సమీక్ష : “పెద్దన్న” – ఒక్క రజినీ వీరాభిమానులకు మాత్రమే

సమీక్ష : “పెద్దన్న” – ఒక్క రజినీ వీరాభిమానులకు మాత్రమే

Published on Nov 5, 2021 3:03 AM IST
Peddanna Movie Review

విడుదల తేదీ : నవంబర్ 4, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: రజినీకాంత్, కీర్తి సురేష్, నయన తార, కుష్బూ, మీనా, ప్రకాష్ రాజ్, జగపతి బాబు

దర్శకుడు: శివ
నిర్మాత: కళానిది మారన్

సినిమాటోగ్రఫీ:  వెట్రి
సంగీత దర్శకుడు: డి ఇమ్మాన్
ఎడిటర్: రూబెన్


తమిళ్ తలైవర్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “పెద్దన్న”. కోలీవుడ్ స్టార్ దర్శకుడు శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈరోజు దీపావళి కానుకగా తెలుగు మరియు తమిళ్ లో ఏకకాలంలో రిలీజ్ అయ్యింది. మరి ఈ చిత్రం ఎంతమేర ఆకట్టుకుందో సమీక్ష లో తెలుసుకుందాం రండి.

కథ :

ఇక కథలోకి వెళ్లినట్టైతే వీరన్న(రజినీకాంత్) కి తన చెల్లెలు కనకం(కీర్తి సురేష్) అంటే ఎంతో ఇష్టం. ఆమె కోసం వీరన్న ఎంత దూరమైనా ఎంత సాహసం చెయ్యడానికి అయినా కూడా వెనకాడడు. మరి అలాంటి చెల్లెలికి ఎంతో ఘనంగా వివాహం చేద్దాం అని సమయంలో కనకం మిస్సవుతుంది. ఒక వారం రోజులు తర్వాత ఆమె కోల్ కతా లో ఉందని వీరన్న తెలుసుకుంటాడు. మరి అంతలా ప్రేమించిన తన చెల్లెలు ఎందుకు మిస్సవుతుంది? కోల్ కతా లో ఎవరున్నారు? వీరన్న తన చెల్లెలిని కాపాడుకుంటాడా లేదా అసలు ఈ వీరన్న ఎవరు అనే అంశాలు తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండితెరపై చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఆటోమాటిక్ గా చెప్పొచ్చు ఈ సినిమాలో మొట్టమొదటి మెయిన్ హైలైట్ రజినీకాంత్ అని. స్క్రీన్ పై రజినీ కనిపించే అంత సేపు కూడా సినిమా ఎనర్జిటిక్ గా అనిపిస్తుంది. తనదైన శైలి స్టైల్, పంచ్ డైలాగ్స్, ఎనర్జీ అంతా రజినీ ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇస్తాయి. అలాగే ఈ ఏజ్ లో కూడా తాను చేసిన డాన్స్ మూమెంట్స్ కానీ యాక్షన్ సీక్వెన్స్ లు కానీ తనలోని డెడికేటెడ్ నటుడిని చూపిస్తాయి.

అలాగే సినిమాలో కీలక పాత్రలో నటించిన కీర్తి సురేష్ మంచి నటన కనబరిచింది. రజినీ కి చెల్లెలిగా అల్లరి చేస్తూ తన రోల్ లో అన్ని ఎమోషన్స్ కి న్యాయం చేసింది. అలానే హీరోయిన్ నయనతార రజిని జోడిగా ఆల్రెడీ హిట్ కాంబో వీరి మధ్య మ్యాజిక్ ఈ సినిమాలో కూడా పరిధి మేర కనిపిస్తుంది. అలానే తన వరకు తన గ్లామ్ నటనతో కూడా నయన్ రాణించింది. ఇంకా జగపతిబాబు పాత్ర కూడా సినిమాలో విలన్ గా ఆకట్టుకుంటుంది. ఖుష్బూ సహా మీనా లు తదితరులు తమ పాత్రల మేరకు ఆకట్టుకున్నారు.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ కాస్త గట్టిగానే కనిపిస్తాయి. స్క్రీన్ పై ఎంత రజినీ కనిపించి మ్యాజిక్ చేసినా కంటెంట్ లో బలం లేకపోతే దాన్ని తాను కూడా సేవ్ చేయలేరని ముందు కూడా ప్రూవ్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా పరిస్థితి కూడా అదే అని చెప్పొచ్చు. దర్శకుడు వింటేజ్ రజినీ వింటేజ్ రజినీ అంటే ఆడియెన్స్ ఏదో అనుకున్నారు కానీ కంప్లీట్ ఓల్డ్ ఫార్మాట్ నే శివ దింపేసాడు.

