సమీక్ష : సల్మాన్ “రాధే” – జీ ప్లెక్స్ లో ప్రసారం

Published on May 14, 2021 2:59 am IST
Salman Khan's Radhe movie review

విడుదల తేదీ : మే 13,2021

123telugu.com Rating : 2.5/5

నటీనటులు : సల్మాన్ ఖాన్, దిశా పటాని, రణదీప్ హుదా, జాకీ ష్రాఫ్

దర్శకత్వం : ప్రభుదేవా

నిర్మాత‌లు : సల్మాన్ ఖాన్, అతుల్ అగ్నిహోత్రి, సోహైల్ ఖాన్, నిఖిల్ నమిత్

సంగీతం : హిమేష్ రేషమియా, సాజిద్-వాజిద్, సంచిత్ బల్హారా, దేవి శ్రీ ప్రసాద్

సినిమాటోగ్రఫీ: అయనంక బోస్

ఎడిటింగ్ : రితేష్ సోని

ప్రతి ఏటా ఈద్ కానుకగా తన సినిమాలను విడుదల చేసే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈసారి కూడా తన సరికొత్త చిత్రం “రాధే” తో ముందుకొచ్చాడు. కాకపోతే ఇప్పుడు పరిస్థితులు బాగోక డైరెక్ట్ జీ ప్లెక్స్ లో డిజిటల్ రిలీజ్ తో వచ్చిన ఈ చిత్రాన్ని ప్రభుదేవా దర్శకత్వం వహించారు. మరి ఈ చిత్రం ఎంత మేర ప్రేక్షకులను ఆకట్టుకుందో సమీక్షలో తెలుసుకుందాం రండి.

కథ :

ఇక కథలోకి వెళ్లినట్టయతే ముంబై నగరంలో ఉన్న యువత అంతా డ్రగ్స్ కి బానిసలైపోతారు అలాగే మరో పక్క అక్కడ క్రైమ్ కూడా ఎక్కువగా పెరిగిపోతుంది. మరి దీనిని అంతా రాణా(రణదీప్ హుదా) నడిపిస్తుంటాడు. కానీ అప్పటికి ఉన్న ముంబై పోలీసులు ఆ క్రైమ్ రేట్ ను అడ్డుకోడంలో కానీ రాణా ను కానీ పట్టుకోడంలో విఫలం అవుతారు. దీనితో ఈ కేసులు ఎలా అయినా ఛేదించాలని ఓ సస్పెండెడ్ పోలీస్ రాధే(సల్మాన్ ఖాన్) ని బరిలోకి దించుతారు. మరి అలా వచ్చిన రాధే, రాణా ను పట్టుకుంటాడా? అతనికి ఏదన్నా బ్యాక్ స్టోరీ ఉందా అన్నది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఈచిత్రంలో మొదటగా మాట్లాడుకోవాల్సింది సల్మాన్ వన్ మ్యాన్ షో కోసమే అని చెప్పాలి. తన ఎంట్రీ నుంచి సల్మాన్ తన అభిమానులను అయితే ఎక్కడా డిజప్పాయింట్ చెయ్యడు. తనదైన యాక్షన్ మరియు కామెడీ తో మంచి ఫీస్ట్ ఇస్తాడు. అలాగే మంచి మాస్ సీన్స్ లో తన నటన మళ్ళీ తన సిక్స్ ప్యాక్ సీన్స్ కూడా ఈ చిత్రంలో మంచి హైలైట్ గా నిలుస్తాయి.

ఇక హీరోయిన్ దిశా పటాని విషయానికి వస్తే దిశా మరోసారి తనలోని గ్లామర్ డోస్ ను ఫుల్ గా చూపించి ఆకట్టుకుంది. అలాగే తనకున్న పాత్ర మేరకు మంచి ఎంటర్టైన్మెంట్ ను కూడా అందించి ఆకట్టుకుంటుంది. వీటితో పాటుగా సల్మాన్ తో కొన్ని సీన్స్ మంచి కెమిస్ట్రీ మరియు కామెడీ కూడా బాగా పండించింది. సాంగ్స్ లో అయితే మంచి ఎనర్జిటిక్ గా కనిపించింది.

ఇక అలాగే ఈ చిత్రంలో మెయిన్ విలన్ గా కనిపించిన రణదీప్ హుదా సల్మాన్ లాంటి స్ట్రాంగ్ పర్సనాలిటికి గట్టి పోటీ ఇచ్చాడని చెప్పాలి. సాలిడ్ లుక్స్ తో కనిపించి తనలోని విలనిజాన్ని గా కనబరిచాడు. అలాగే చిన్న పాత్రలో కనిపించినా యంగ్ బ్యూటీ మేఘా ఆకాష్ తన పాత్ర పరిధి మేరకు ఆకట్టుకుంటుంది. అలాగే స్క్రీన్ పై డి ఎస్ పి కంపోజ్ చేసిన సీటీ మార్ హిందీ వెర్షన్ సహా పలు కీలక యాక్షన్ సీన్స్ సల్మాన్ మార్క్ తో ఆకట్టుకుంటాయి.

