ఆడియో సమీక్ష : పైసా – హాయిగా సాగే డీసెంట్ ఆల్బమ్


యంగ్ హీరో నాని – క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ కాంబినేషన్లో రానున్న చిత్రం ‘పైసా’. ఈ సినిమా ఈ ఆడియోని గత ఆదివారం టాలీవుడ్ యంగ్ హీరోల చేతుల మీదుగా విడుదల చేసారు. కేథరిన్, లక్కీ శర్మ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి సాయి కార్తీక్ సంగీతం అందించగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి, అనంత శ్రీ రామ్ సాహిత్యాన్ని అందించారు. ఎల్లో ఫ్లవర్స్ బ్యానర్ పై రమేష్ పుప్పాల ఈ సినిమాని నిర్మించాడు. కృష్ణవంశీ తన ప్రతి సినిమాలోనూ మంచి మ్యూజిక్ ని రాబట్టుకుంటాడు. ఈ సినిమా ఆడియో ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

పాట : గోవిందా గోవిందా

గాయనీ గాయకులు : టిప్పు, బేబీ తిల్లు

సాహిత్యం : అనంత శ్రీ రామ్


‘గోవిందా గోవిందా’ అనే పాట చాలా పెప్పీగా సాగుతుంది, ఎక్కువ భాగం సినిమాలో ఈ సాంగ్ ని నాని ఇంట్రడక్షన్ కోసం ఉపయోగించవచ్చు. సాయి కార్తీక్ మ్యూజిక్ లో వెస్ట్రన్ ఫీల్ ఉంది, అలాగే ఈ పాట వింటుంటే మీరు కాలు కదల్చకుండా ఉండలేరు. టిప్పు పాటని చాలా బాగా పాడాడు. అనంత శ్రీ రామ్ సాహిత్యం చాలా నీట్ గా, హీరో పాత్రని తెలియజేసేలా ఉంది. మొత్తంగా వినడానికి బాగుండే పాట.

పాట : మయ్య మయ్య

గాయకుడు : విజయ్ ప్రకాష్

సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి

‘మయ్య మయ్య’ పాట విజయ్ ప్రకాష్ వాయిస్ తో సోలోగా సాగే రొమాంటిక్ ట్రాక్. ఈ పాటకి సీతారామ శాస్త్రి గారు సాహిత్యం అందించారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సిరివెన్నెల గారు తన నార్మల్ స్టైల్ ని మార్చి కొంచెం వైవిధ్యంగా ఈ పాటని రాశారు. సాయి కార్తీక్ మ్యూజిక్ భారతీయ, వెస్ట్రన్ బాణీలను కలిపినట్టుగా ఉంది. మొత్తంగా పాట చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఈ పాటని కృష్ణ వంశీ సూపర్బ్ విజువల్స్ తో షూట్ చేసి ఉంటారని ఆశించవచ్చు.

పాట : నీతో ఏదో

గాయనీ గాయకులు : శ్వేతా మోహన్, సాయి కార్తీక్

సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి

చాలా సాఫీగా సాగిపోయే ఈ మెలోడియస్ పాటకి శ్వేతా మోహన్ తన వాయితో ప్రాణం పోసింది. ‘నీతో ఏదో’ చాలా హాయిగా, కాస్త రోటీన్ మ్యూజిక్ తో సాగే తెలుగు ఫిల్మ్ రొమాంటిక్ డ్యూయెట్. ఈ పాటలో సౌండ్ ట్రాక్ ని సింథసైజర్ సౌండ్స్, పెర్క్యూషణ్ వాయిద్యాల సౌండ్ డామినేట్ చేస్తుంది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం బాగుంది. మొత్తంగా ఈ పాట వినసొంపుగా ఉంది. ఈ పాటలో కృష్ణ వంశీ ట్రేడ్ మార్క్ విజువల్స్ ఉంటాయని ఆశించవచ్చు.

పాట : పైసా పైసా

గాయకులు : రంజిత్, రాహుల్ నంబియార్, కార్తీక్ కుమార్

సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి

పండితులు వేద మంత్రాలు ఉచ్చారణ చేసే స్టైల్లో ఈ పాట ‘పైసా’ అంటూ ఆసక్తికరంగా మొదలవుతుంది. రంజిత్, రాహుల్ నంబియార్, కార్తీక్ కుమార్ వాయిస్ విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకొని చాలా బాగా పాడారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం చాలా బాగుంది. సాయి కార్తీక్ మ్యూజిక్ డీసెంట్ గా ఉంది. ముఖ్యంగా ఈ పాట కోసం ఎలక్ట్రిక్ గిటార్ ని చాలా బాగా ఉపయోగించాడు. ఈ పాట సినిమాలో చాలా కీలకమైన సందర్భంలో వస్తుందని ఆశించవచ్చు.

పాట : ఎప్పుడైతే పుట్టిందో

గాయకులు : కృష్ణ వంశీ, విట్టల్, వేణు, ధన్ రాజ్, రాగుబోతు రమేష్, చంద్ర

సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి

బాగా మోటుగా ఉండే ఈ పాటని కృష్ణ వంశీ, విట్టల్, వేణు, ధన్ రాజ్, రాగుబోతు రమేష్, చంద్రలు పాడారు. సాహిత్యానికి, పాత పాడిన వారి వాయిస్ కి తగ్గట్టుగా సాయి కార్తీక్ మ్యూజిక్ ఉంది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి లిరిక్స్ ఓకే అనేలా ఉన్నాయి. ఈ పాట వినడానికి అంత హాయిగా లేకుండా ఎక్కువ సౌండ్స్ తో కాస్త లౌడ్ గా ఉంటుంది. చెప్పాలంటే ఈ ఆల్బం లో కాస్త వీక్ సాంగ్ ఇదే. అలాగే ఇది చాలా చిన్న సాంగ్.

పాట : పైసా (థీమ్)

గాయకుడు : సాయి కార్తీక్

సాహిత్యం :

మ్యూజిక్ ఆల్బం లోని చివరి పాటతో సాయి కార్తీక్ చాలా వరకూ కాపాడాడు. ‘పైసా’ థీం సాంగ్ చాలా ఎంటర్టైనింగ్ గా సాగుతూ మనకు 1980, 90 ల నాటి సౌండ్ ట్రాక్స్ ని గుర్తుకు తెస్తుంది. గిటార్, పెర్క్యూషణ్ వాయిద్యాలను ఎంతో ఎఫెక్టివ్ గా ఉపయోగించాడు. ఓవరాల్ గా సాంగ్ సూపర్బ్.!

తీర్పు :

‘పైసా’ ఆడియో డీసెంట్ మ్యూజిక్ ఆల్బం. ఈ సినిమాలోని ‘పైసా థీం’ సాంగ్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది, మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్ సూపర్బ్ గా కంపోజ్ చేసాడు. మిగిలిన పాటల్లో ‘గోవిందా గోవిందా’, నెతో ఏదో’, ‘మయ్య మయ్య’ పాటలు బాగున్నాయి. సాయి కార్తీక్ ఎంతో సేఫ్ గా కాస్త రొటీన్ మ్యూజిక్ తో ఎంతో హాయిగా సాగే ఆల్బం ఇచ్చాడు. మామూలుగా కృష్ణ వంశీ సినిమాలో పాటలు విజువల్ గా చాలా బాగుంటాయి, ఈ సినిమాలో కూడా అదే మేజిక్ ని రిపీట్ చేస్తారేమో చూడాలి.

రివ్యూ : మహేష్ ఎస్ కోనేరు

అనువాదం – రాఘవ

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం :

X
More