ఓటిటి రివ్యూ : “పిట్ట కథలు”(తెలుగు చిత్రం నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం)

నటీనటులు: శృతి హాసన్, ఈషా రెబ్బా, అమలా పాల్, లక్ష్మి మంచు, జగపతి బాబు, అషిమా నార్వాల్

దర్శకత్వం: నాగ్ అశ్విన్, బి.వి.నందిని రెడ్డి, తరుణ్ భాస్కర్, సంకల్ప్ రెడ్డి

నిర్మాణం: రోనీ స్క్రూవాలా, ఆశి దువా

సంగీతం: వివేక్ సాగర్

ఎడిటింగ్: ఉపేంద్ర వర్మ

పలు ఆసక్తికర ఓటిటి వెబ్ సిరీస్ లు అలాగే డిజిటల్ గా రిలీజ్ అవుతున్న సినిమాల రివ్యూస్ తో కొనసాగిస్తున్న క్రమంలో మేము ఎంచుకున్న లేటెస్ట్ చిత్రం “పిట్ట కథలు”.దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ లో విడుదల కాబడ్డ మొట్ట మొదటి ఎక్స్ క్లూజివ్ తెలుగు చిత్రం ఇది.మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

నెట్ ఫ్లిక్స్ నుంచి వచ్చిన ఈ మొట్ట మొదటి తెలుగు ఆంథోలజి చిత్రం పిట్ట కథలు స్టార్ క్యాస్టింగ్ మరియు నలుగురు దర్శకులతో చేసిన ఈ చిత్రంలో నాలుగు భిన్నమైన కథలు ఉంటాయి. అవి చూస్తే..

రాముల – ఈ కథ తెలంగాణలోని ఓ చిన్న టౌన్ కి చెందిన అమ్మాయి రాముల(సాన్వి మేఘన) అలాగే ఆమె బాయ్ ఫ్రెండ్ (అభయ్ భేతిగంటి) ఉంటారు. అయితే వీరిద్దరినీ అక్కడి లేడీ పొలిటీషన్ స్వరూపక్క(మంచు లక్ష్మి) ఎలా వాడుకుంది? అన్నది దీని కథ.

మీరా – ఈ కథ ఒక యువ గృహిణి మీరా(అమలా పాల్) తన కంటే 18 ఏళ్ళు పెద్దవాడు అయినా భర్త(జగపతి బాబు) వల్ల ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది?మరి వీరిద్దరి కథ ఎలా ముగిసింది అన్నదే పాయింట్.

ఎక్స్ లైఫ్ – సంజిత్ హెగ్డే అనే ఒక యువ సాంకేతిక వైజ్ఞ్యానికుడు ఎక్స్ లైఫ్ అనే ఒక భవిష్యత్ టెక్నాలజీని కనిపెడతాడు. మరి దీని వల్ల ఏం జరిగింది అన్నది ఇందులో ఇతివృత్తం.

పింకీ – ఇక దీనిలోకి వస్తే ఓ పెళ్లి కాబడిన రచయితకు సంబంధించి ఉంటుంది.ఈ రోల్ లో కనిపించిన సత్యేదేవ్ కు ఆల్రెడీ పెళ్లి అయినా కూడా అతని మాజీ భార్యతో అఫైర్ కొనసాగిస్తాడు. మరి వీరి కథ ఎలా ముగిసింది అన్నవి తెలియాలి అంటే ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో చూడాల్సిందే.

 

ఏమి బాగుంది :

 

మంచి బజ్ ను ఏర్పర్చుకున్న ఈ చిత్రంలో మొదటి నుంచీ కూడా నాలుగు కథలను హైలైట్ చేస్తూ చూపించారు. మరి వాటిలో కొన్ని మ్యానేజ్ చేసిన విధానం ఇందులో నీట్ గా కనిపిస్తుంది. మొదటగా టాలెంటెడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ డిజైన్ చేసిన రాముల జంట కథ చాలా అందంగా అనిపిస్తుంది బలమైన కదిలించే ఎమోషన్స్, ఇద్దరి నటీనటుల నటన చాలా నాచురల్ గా చక్కగా అనిపిస్తుంది. ఇక అలాగే అభయ్ మరోసారి తానేంటో ప్రూవ్ చేసుకున్నాడని చెప్పాలి. ఇక ఈ కథలో మరో స్పెషల్ మెన్షన్ మంచు లక్ష్మి కోసం మాట్లాడాలి. స్వరూపక్క అనే పవర్ ఫుల్ రోల్ లో ఆమె నటించిన విధానం ఆమె రోల్ కొత్తగా ఆమెలోని సరికొత్త కోణంలా అనిపిస్తాయి.

ఇక మరో కథ లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి డిజైన్ చేసిన మీరా కథ ఇంప్రెసివ్ గా ఉంటుంది.దీనితో నందిని రెడ్డి లోని కొత్త టచ్ ను కూడా పరిచయం చేసి చాలా డిఫరెంట్ గా చూపించారని అని చెప్పాలి. జగపతిబాబు పై డిజైన్ చేసిన రోల్ కానీ దానిని ఎస్టాబ్లిష్ చేసిన విధానం కానీ చాలా బాగుంటాయి. అలాగే అమలా పాల్ తన రోల్ కు కంప్లీట్ జస్టిస్ చేసింది.

ఇక అలాగే మరో కీలక పాత్రల్లో నటించిన ఈషా రెబ్బా, అషిమా నర్వాల్ రోల్స్ డీసెంట్ గా అనిపిస్తాయి. వారు మంచి నటనను కనబర్చారు. ఇక అలాగే ఎక్స్ లైఫ్ లో కనిపించిన సంజిత్ హెగ్డే ఆ రోల్ కు తగ్గట్టుగా సూపర్బ్ గా చేసాడు.

 

ఏం బాగోలేదు?

 

మొదటగా దీనికి పెద్ద దెబ్బ దేని వల్ల పడింది అని చెప్పాలి అంటే దీనికి తెచ్చిన హైప్ వలనే అని చెప్పాలి. ఆంథోలజి జానర్ లో ప్లాన్ చేసిన ఈ చిత్రం అనుకున్న స్థాయి హైప్ ను మ్యాచ్ చెయ్యలేనట్టు అనిపిస్తుంది. మరి అలాగే ఇక్కడ షాకిచ్చే మరో అంశం ఏమిటంటే టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ డిజైన్ చేసిన ఎక్స్ లైఫ్ అర్ధ రహితంగా కనిపిస్తుంది.

ఇంట్రెస్టింగ్ పాయింట్ ను అనుకున్నా దానిని సరిగ్గా ఎస్టాబ్లిష్ చెయ్యడంలో ఖచితమైన వైఫల్యం కనబడటం బాధాకరం. దీనితో ఎందులో ఏం జరుగుతుంది అన్నది కూడా ఒకింత ఆలోచనలో పడేస్తుంది. సరే ఇదే ఒకెత్తు అనుకుంటే శృతి హాసన్ ఈ రోల్ ఎందుకు ఎంచుకుందో ఆమెకే తెలియాలి.

ఇక చివరిగా మరో టాలెంటెడ్ దర్శకుడు సంకల్ప్ రెడ్డి డీల్ చేసిన కథ విషయానికి వస్తే తాను ఎంచుకున్న కథలో మంచి స్టార్టప్ కనిపిస్తుంది. కానీ అలా అది వాదించే కొద్దీ మాత్రం పేలవంగా మారుతున్నట్టు అనిపిస్తుంది. దీనితో ఓవరాల్ గా ఈ కథ కూడా సత్యేదేవ్ ఉన్నప్పటికీ ఆకట్టుకోదు.

 

సాంకేతిక వర్గం :

 

నెట్ ఫ్లిక్స్ వారు డిజైన్ చేసిన ప్రోడక్ట్ ఏదైనా సరే దాని అవుట్ ఫుట్ సూపర్బ్ గా వస్తుంది. అద్భుతమైన విజువల్స్, అలాగే వివేక్ సాగర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇలా ప్రతీ టెక్నినల్ డిపార్ట్మెంట్ లో అవుట్ స్టాండింగ్ గా ఉంటాయి. అలాగే నాగ్ అశ్విన్ ఎపిసోడ్ లో అయితే మంచి వి ఎఫ్ ఎక్స్ కూడా కనిపిస్తాయి. అలాగే అన్ని స్టోరీస్ లో డైలాగ్స్ కూడా నీట్ గా ఉన్నాయి. ఎడిటింగ్ కూడా బాగుంది.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసుకున్నట్టు అయితే మంచి హైప్ ను నమోదు చేసుకొని వచ్చిన ఈ మొట్టమొదటి తెలుగు నెట్ ఫ్లిక్స్ ఆంథోలజి చిత్రం “పిట్ట కథలు” ఆ హైప్ ను అందుకోవడంలో తడబడింది అని చెప్పాలి. తరుణ్ భాస్కర్ అలాగే నందిని రెడ్డిలు డిజైన్ చేసిన కథలు, వాటిలో కనిపించే పాత్రలు నీట్ అండ్ క్లీన్ గా అనిపిస్తాయి. అలాగే మంచి ఎమోషన్స్ కూడా ఉన్నాయి. కానీ మంచి టాలెంటెడ్ దర్శకులు నాగ్ అశ్విన్ మరియు సంకల్ప్ రెడ్డిల నుంచి ఇంకా బెటర్ అవుట్ ఫుట్ వచ్చి ఉంటే కనుక ఈ చిత్రం రిజల్ట్ మరో లెవెల్లో ఉండేది. కానీ అలా జరగకపోవడం బాధాకరం, మరి ఇవన్నీ పక్కన పెడితే ఓసారి ఈ చిత్రాన్ని ఛాయిస్ గా చూడొచ్చు.

 

Rating: 2.75/5

సంబంధిత సమాచారం :