మైనస్ పాయింట్స్ :

ఇక ఈ చిత్రంలో మైనస్ పాయింట్స్ కి వస్తే వాటి డోస్ కాస్త ఎక్కువే ఉంటుందని చెప్పాలి. సల్మాన్ గత చిత్రాలు అంటే కొన్ని ఎంటర్టైన్మెంట్స్ బేస్డ్ సినిమాలు లిస్ట్ లోనే ఇది కూడా ఉంటుంది. సిల్లీ లాజిక్స్ అండ్ నరేషన్ కనిపిస్తుంది. అవి కాస్త జస్ట్ ఫన్ ని జెనరేట్ చెయ్యడానికి అయినా నార్మల్ ఆడియెన్స్ కి అయితే అసలు రుచించక పోవచ్చు.

మరి ఇది పక్కన పెడితే ఈ చిత్రంలో స్టోరీ లైన్ కూడా పరమ రొటీన్ గా అనిపిస్తుంది. అక్రమాలు చేసే విలన్ ని పట్టుకునే హీరో అనేది చాలానే చూసేసాం సో రెగ్యులర్ ఆడియెన్స్ కి ఈ చిత్రం పెద్దగా ఎక్కదు. అలాగే కొన్ని ఎమోషన్స్ మిస్ ఫైర్ అయ్యినట్టు అనిపిస్తుంది. క్లైమాక్స్ లో హెలికాఫ్టర్ ఫైట్ సహా మరికొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ సిల్లీగా ఒకింత ఓవర్ గా అనిపిస్తాయి. అలాగే కొన్ని పాత్రలకు అనవసరమైన స్కోప్ ఉన్నట్టు అనిపిస్తుంది.

సాంకేతిక వర్గం :

మామూలుగానే బాలీవుడ్ సినిమాలు అంటే మంచి గ్రాండియర్ గా ఉంటాయి. మరి ఆ గ్రాండియర్ కి తగ్గట్టుగా సల్మాన్ రాధే కూడా ఉంటుంది. మంచి నిర్మాణ విలువలు ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తాయి. అలాగే సాంగ్స్ లో మంచి విజువల్స్ కానీ కెమెరా వర్క్ కానీ కూడా బాగుంటుంది. కాకపోతే ఎడిటింగ్ లో సినిమా ఒక 15 నిముషాలు అలా తగ్గించాల్సింది.

ఇక దర్శకుడు ప్రభుదేవా విషయానికి వస్తే తాను జస్ట్ సల్మాన్ ఫ్యాన్స్ ని ఆకట్టుకోగలిగాడు తప్పితే అన్ని వర్గాల వారిని ఆకట్టుకోడంలో విఫలం అయ్యారని చెప్పాలి. ఓవరాల్ గా సినిమా చూసాక అదే అనిపిస్తుంది. ఎంత సేపు సల్మాన్ మాస్ రోల్ నే ఎలివేట్ చేసారు తప్పితే కథ పరంగా కానీ కథనం పరంగా కానీ ఏం కొత్తదనం కనిపించదు. ఈ విషయాల్లో ప్రభుదేవా తన మార్క్ ఎంటర్టైన్మెంట్ ను మిస్ చేశారు.

తీర్పు :

ఇక మొత్తంగా చూసుకున్నట్టయతే డైరెక్ట్ ఓటిటిలో విడుదల కాబడిన సల్మాన్ “రాధే” సల్మాన్ ఫ్యాన్స్ కు మంచి ఫీస్ట్ ఇస్తుంది. తన మార్క్ స్ట్రాంగ్ పెర్ఫామెన్స్ మరియు యాక్షన్, ఎంటర్టైన్మెంట్స్ తో సల్మాన్ వారిని ఆకట్టుకుంటాడు. దిశా సహా ఇతర కీలక నటులు కూడా మంచి నటనను ఇచ్చారు కానీ అన్ని వర్గాల ఆడియెన్స్ ను మాత్రం ఈ చిత్రం మెప్పించడంలో విఫలం అయ్యింది. రొటీన్ కథా కథనాలు అక్కడక్కడా బోరింగ్ స్క్రీన్ ప్లే వంటివి సల్మాన్ అభిమానులకు బాగానే అనిపిస్తాయి కానీ రెగ్యులర్ ఆడియెన్స్ ని ఆకట్టుకోవు. సో మీరు సల్మాన్ అభిమాని అయితే తప్ప చూడకపోడమే బెటర్.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :