సమీక్ష : రాణిగారి బంగళా – దీని వైపుకు వెళ్లకుండా ఉంటే మంచిది !

'Rani Gari Bungalow review

విడుదల తేదీ : 29 జూలై, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

దర్శకత్వం : దివాకర్ రెడ్డి

నిర్మాత : వి. సినీ స్టూడియో

సంగీతం : ఈశ్వర్ పెరవలి

నటీనటులు : ఆనంద్, రష్మి గౌతమ్


ఈ నెలలో విడుదలవాల్సిన పెద్ద సినిమాలన్నీ ఒక్కసారిగా పోస్ట్ పోన్ అవడం వల్ల చిన్న సినిమాలన్నీ ఇదే తరుణమని తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వరుసగా విడుదలవుతున్నాయి. అలాంటి సినిమాల్లో ఈ ‘రాణిగారి బంగళా’ కూడా ఒకటి. ‘రేష్మి గౌతమ్’ ఇందులో ప్రధాన పాత్రలో నటించింది. ఈరోజే విడుదలైన ఈ చిత్రం రిజల్ట్ ఏమిటో ఒకసారి చూద్దాం..

కథ :

సూర్య (ఆనంద్ రంగ) అనే పి.హెచ్.డి స్టూడెంట్ ఈకాలంలో దెయ్యాలు ఉన్నాయా లేవా అనే టాపిక్మద రీసెర్చ్ చేస్తుంటాడు. ఆ టైంలోనే అతనికి స్వప్న(రేష్మి) అనే అందమైన అమ్మాయి పరిచయమవుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది.

అలా కాలం గడిచిపోతుండగా కొన్ని షాకింగ్ సంఘటనలు చోటు చేసుకుని సూర్యకు తాను ప్రేమిస్తున్న స్వప్న ఒక దెయ్యం అని తెలుస్తుంది. అప్పుడతను ఏం చేశాడు ? దెయ్యమైన స్వప్న అతన్ని ఎందుకు ప్రేమలోకి దించింది ? అసలు స్వప్న ఫ్లాష్ బ్యాక్ ఏమిటి ? అన్నదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకున్న ప్రధాన ప్లస్ పాయింట్స్ లో ముందుగా చెప్పుకోవలసింది నటి రేష్మి గురించి. సినిమా పట్ల ప్రేక్షకులు ఆకర్షింపబడటానికి ఆమె ప్రధాన కారణం. ఈ చిత్రంలో ఆమె తన పాత్ర పరిధి మేర బాగానే నటించి, మెప్పించింది. అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా పరవాలేదనిపించింది.

జబర్దస్త్ అప్పారావ్ తన కామెడీ పాత్రలో మంచి హాస్యాన్ని పండించాడు. అలాగే రఘుబాబు కూడా అక్కడక్కడా నవ్వించాడు. మొదటి భాగంతో పోల్చుకుంటే రెండవ భాగం కాస్త బాగుంది. దెయ్యం పాత్రలో రేష్మీని చూపించిన కొన్ని సన్నివేశాలు బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

నటీనటుల విభగాల్లో చూస్తే హీరో ఆనంద్ రంగ సినిమాకి మేజర్ మైనస్. అతని నటనలో పరిణితి లేదు. ఇంకా చాలా శిక్షణ తీసుకోవాల్సి ఉంది. ఒకరకంగా చెప్పాలంటే అతనికన్నా సినిమాలో ఉన్న మిగిలిన కామెడీ యాక్టర్లు సినిమాపై మంచి అభిప్రాయం కలిగించడానికి ప్రయత్నించారు.

హర్రర్ జానర్ లో వచ్చిన ఈ సినిమాలో భయపెట్టే అంశాలు అస్సలు లేవు. సినిమాకి ఒక ఫ్లో అనేది లేదు. కథ మధ్యలో వచ్చే అనవసరపు కామెడీ సన్నివేశాలు విసుగు తెప్పిస్తాయి. దర్శకుడు రేష్మి గ్లామర్ ను యూజ్ చేసుకోవడంలో పూర్తిగా ఫెయిలయ్యాడు. ఒకరకంగా చెప్పాలంటే రేష్మి ఈ సినిమాలో ఉన్నా లేనట్టే ఉంది.

సాంకేతిక విభాగం :

కెమెరా పనితనం అత్యంత సాధారణంగా ఉంది. ఎడిటింగ్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. నిర్మాణ విలువలు అస్సలు బాగోలేవు. సినిమాను చూస్తున్నంతసేపు ఎదో బి గ్రేడ్ సినిమాను చూస్తున్నట్లుంది. ఇకపోతే దర్శకుడు నటీనటుల నుండి తనకు కావాల్సిన అవుట్ ఫుట్ ను తీసుకోవడంలో విఫలమయ్యాడు. సినిమా తీయాదాయానికి మంచి పాయింట్ ఉన్నప్పటికీ దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం, నడిపిన తీరు అస్సలు బాగోలేవు.

తీర్పు :

మొత్తం మీద ఈ రాణిగారి బంగాళా సినిమా ఏమాత్రం ఉత్కంఠ లేని, ఒక సెన్స్ లెస్, సిల్లీ హర్రర్ సినిమా. ఒక్క గ్లామర్ ఫెమ్ ఉన్న రేష్మి గౌతమ్ తప్ప సినిమాలో చూడటానికి వేరే ఏమీ లేదు. ఈ సినిమాని చూడటం మీ సమయాన్ని వృధా చేసుకోవడమే. కాబట్టి ఈ రాణిగారి బంగాళా వైపుకు వెళ్లకుండా ఉంటే మంచిది.

123telugu.com Rating : 2/5

Reviewed by 123telugu Team

Click here for English Review