రివ్యూ : పచ్చీస్ (ఈ తెలుగు సినిమా ఆమెజాన్ ప్రైమ్ లో ప్రసారం)

Pachchis Movie Review

విడుదల తేదీ : జూన్ 12, 2021

123telugu.com Rating : 2.75/5

నటీనటులు : రామ్జ్ , శ్వేతా వర్మ, రవివర్మ, దయానంద్ రెడ్డి, సుభలేఖ సుధాకర్, విశ్వేందర్ రెడ్డి తదితరులు.

దర్శకులు : శ్రీ కృష్ణ & రామ్ సాయి

నిర్మాతలు : కౌశిక్ కుమార్ రామ్ సాయి

టాలీవుడ్ సెలబ్రిటీ డిజైనర్ రామ్స్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘పచ్చీస్’. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రానికి శ్రీ కృష్ణ & రామ సాయి సంయుక్తంగా దర్శకత్వం వహించారు. శ్వేతావర్మ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం ఈ రోజు నుంచి ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.

కథ :

అభిరామ్ (రామ్‌) క్ల‌బుల్లో పేకాట ఆడి ల‌క్ష‌లు పోగొట్టుకుంటాడు. దాంతో క్ల‌బ్ య‌జ‌మాని ఆర్కే (ర‌వివ‌ర్మ‌)కు రూ.17 ల‌క్ష‌లు బాకీ పడాల్సి వస్తోంది. అలాగే మరో విష‌యంలో కూడా అభిరామ్ ఆర్కేని మోసం చేయడంతో.. అభిరామ్ జీవితం మలుపు తిరుగుతుంది. పైగా ఆ మోసాన్ని ఆర్కే అసలు త‌ట్టుకోలేడు. అభిరామ్ ని నీడ‌లా వెంటాడుతుంటాడు. ఆ తరువాత కొన్ని నాటకీయ పరిణామాల అంనంతరం అభిరామ్ పెద్ద రిస్క్ చేస్తాడు ? అసలు అభిరామ్ చేసిన రిస్కేమిటి? చివరకు ఈ కథ ఎలాంటి మ‌లుపులు తీసుకుంది ? ఎలా ముగిసింది ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్లు :

పేకాట వ్యసనపరుడిగా మోసపూరిత యువకుడిగా రామ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. కొన్ని సన్నివేశాల్లో తన పాత్రకు తగ్గట్టు ఎక్స్ ప్రెషన్స్ చేంజ్ చేస్తూ తన పాత్రలో జీవించాడు. ఇక రవివర్మతో రామ్ కలయికలో వచ్చే సన్నివేశాలన్నీ బాగున్నాయి. తన సోదరుడి కోసం వెతుకుతూ, ఎమోషనల్ పాత్రలో శ్వేతా వర్మ ఆకట్టుకుంటుంది. కీలక సీన్స్ లో ఆమె పలికించిన భావోద్వేగాలు కూడా బాగున్నాయి.

అలాగే నటుడు రవివర్మకు కూడా మంచి పాత్ర లభించింది. ఆర్కే పాత్రలో అతను చాల బాగా నటించాడు. ముఖ్యంగా అతని డైలాగ్ డెలివరీ, హైదరాబాదీ యాస మరియు స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుంది. సుభలేక సుధాకర్ తన సీరియస్ రోల్ లో చక్కగా రాణించారు. అదేవిధంగా సినిమాలో వచ్చే క్లైమాక్స్ ట్విస్ట్ కూడా బాగా ఎలివేట్ అయింది.

ఇక ఈ చిత్రంలో సాగే ఇతివృతం, మరియు థ్రిల్ తో సాగే కొన్ని సీన్స్ బాగున్నాయి. ఈ చిత్రంలోని అండర్ కవర్ కాప్ యాంగిల్ కూడా చాలా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. విజువల్స్ చాలా గ్రిప్పింగ్ గా కనబడుతున్నందున ఈ చిత్రం యొక్క థీమ్ కూడా బలంగా ప్రదర్శించబడింది.

మైనస్ పాయింట్లు :

ఈ చిత్రం ఒక ఆసక్తికరమైన ప్లేతో మొదలవుతుంది, కానీ, కొన్ని సీన్స్ తర్వాత, ప్లేలో ఇంట్రెస్ట్ స్థాయి తగ్గిపోతుంది. పైగా సినిమాలో అనేక రిపీట్ డ్ సన్నివేశాలు ఉన్నాయి. పైగా ఆ సన్నివేశాలు ఏవి ఇంట్రెస్ట్ ను సృష్టించడానికి గాని, స్క్రీన్ ప్లేలో ట్విస్ట్ ఇవ్వడానికి కూడా ఆ సన్నివేశాలు సరిగ్గా ఉపయోగపడలేదు.

ఇక డైలాగ్స్ చాలా బాగున్నాయి. అయితే పేపర్ మీద బాగున్న మీనింగ్ ఫుల్ డైలాగ్స్ ను, సినిమాటిక్ గా రాసి ప్రేక్షకులకు బాగా ఎక్కేలా మాడ్యులేషన్ తీసుకోవాలి. ఈ సినిమాలో అది మిస్ అయింది. దానికితోడు కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఫేక్ గా అనిపిస్తాయి. దర్శకుడు సెకెండాఫ్ ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఇంట్రస్ట్ గా నడుపుదామని మంచి ప్రయత్నం అయితే చేశారు గాని, అది స్క్రీన్ మీద అంత ఎఫెక్టివ్ గా వర్కౌట్ కాలేదు.

సాంకేతిక విభాగం :

టెక్నికల్ గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా నేపథ్య సంగీతం సినిమాకు బాగా ప్లస్ ఆయింది. అదే విధంగా సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ పనితనం చాలా బాగుంది. ఎడిటర్ వర్క్ సినిమాకి తగ్గట్లు ఉంది. సినిమాలోని నిర్మాతలు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు. ఇక దర్శకులు మంచి కథాంశం తీసుకున్నా ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోలేదు.

తీర్పు :

‘పచ్చీస్’ అంటూ వచ్చిన ఈ చిత్రం కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో, ఫ్యూ సీన్స్ తో కొన్నిచోట్ల పర్వాలేదనిపించినా.. ప్లే మాత్రం సాధారణ దృశ్యాలతో నిస్తేజంగా సాగుతుంది. పైగా సినిమాలో ఎలాంటి కొత్తదనం లేదు. అయితే ఈ చిత్రంలో నటీనటులు తమ నటనతో ఆకట్టుకున్నారు. క్రైమ్ థ్రిల్లర్‌లను ఇష్టపడే వారందరికీ ఈ సినిమాలో కొన్ని అంశాలు నచ్చుతాయి. ఇక మిగిలిన వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చదు.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :