ఓటిటి రివ్యూ : “ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్” – తెలుగు సిరీస్ ‘ఆహా’లో

 In the Name of God Movie Review

విడుదల తేదీ : జూన్ 18,2021
123telugu.com Rating : 2.5/5

నటీనటులు : ప్రియదర్శి, నందిని రాయ్, పోసాని కృష్ణ మురళి
దర్శకుడు : విద్యాసాగర్ ముత్తుకుమార్
నిర్మాత : సురేష్ క్రిస్నా
సినిమాటోగ్రఫీ : వరుణ్ డికె
సంగీతం : దీపక్ అలెగ్జాండర్
ఎడిటింగ్ : నిఖిల్ శ్రీకుమార్

ప్రస్తుతం మేము కొనసాగిస్తున్న పలు వెబ్ షోస్ మరియు డైరెక్ట్ డిజిటల్ సినిమాల రిలీజ్ రివ్యూల పరంపరలో మేము ఎంచుకున్న లేటెస్ట్ వెబ్ సిరీస్ ” ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్”. తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా లో తాజాగా విడుదల కాబడ్డ ఈ సిరీస్ ఎలా ఉందో ఇపుడు రివ్యూలో తెలుసుకుందాం రండి..

కథ :

ఇక కథలోకి వెళ్లినట్టయితే ఆది(ప్రియదర్శి) ఎప్పటి నుంచో ఓ రిసార్ట్ ను కొనుక్కోవాలని ఆశతో ఉంటాడు. అలాగే మరోపక్క ఆది, మీన(నందిని రాయ్) అనే ఒకామెని ఇష్టపడతాడు అయితే ఆమె కాస్త అయ్యప్ప(పోసాని) అనే వ్యక్తికి భార్య.. మరి క్రమంలో ఓరోజు మీణా ఆదిని ఒక సాయం అడగ్గా తనకి ఉన్న ఇష్టంతో అదేంటి అని అడక్కుండా కూడా ఒకే చెప్పేస్తాడు. కానీ ఇక్కడే ఊహించని ట్విస్ట్ తో మీనా భర్త పోసాని మర్డర్ చెయ్యబడతాడు, అక్కడే ఓ డబ్బు బ్యాగ్ కూడా ఉంటుంది. దీనితో ఆ మర్డర్ ఆది మీదకు వెళ్లడం అతడు ప్రధాన నిందితుడిగా చిత్రీకరించడం స్టార్ట్ అవుతుంది. మరి ఈ అనుకోని చిక్కు నుంచి నుంచి ఆది ఎలా బయట పడతాడు? అసలు మర్డర్ చేసింది ఎవరు? అన్నవి తెలుసుకోవాలి అంటే ఈ సిరీస్ ను చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

మొదట ఈ థ్రిల్లర్ సిరీస్ లోని నటీనటుల విషయానికి వస్తే.. ప్రియదర్శి తన నటనతో సూపర్బ్ ఫినిషింగ్ ఇచ్చాడని చెప్పాలి. సిల్వర్ స్క్రీన్ పై కమెడియన్ గానే వచ్చినా ఓటిటి స్క్రీన్ పై మాత్రం సాలిడ్ రోల్స్ చేస్తూ తనలోని నటుడిని బయటపెడుతున్నాడు. ఇది వరకే కొన్ని సాలిడ్ పెర్ఫామెన్స్ లు ఇచ్చాడు. అలా ఈ సిరీస్ లో కూడా అద్భుతమైన ఎమోషన్స్ తో రక్తి కట్టించాడు.

ముఖ్యంగా కొన్ని సీరియస్ సన్నివేశాలు సహా ఇతర ఎమోషన్స్ లో తన నటనా చాతుర్యం ఎంతో అర్ధం అవుతుంది. అలాగే ఫీమేల్ లీడ్ నందిని రాయ్ కూడా తన తనకున్న స్కోప్ వరకు చాలా నీట్ పెర్ఫామెన్స్ కనబరిచింది. డిజైన్ చేసిన రోల్ కి తగ్గట్టుగా ఆమె కనబరిచిన నటన కానీ గ్లామర్ డోస్ కానీ ఇంప్రెసివ్ గా ఉంటాయి.

అలాగే నెగిటివ్ రోల్ లో కనిపించిన అలీ బైగ్ సాలిడ్ పెర్ఫామెన్స్ కనబరిచాడు. ఇక సిరీస్ లోని ఎలిమెంట్స్ విషయానికి వస్తే క్రైమ్ యాంగిల్ చుట్టూతా నడిచే డ్రామా అంతా మంచి ఆసక్తికరంగా అనిపిస్తుంది. అలాగే కీ మూమెంట్స్ ను రివీల్ చేస్తూ రావడం ముఖ్యంగా మొదటి రెండు ఎపిసోడ్స్ లో బాగుంది..

మైనస్ పాయింట్స్ :

జెనెరల్ గా ఓటిటి షోస్ అంటే కాస్త బోల్డ్ కంటెంట్ నే వీక్షకులు కోరుకుంటారు మరి దానిని రీజనబుల్ గా హ్యాండిల్ చేస్తే బానే ఉంటుంది కానీ కావాలని ఇరికిస్తేనే ఎబ్బెట్టుగా ఉంటుంది. అదే ఈ సిరీస్ లో పెద్ద డ్రా బ్యాక్ అని చెప్పాలి. బోల్డ్ కంటెంట్ అంటే అన్నీ సీన్స్ కోసం అనుకుంటారేమో అవి మాత్రమే కాకుండా ప్రతిసారి పరుష పదజాలంతో తిట్టుకోడం ఈ సిరీస్ లో ఒకింత మగవాళ్లకే బాగా చికాకు పుట్టించొచ్చు.

అలాగే సిరీస్ నాలుగో ఎపిసోడ్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి అంతా డల్ అయ్యిపోతుంది అనవసరమైన పాత్రలు,సరిగ్గా సాగని స్క్రీన్ ప్లే వంటివి కొన్ని అంశాలలో థ్రిల్ ను దూరం చేస్తాయి. అలాగే ప్రతీ పాత్రకు కూడా తీసుకున్న అతి జాగ్రత్త కూడా దీనికి దెబ్బేసింది అని చెప్పాలి.

వాటిని మరీ లోతుగా చూపించడం అవసరం లేదు అనిపిస్తుంది. అలాగే ఆ తర్వాత నుంచి పలు చోట్ల బాగా సాగదీసినట్టు కూడా ఉంటుంది. ప్రియదర్శి రోల్ డిజైన్ కి కూడా ఓవరాల్ గా జస్టిఫికేషన్ ఉన్నట్టు ఉంది. అలాగే మరో ముఖ్య పాయింట్ ఏమిటంటే ఈ తరహా సిరీస్ లకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్ కానీ అసలు అది ఇంపాక్ట్ కలిగించేట్టే ఉండదు.

సాంకేతిక వర్గం :

మరి ఈ సిరీస్ లో నిర్మాణ విలువలు చాలా బాగుంటాయి. అలాగే టెక్నీకల్ విషయానికి వస్తే కెమెరా వర్క్ మాత్రం సూపర్బ్ గా ఉంటుందని చెప్పాలి. ప్రతి ఫ్రేమ్ లో సిరీస్ థీమ్ కి తగ్గట్టుగా చూపిన విజువల్స్ ఇంప్రెస్ చేస్తాయి. డైలాగ్స్ మాత్రం బాలేవు, అలాగే ఎడిటింగ్ కూడా సవరించాల్సింది.

ఇక దర్శకుడు విద్యా సాగర్ విషయానికి వస్తే తాను రాసుకున్న కంటెంట్ క్లీన్ అండ్ నీట్ గా ఉన్నా దానిని ఆన్ స్క్రీన్ పై ఎస్టాబ్లిష్ చెయ్యడంలో ఇంకా మెరుగైన ప్రదర్శన చూపించాల్సింది. నటుల నుంచి మాత్రం మంచి నటనను రాబట్టుకోడంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి. కాకపోతే నరేషన్ పై ఎక్కువ కేర్ తీసుకొని ఉంటే మంచి అవుట్ పుట్ వచ్చి ఉండేది.

తీర్పు :

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ “ది నేమ్ ఆఫ్ గాడ్” లో ప్రియదర్శి మరియు నందిని రాయ్ సహా ఇతర నటుల సాలిడ్ పెర్ఫామెన్స్ లతో ఆకట్టుకుంటారు అలాగే ఫస్ట్ రెండు మూడు ఎపిసోడ్స్ కూడా బాగుంటాయి. కానీ డైరెక్షన్ లో లోటు పాట్లు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగా దూరం అవ్వడం, ఓవర్ గా బూతు పదాలు వాడడం వంటివి ఓవరాల్ గా ఈ సిరీస్ పై ఆసక్తిని తగ్గించేస్తాయి. స్ట్రిక్ట్ గా అయితే బాగా క్రైమ్ థ్రిల్లర్స్ ను చూసే వాళ్ళకి ఒక్కసారి మాత్రమే ఈ సిరీస్ చూడొచ్చు.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :