుడూ గొడవ పడుతుంటాడు. అంతలో కౌటిల్య ఓ బాంబ్ బ్లాస్ట్ లో తీవ్రంగా గాయాలపాలు అయి హాస్పిటల్ లో జాయిన్ అవ్వాల్సి వస్తోంది. అయితే ఆ బాంబ్ బ్లాస్ట్ జరిగిన ప్రదేశంలో దొరికిన ఓ డైరీలోని ప్రశాంత్ (అజిత్ రాధారామ్) సియా (దీక్షితా పార్వతి)ల ప్రేమకథను చదివాక కౌటిల్యకి ప్రేమ విలువ తెలిసివస్తోంది. అసలు కౌటిల్యను అంతగా మార్చిన
ప్రశాంత్ – సియా లవ్ స్టోరీ ఏంటి? ఇంతకీ ఈ ప్రశాంత్ – సియా ఎవరు? వీళ్ళ డైరీ ఆ బాంబ్ బ్లాస్ట్ దగ్గర ఎందుకు దొరికింది? అసలు వీళ్ళు బతికి ఉన్నారా? లేదా? ప్రశాంత్ – సియాని వెతుకుంటూ వెళ్లిన కౌటిల్యకి ఎలాంటి నిజాలు తెలిసాయి. అసలు మొత్తానికి ఆ బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయింది ఎవరు? చివరకి కౌటిల్య – కార్తీక ఒక్కటయ్యారా? లేదా ? లాంటి విషయాలు తెలియాలంటే వెండితెర పై ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

 

 

ప్లస్ పాయింట్స్ :

 

 

అవినాష్ కోకటి దర్శకత్వంలో రెండు ఎమోషనల్ లవ్ స్టోరీస్ తో వచ్చిన ఈ సినిమాలో.. ఈ జనరేషన్ లవ్ స్టోరీస్ కి దగ్గరికిగా సాగే ఇన్సిడెంట్స్ తో పాటు ఎమోషనల్ గా సాగే సీన్స్, మరియు డైలాగ్స్ అలాగే కొన్ని సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయి. ఇక ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అరవింద్ రెడ్డి తన పాత్రకు తగ్గట్లు బాగా నటించాడు. ప్రేమించిన అమ్మాయికి తనే ప్రపంచం కావాలని ఆరాట పడే ప్రేమికుడిగా అరవింద్ రెడ్డి ఆ పాత్రలో ఒదిగిపోయాడు. అలాగే మరో హీరోగా నటించిన అజిత్ రాధారామ్ కూడా కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో చక్కని పెర్ఫార్మెన్స్ కనబర్చాడు. ముఖ్యంగా డైలాగ్ డెలివరీతో అలాగే డాన్స్ తో ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ నటించిన శుభాంగి పంత్ పర్వాలేదనిపిస్తోంది.

ఇతర కీలక పాత్రల్లో నటించిన సుదర్శన్, సాయి ఎప్పటిలాగే తమ కామెడీ ఎక్స్ ప్రెషన్స్ తో, తమ శైలి మాడ్యులేషన్స్ తో సినిమాలో కనిపించనంత సేపూ నవ్వించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. దర్శకుడు ఈ చిత్రాన్ని ఎమోషనల్ డ్రైవ్ తో ప్యూర్ లవ్ స్టోరీగా చెప్పటానికి చేసిన ప్రయత్నం బాగుంది.

 

మైనస్ పాయింట్స్ :

 

 

దర్శకుడు అవినాష్ రాసుకున్న కాన్సెప్ట్ మరియు ఎమోషనల్ సీన్స్.. అలాగే కొన్ని ప్రేమ సన్నివేశాలు బాగున్నప్పటికీ.. సినిమా ఎవరు చుట్టూ అయితే తిరుగుతుందో.. ఆ కీలకమైన పాత్రలో నటించిన దీక్షితా పార్వతి నటన పరంగా పూర్తిగా తేలిపోవడంతో ఆమె ట్రాక్ లో ఉన్న బలమైన ఎమోషన్ ను, స్క్రీన్ మీద ఆమె సరిగ్గా పలికించలేకపోయింది. పైగా విషయం ఉన్న సన్నివేశాలు కూడా.. పేలవంగా సాగే నటన దెబ్బకి ఆ సన్నివేశాల్లో కంటెంట్ ఎలివేట్ కావాల్సిన స్థాయిలో ఎలివేట్ కాలేదు. అలాగే ఈ సినిమాకి మిగిలిన సాంకేతిక విభాగం నుండి కూడా సరైన సహకారం అందలేదు. ముఖ్యంగా ఈ సినిమాలో సినిమాటోగ్ర‌ఫీ వర్క్ నిరాశ పరుస్తోంది.