పోనీ కథలో కొత్తదనం లేదు అనుకుంటే కథనంలో కూడా ఎక్కడా కొత్తదనం కనిపించదు. సినిమా అంతా దాదాపు నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ఆడియెన్స్ కి ఇట్టే అర్ధం అయ్యిపోతుంది. ఈ విషయం లో మాత్రం శివ బాగా డిజప్పాయింట్ చేశారు. అలాగే ఎమోషన్స్ పరంగా కూడా బ్లైండ్ తప్పులు లాజిక్స్ మిస్సవ్వడం కూడా గట్టిగానే ఉంటాయి.

ఇంకా సినిమాలో విలన్స్ అనవసర సన్నివేశాలు ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తాయి అలానే హీరోయిన్ రోల్ కూడా ఏదో మొక్కుబడిగా ఉండాలి అన్నట్టు ఉంటుంది తప్పితే సినిమాలో అంత ఎఫెక్టివ్ గా ఎక్కడా అనిపించదు. ఇంకా రొటీన్ పాత నరేషన్ వల్ల ఆడియెన్స్ కి ఎక్కడా కూడా థ్రిల్ అయ్యే అనుభూతులు కూడా పెద్దగా గుర్తుండవు.

సాంకేతిక వర్గం :

ఈ చిత్రంలో సన్ పిక్చర్స్ వారి హై లెవెల్ ప్రొడక్షన్ వాల్యూస్ కనిపిస్తాయి. ప్రతి ఫ్రేమ్ కూడా అందంగా నాచురల్ గా వారు తీర్చి దిద్దారు. అలాగే డి ఇమాన్ సంగీతం బాగుంది. పాటలు అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాలో ఆకట్టుకుంటాయి. ఇంకా సినిమాటోగ్రఫీ పర్వాలేదు అని చెప్పొచ్చు. అలాగే టెక్నీకల్ యూనిట్ లో పలు సీన్స్ బెటర్ వి ఎఫ్ ఎక్స్ పెట్టి ఉండాల్సింది. పలు సన్నివేశాల్లో అవి క్లియర్ గా తెలిసిపోతున్నాయి.

ఇక దర్శకుడు శివ వర్క్ విషయం కి వస్తే ముందు చెప్పినట్టు గానే తన గత సినిమాలతో పోలిస్తే పెద్దన్న విషయంలో మాత్రం బాగా డిజప్పాయింట్ చేస్తాడు. పరమ రొటీన్ కథ, కథనాలతో ఎక్కడా కూడా కొత్తదనం కోరుకునే ఆడియెన్స్ ని ఆకట్టుకోలేకపోయాడు. రజినీ కి వేరే మంచి కథ చేసి ఉంటే బాగుండేదెమో కానీ ఈ పెద్దన్న సినిమాతో శివ వర్క్ బాగా డిజప్పాయింట్ చేస్తుంది.

తీర్పు :

ఇక మొత్తంగా చూసుకున్నట్టు అయితే ఈ “పెద్దన్న” రజినీ వీరాభిమానులను బాగానే ఆకట్టుకోవచ్చు కానీ సినిమాలో కథా, కథనాలు పరంగా ఎలాంటి కొత్తదనం దర్శకుడు తీసుకోకపోవడం మూలాన బాగా దెబ్బ తీస్తుంది. కనీస కొత్త ఎలిమెంట్స్ లేకపోవడం కామన్ ఆడియెన్ ని బాగా డిజప్పాయింట్ చేస్తుంది. జస్ట్ ఒక్క రజినీకాంత్ కోసమే మిగతా సినిమా ఎలా ఉన్నా పర్లేదు అనుకున్న వారు మాత్రమే అయితే ఈ సినిమా చూడొచ్చు. మొత్తంగా అయితే పెద్దన్న అంచనాలకు తగ్గట్టుగా ఆకట్టుకోడు.
123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Version

సంబంధిత సమాచారం

తాజా వార్తలు