ఓటీటీ సమీక్ష: అన్హియర్డ్ – తెలుగు సిరీస్ డిస్నీ హాట్ స్టార్‌లో

Unheard Movie Review

విడుదల తేదీ : సెప్టెంబర్ 17, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: అవసరాల శ్రీనివాస్, ప్రియదర్శి, అజయ్, చాందిని చౌదరి, బాలాదిత్య తదితరులు

దర్శకుడు: కె వి ఆదిత్య
నిర్మాత: రాధిక లావు

సంగీత దర్శకుడు: నరేష్ కుమరన్

సినిమాటోగ్రఫీ: అభిరాజ్ నైర్

ఎడిటర్: గ్యారీ బీ హెచ్


ప్రియదర్శి, అజయ్, చాందిని చౌదరి, బాలాదిత్య మరియు ఇతరులు ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు లిమిటెడ్ సిరీస్ ఇప్పుడు డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రసారం అవుతోంది. మరీ ఈ సిరీస్‌ ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

కథ:

స్వాతంత్య్రానికి పూర్వం జరిగిన ఈ సిరీస్ భారతదేశ స్వాతంత్ర పోరాటంలో తమ వైఖరిని వివరించే ప్రధాన పాత్రల చుట్టూ తిరుగుతుంది. మొత్తం ఆరు ఎపిసోడ్‌లు కాగా దాదాపు రెండు మూడు పాత్రల సంభాషణలపైనే పూర్తిగా ఆధారపడి ఉంటాయి.

ప్లస్ పాయింట్స్:

ఈ సిరీస్‌లో అజయ్, ప్రియదర్శి, చాందిని మరియు బాలాదిత్య ప్రధాన పాత్రలు పోషించారని మరియు వీరంతా చక్కటి నటనను ప్రదర్శించారు. ముఖ్యంగా అజయ్ భావోద్వేగ సంభాషణలు ఆకట్టుకున్నాయి.

ఇక ప్రధాన పాత్రల మధ్య సంభాషణలపై, స్వాతంత్ర పోరాటంలో భారతీయుల భావజాలానికి సంబంధించిన కొన్ని డైలాగ్‌లు పంచ్ ప్యాక్ చేస్తాయి. కథ మొత్తం ప్రధాన పాత్రల మధ్య సంభాషణల ద్వారా ప్రదర్శించబడింది మరియు ఇది తెలుగు వెబ్ రంగంలో ఒక కొత్త రకమైన ప్రయత్నమనే చెపాలి.

మైనస్ పాయింట్స్:

ఈ సినిమా మొత్తం కథనం స్వాతంత్ర పోరాట సంభాషణల మీద ఆధారపడి ఉంటుంది. ఇది కొత్త తరహా విధానం మరియు ఇది ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులను తీర్చదు.

సంభాషణలు ఒక పాయింట్ దాటి మార్పులేనివిగా మారతాయి. రెండవ మరియు మూడవ ఎపిసోడ్‌లలో డైలాగ్‌లు చాలా పొడవుగా ఉన్నాయి. ముగింపు కూడా పెద్దగా ఆకట్టుకోలేదు.

సాంకేతిక విభాగం:

ఈ సిరీస్ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. స్వాతంత్య్రానికి పూర్వం హైదరాబాద్, మరియు సికింద్రాబాద్ యొక్క సారాంశం చాలా బాగా ప్రదర్శించబడింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఒకే అనిపించింది, సినిమాటోగ్రఫీ కూడా క్వాలిటీతో ఉంది.

తీర్పు:

మొత్తంగా చూసుకున్నట్టైతే అన్హియర్డ్ అనేది ఒక చక్కట్టి సంభాషణ సిరీస్, తెలుగు వెబ్ స్పేస్‌లో ఇదో కొత్త ప్రయత్నం అని చెప్పాలి. భారతదేశ స్వాతంత్ర పోరాటానికి సంబంధించిన ఈ సంభాషణలు కొంతమందికి ఆసక్తికరంగా అనిపించినప్పటికీ, కొందరికి మాత్రం విసుగు తెప్పించేలా ఉంటాయి. ఫైనల్‌గా ఈ సిరీస్‌కి మిక్స్‌డ్ టాక్ లభించింది.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :