సమీక్ష : అంచనాలను మించిన “రాజన్న”

సమీక్ష : అంచనాలను మించిన “రాజన్న”

Published on Dec 22, 2011 2:40 PM IST
విడుదల తేది :22 డిశంబర్ 2011
దర్శకుడు : విజయేంద్ర ప్రసాద్
నిర్మాత : నాగార్జున అక్కినేని
సంగిత డైరెక్టర్ : ఎం.ఎం. కీరవాణి
తారాగణం : నాగార్జున అక్కినేని, స్నేహ, ఏనీ, శ్వేతా మీనన్ మరియు ఇతరులు

కింగ్ నాగార్జున నటించిన యదార్థ గాధ “రాజన్న” రేపు తెర మీదకి రాబోతున్నది. ఈరోజు ప్రసాద్ లాబ్స్ లో ప్రత్యేక ప్రదర్శన జరిగింది. ఈ చిత్రానికి ప్రఖ్యాత కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించగా కీరవాణి గారు సంగీతం సమకూర్చారు. ఈ చిత్రానికి పోరాట సన్నివేశాల పర్యవేక్షణ రాజమౌళి గారు చేసారు. ఈ చిత్రం ఎలా ఉందొ చూద్దాం.

కథ :

ఇంతకముందే నాగార్జున గారు ఈ కథని చెప్పటం వల్ల ఎక్కువ లోతుగా వెళ్ళట్లేదు. కాని కొత్త వారి కోసం కొంచెం పరిచయం .1950 ల కాలం లో ఆదిలాబాద్ జిల్లా నేలకొండపల్లి అనే గ్రామం లో జరిగిన కథ . ఈ చిత్ర కథా నేపథ్యం తండ్రికూతుళ్ళు అయిన రాజన్న(నాగార్జున) మరియు మల్లమ్మ(అన్నీ) లు మంచి వాళ్ళ కోసం చేసే పోరాటం చుట్టూ తిరుగుతుంది. మల్లమ్మ (అన్నీ) చిన్నప్పుడే తన తల్లి తండ్రులని(నాగార్జున & స్నేహ) కోల్పోతుంది. అదే గ్రామం లో ఒక ముసలాయన దగ్గర పెరుగుతూ ఉంటుంది. తనకు ప్రకృతి ఇచ్చిన వరం పాడటం తన పాటతో ఊరందరి మెప్పు పొందుతుంది. ఆ ఊరి దొరసాని(శ్వేతా మీనన్ ) కి మల్లమ్మ పాడటం నచ్చదు మళ్లీ తన పాట వినపడకూడదు అని హుకుం జారి చేస్తుంది. బయపడిపోయిన మల్లమ్మ పండిట్ జవర్హలాల్ నెహ్రు కి త ఊరి సమస్యలని చెప్పుకోటానికి బయలుదేరుతుంది.

కాని ఢిల్లీ లో కూడా దొరసాని మనుషుల వల్ల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటుంది. తన ఆశలు వదిలేసుకున్నాక , తన సంగీత గురువు (నాజర్ ) మల్లమ్మ తండ్రి రాజన్న కథ చెప్పుతాడు.అది విన్న మల్లమ్మ ఏం చేసింది? నెహ్రు గారిని కలిసిందా లేదా ? అనేదే కథా సారాంశం.

నటన:

మొదటగా మనం చెప్పుకోవాల్సింది మల్లమ్మ పాత్రలో నటించిన అన్నీ గురించి. తన నటన అద్బుతం , తన నటన వర్ణనాతీతం తన నటన గురించి చెప్పటానికి మాటలు సరిపోవుటలేదు. ఈ పాత్రకి అన్నీకి ఖచ్చితంగా అవార్డు వస్తుంది అనిపిస్తుంది.తరువాత చెప్పుకోవాల్సింది నాగార్జున గారి గురించి ఇలాంటి చిత్రం కథానుగుణంగా నడిపించటానికి చాలా ధైర్యం కావాలి కథ మీద నమ్మకంతో ఈ ప్రయోగం చేసిన నాగార్జున గారికి అభినందనలు.

మల్లమ్మ పాత్ర చేసిన అన్నీ అద్బుతం గా చేసింది. ముందే చెప్పినట్టు గా తన నటన వర్ణనాతీతం. తన నటనలో చాలా పరిపఖ్వత కనిపించింది. మల్లమ్మ పాత్ర లో హావభావాల ని అద్బుతం గా పలికించింది. తన పాత్ర జనానికి చేరువయ్యేలా చేసింది. మల్లమ్మ ఒక్కొక సమస్యని దాటుతూ వుంటే జనం పాత్ర లో లీనమయిపోతారు.

నాగార్జున రాజన్న పాత్రలో బాగా ఇమిడిపోయారు అయన ఆహార్యం ఆ పాత్ర కి అద్బుతం గా ఉంది . పోరాట సన్నివేశాలలో సంభాషణలను అద్బుతం గా పలికారు. స్నేహ, రాజన్న భార్య లచ్చమ్మ పాత్రలో పరిధి మేరకు బాగానే నటించింది.