స్క్రిప్ట్ పరంగా రెండు ప్రేమ కథలు.. ఒకేసారి సాగుతూ.. ఒక కథకి మరో కథకి ఇంటర్నల్ లింక్స్ తో సాగే స్క్రీన్ ప్లేలోని తేడాను.. సినిమాటోగ్ర‌ఫర్ స్క్రీన్ మీద సరిగ్గా చూపించలేకపోయాడు. గతానికి వర్తమానానికి మధ్య తేడాని తెలియజేసే షాట్స్ ను కూడా సినిమాటోగ్ర‌ఫర్ సరిగ్గా తీయలేదు. అదేవిధంగా శ్రీనివాస్ శర్మ అందించిన నేపథ్య సంగీతం కూడా ఎమోషనల్ సీన్స్ లోని ఎమోషన్ ఎలివేషన్ కి సరిగ్గా ఉపయోగపడలేకపోయింది.

 

సాంకేతిక విభాగం :

 

సాంకేతిక విభాగం గురించి ముందు చెప్పుకున్నట్లుగానే సినిమాలో సినిమాటోగ్రఫీ వర్క్ పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు. సంగీత దర్శకుడు అందించిన పాటలు బాగానే ఉన్నాయి. ముఖ్యంగా ‘వెళ్లిపో మాకే’ అనే పాట, అలాగే ఆ పాటను చిత్రీకరించిన విధానం మరియు ప్రీ క్లైమాక్స్ లో వచ్చే బిట్ సాంగ్ బాగుంది. అలాగే దర్శకుడు సినిమాలో చెప్పాలనుకున్న పాయింట్ బాగుంది, అలాగే నేటి యువత తమ ప్రేమలో ఎదురుకుంటున్న కొన్ని సంఘటనలను, సమస్యలను అనినాష్ సినిమాలో బాగా చూపించాడు. అయితే సాంకేతిక విభాగం నుండి, నిర్మాణం నుండి అవినాష్ కి సరైన సపోర్ట్ దొరికి ఉండి ఉంటే.. సినిమాకి బాగా ప్లస్ అయ్యేది. అయితే దర్శకుడు ఈ సినిమాకి జరిగిన పొరపాట్లును తన తదుపరి సినిమాలో జరగకుండా చూసుకుంటే.. అతనికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇక ఎడిటర్ తమ్మిరాజు ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని నిర్మాత పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ ఇంకా బాగుండి ఉంటే స్క్రిప్ట్ కి న్యాయం జరిగేది.

 

తీర్పు :

 

అవినాష్ కోకటి దర్శకత్వంలో రెండు ఎమోషనల్ లవ్ స్టోరీస్ తో వచ్చిన ఈ సినిమాలో.. ఈ జనరేషన్ లవ్ స్టోరీస్ కి దగ్గరికిగా సాగే ఇన్సిడెంట్స్ అలాగే కొన్ని ఎమోషనల్ గా సాగే సీన్స్, మరియు డైలాగ్స్ బాగున్నప్పటికీ.. పేలవంగా సాగే నటన, సాంకేతిక విభాగం పనితనం సరిగ్గా లేకపోవడం, అలాగే సినిమాటోగ్ర‌ఫీ వర్క్ పూర్తిగా నిరాశ పరచడం మరియు నిర్మాణ పరమైన ఇబ్బందులు వంటి అంశాలు ఈ సినిమాకి బలహీనతలుగా నిలుస్తాయి. అయితే దర్శకుడు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలతో ఆకట్టుకుంటాడు. మరి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి.

123telugu.com Rating :  2/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు