సమీక్ష 2 : జులాయి – 100% త్రివిక్రమ్ మార్క్ ఎంటర్టైనర్

విడుదల తేది : 9 ఆగష్టు 2012
123తెలుగు.కాం రేటింగ్: 3.25/5
దర్శకుడు : త్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాతలు : ఎస్. రాధాకృష్ణ
సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్
నటీనటులు : అల్లు అర్జున్, ఇలియానా, రాజేంద్రప్రసాద్, సోనూ సూద్

‘జులాయి’ సినిమా అసలు సిసలయిన త్రివిక్రమ్ శైలి చిత్రం. ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తనదయిన శైలి లో, ఎంతో తెలివైన అబ్బాయిగా ఆకట్టుకోగా ఇలియానాకి అంత ఆస్కారం లేకుండా పోయింది. ఇంకా కొంతమంది ప్రముఖ నటులు వీరికి తోడయ్యి కథను నడిపించారు. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు హాలీవుడ్ చిత్రాల నుండి ప్రేరణ పొందినవే అనుకోండి, ఇవన్నీ జులాయి చిత్రాన్ని కమర్షియల్ గా విజయం సాదించేలా చేస్తాయా?

కథ :

జులాయి చిత్రం రవీంద్ర నారాయణ్ (అల్లు అర్జున్) అనే యువకుడికి సంభందించింది. అనుకోని పరిస్థితుల్లో రవీంద్ర బిట్టు (సోను సూద్) ని కలుస్తాడు ఇద్దరు కలిసి బ్యాంకు దొంగతనం ప్లాన్ చేస్తారు. రవి వైజాగ్ లో తనకి తెలిసిన బెట్టింగ్ విశేషాలన్నీ బిట్టుకి చెప్తాడు. బిట్టు వాటిని సేకరించి వాటికి అనుగుణంగా పధకం వేస్తాడు. ఇవే విశేషాలు రవి పోలీసు లకి కూడా చెప్తాడు. బిట్టు దొంగతనంలో దాదాపుగా విజయం సాదించే సమయంలో రవి తెలివిగా అతను అరెస్ట్ అయ్యేలా చేస్తాడు. చివరికి దొంగతనం విఫలం అవుతుంది. డబ్బులు పోగొట్టుకున్న బిట్టు ప్రతి పనిలో రవి చే అడ్డగించబడతాడు. ప్రతీకారం కోరుకున్న బిట్టు నుండి రవి ఎలా తప్పించుకున్నాడు? గొప్ప మనసు గల పోలీసు ఆఫీసర్(రాజేంద్ర ప్రసాద్) నుండి రవి ఎలా సహాయం పొందాడు? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

వేదం చిత్రం నుండి అల్లు అర్జున్ లో ఒక కొత్తరకమయిన నటుడు కనిపిస్తున్నారు. తనను తాను తెర మీద అద్భుతంగా చూపించుకుంటున్నారు. కొన్ని సన్నివేశాలలో తన నటన మునుపటి కన్నా చాలా బాగా చేశారు. డాన్స్ విషయాల్లో ఎప్పటిలానే తన శైలిని నిరూపించుకున్నారు. సోను సూద్ నటనలో చాలా పరిపఖ్వత కనిపించింది. తనికెళ్ళ భరణి మరియు కోట శ్రీనివాస రావు వంటి నటులు తెర మీద కాసేపు మాత్రమే కనిపించినా వారి ప్రదర్శనతో చిత్రంలో మరింత ఆసక్తిని పెంపొందించారు. తన కొడుకుని సరైన మార్గంలో నడిపించడానికి ప్రయత్నించే తండ్రి పాత్రలో తనికెళ్ళ భరణి ప్రదర్శన చాలా బాగుంది ఈ క్రెడిట్ దర్శకునికే దక్కాలి, దర్శకుడి గురించి మరింత తరువాత మాట్లాడుకుందాం.

ఎప్పుడు దొంగతనాలు ప్లాన్ చేసినా విఫలం అయ్యే దొంగ పాత్రలో కనిపించిన బ్రహ్మానందం తన నటనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. ఆలీ ఒక్క డైలాగ్ లేకుండా నటించినా ఆయన నటించిన ఆ సన్నివేశంలో ఆయన ప్రదర్శన అద్భుతం అనే చెప్పుకోవాలి. రావు రమేష్, హేమ, ఎం.ఎస్ నారాయణ మరియు బ్రహ్మాజీ కూడా వారి స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిచారు. గన్ ఉపయోగించడం ఇష్టం లేని పోలీసు పాత్రలో కనిపించిన రాజేంద్ర ప్రసాద్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి అయన రెండు పార్శ్వాలున్న పాత్రను ఎంతో అద్భుతంగా చేశారు. ఇన్ని పాత్రల నడుమ ఇలియానా పాత్రకి పెద్దగా గుర్తింపు లేకుండా పోయింది. కానీ సినిమాలో ఉన్నంత వరకూ చాలా బాగా నటించింది.