శ్వేతా మీనన్ దొరసాని పాత్రలో ప్రతినాయిక పాత్ర పోషిచింది. నాజర్ మరియు గాంధీ వాళ్ళ పాత్ర మేరకు నటించారు. దిలావర్ ఖాన్ పాత్రలో సత్య నాగ్ బాగా నటించాడు. ముఖేష్ ఋషి ప్రతినాయకుడి పాత్రలో బాగా చేసారు. హేమ మరియు తెలంగాణ శకుంతల వారి పాత్ర మేరకు బాగా నటించారు. అజయ్,సుప్రీత్,శ్రావణ్ మరియు ప్రదీప్ రావత్ రాజన్న స్నేహితులుగా బాగా నటించారు.

ప్లస్ :

ఈ కథ నేపథ్యాన్ని అద్బుతంగా వీక్షకులు కథలో లీనమయిపోయెల చెప్పారు. “వేయరా వేయ్” పాట అద్బుతంగా చిత్రీకరించారు వీక్షకుల భావాలని హత్తుకునేల వుంది. ఈ పాటని నేలకొండపల్లి ప్రజలలో చైతన్యం తీసుకురాటానికి పాడుతారు ఈ పాట చివరకి వచ్చెసరికి వీక్షకుల భావాలు కూడా అలానే ఉంటుంది.

ధియేటర్ నుండి బయటకి వచ్చాక కూడా కొన్ని సన్నివేశాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఆడవాళ్ళ అందాలకి పన్ను వేసే సన్నివేశం లో నాగార్జున గారి హావభావాలు, దొరసాని దగ్గర పని చేస్తున్న అబ్బాయి తిరుగుబాటు సన్నివేశం మరియు పతాక సన్నివేశాలు అద్బుతంగా ఉన్నాయి.

కీరవాణి గారి సంగీతం చిత్రా నేపధ్యానికి జీవం పోసింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే తారా స్థాయి లో ఉంది. పాటలు పాత్ర మరియు కథ నేపథ్యాన్ని అద్బుతంగా వ్యక్తపరిచాయి. “అమ్మ అవని” పాట చిత్రం లో కీలక సన్నివేశాలను ఎత్తి చూపేల ఉంది. కథ మరియు దర్సకత్వం లో విజయేంద్ర ప్రసాద్ గారు సఫలం అయ్యారు.రాజమౌళి గారి పోరాట సన్నివేశాలు చిత్రానికి బలం చేకూర్చాయి.

మైనస్ :

నాగార్జున గారి పరిచయ సన్నివేశాలు ఇంకొంచెం బాగా తీసి వుంటే బాగుండేది. గ్రాఫిక్స్ బాగోలేవు, కొన్న చారిత్రక విషయలను చిత్రానికి అనుగుణంగా మార్చుకున్నారు. పతాక సన్నివేశం తరువాత రాజన్న ఏమయ్యాడు అనే విషయాన్నీ సరిగ్గా చూపించలేదు. చిత్రం కొన్ని చోట్ల నెమ్మదిగా సాగుతుంది.

సాంకేతిక విభాగం :

శ్యాం.కే.నాయుడు మరియు అనిల్ బండారి ల సినిమాటోగ్రఫీ కనువిందు చేస్తుంది, దృశ్యాలు చాల బాగా వచ్చాయి .కోటగిరి వెంకటేశ్వర రావు గారి ఎడిటింగ్ చాలా బాగుంది. రవీందర్ చేసిన ఆర్ట్ వర్క్ నిజమనిపించేల వుంది.

తీర్పు :

నేలకొండపల్లి ప్రజల కష్టాల నడుమ జరిగే ఒక పోరాటం “రాజన్న ” చిత్రం. బేబీ అన్నీ మరియు నాగార్జున ల నటన అద్బుతం. కీరవాణి గారి సంగీతం మరియు రాజమౌళి గారి పోరాట సన్నివేశాల చిత్రీకరణ ఈ చిత్రానికి మరింత బలం చేకూర్చాయి . ఈ చిత్రం లో మనస్సుని హత్తుకునేల చాలా సన్నివేశాలు వున్నాయి . ఇలాంటి కథా నేపథ్యాన్ని ఎంచుకొని ధైర్యం గా చిత్రీకరించిన నాగార్జున గారికి అభినందనలు తెలపాలి. ఈ చిత్రం తప్పకుండా చూడాల్సిన చిత్రం .

మహేష్ కె.ఎస్

అనువాదం – రv

123తెలుగు.కాం రేటింగ్:

రాజన్న చిత్రానికి మేము అఫీషియల్ మీడియా పార్టనర్ గా ఉన్నాము. మేము ప్రమోట్ చేసిన చిత్రానికి రేటింగ్ ఇవ్వడం సబబు కాదు. అందువల్ల ఈ చిత్రానికి మేము రేటింగ్ ఇవ్వడం లేదు. రాజన్న చిత్రం చాల బావుంది చూసి ఎంజాయ్ చేయండి.

Rajanna Review English Version

సంబంధిత సమాచారం

తాజా వార్తలు