మైనస్ పాయింట్స్ :

తెలుగు చిత్ర కథానాయకుడు అంటే ఎలా ఉంటాడు అన్నది అందరికి తెలిసిన విషయమే ఈ చిత్రంలో అంతకన్నా కాస్త ఎక్కువగానే చూపించారు. ఈ చిత్రంలో అతని ఆలోచనను దేవుడు తప్ప ఇంకవరూ కొత్తలేరనే లాగా ఉంటాయి. ఈ చిత్రంలో చూపించిన దొంగతనం సన్నివేశం “ది డార్క్ నైట్” సినిమా నుండి ప్రేరణ పొందింది. ఇంకా క్లైమాక్స్ లో వచ్చిన సన్నివేశాన్ని “ది ఇటాలియన్ జాబ్” చిత్రాన్ని చూసిన వారెవరయిన గుర్తుపట్టేస్తారు. ఈ చిత్రంలో మొదటి అర్ధ భాగం నవ్వులు పంచడమే కాకుండా ప్రేక్షకులని అలరిస్తుంది. రెండవ అర్ధ భాగంలో ఈ మేజిక్ మిస్ అయినట్టు అనిపిస్తుంది. కమర్షియల్ అంశాలను జోప్పించటానికి అయన కొన్ని సన్నివేశాలను జత చేశారు అవి అనవసరం అనిపిస్తాయి.

సాంకేతిక విభాగం :

త్రివిక్రమ్ శ్రీనివాస్ తన పంచ్ డైలాగులతో మరియు తన మార్క్ కామెడీతో మళ్ళీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. అలాగే చాలా ఆర్డినరీ ప్రజల జీవితంలో జరిగే సంఘటనల మీద అద్భుతమైన కామెడీని పండించారు. ఒక తండ్రి తన కొడుక్కి ఒక నాయకుడికి మరియు ఒక విలన్ కి మధ్య ఉండే తేడాని ఈ చిత్ర కథాంశం గా తీసుకున్నారు. నాయకుడు ఎప్పుడు మంచి నిర్ణయాలే తీసుకుంటాడు అదే ఒక విలన్ తన స్వార్ధం కోసం ఎలాంటి నిర్ణయాలైనా తీసుకుంటాడు అనే విషయానికి కాస్త సహజత్వాన్ని మరియు కాస్త ఫిలాసఫీ ని కలిపి చెప్పారు. కానీ ఇది అన్ని సినిమాలకు అవసరం ఉండదు కానీ జులాయి లాంటి కమర్షియల్ చిత్రానికి ఇలాంటి విషయాలు మరింత బలాన్ని ఇస్తాయి. ఈ చిత్రానికి త్రివిక్రమ్ హార్ట్ అఫ్ ది ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు.

సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడు కెమెరా పనితనం చాలా సహజంగా ఉంది. డిజిటల్ ఇంటర్మీడియట్ టెక్నాలజీ వల్ల సినిమా మొత్తం చాలా కలర్ ఫుల్ గా ఉంటుంది. ఈ చిత్రానికి ఆర్ట్ వర్క్ చాలా బాగుంది ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే పాటలకు చేసిన ఆర్ట్ వర్క్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. మామూలుగా తెలుగు సినిమాలు చిత్రీకరణ చేసే ప్రదేశాలనే మొదటి పాటను చిత్రీకరించినా సరికొత్తగా మరియు ఎంతో కలర్ ఫుల్ గా చూపించారు.

ఈ చిత్రం ఎడిటింగ్ ఇంకా బాగుంటే బాగుండేది. కానీ ప్రవిన్ పూడి కొన్ని సన్నివేశాలను ఎంతో బాగా ఎడిట్ చేశారు. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన పాటలు మరియు నేపధ్య సంగీతం అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ చిత్రంలోని ఫైట్స్ మరియు గ్రాఫికల్ విషయాలలో ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఎందుకంటే కొన్ని సన్నివేశాల్లో గ్రాఫిక్స్ చేసినది ఈజీగా మనకు తెలిసిపోతుంది.

తీర్పు :

జులాయి చిత్రం మొత్తం పూర్తి హాస్యాస్పదంగా ఉంటుంది. ఈ చిత్రం మీకు మంచి పాజిటివ్ నవ్వులను పంచుతుందని ఖచ్చితంగా చెప్పగలము.

123తెలుగు.కామ్ రేటింగ్: 3.25/5

అనువాదం : రాఘవ

Click Here For ‘Julayi’ English Review

సంబంధిత సమాచారం :