సమీక్ష: ‘బన్నీ n చెర్రీ’ – తికమకల తలనొప్పి

Bunny_n_Cherry విడుదల తేదీ : 14 డిసెంబర్ 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
దర్శకుడు : రాజేష్ పుల్లి
నిర్మాత : రజిత్ పార్థసారధి
సంగీతం : శ్రీ వసంత్
నటీనటులు : ప్రిన్స్, మహాత్ రాఘవేంద్ర

ప్రిన్స్ మరియు మహత్ టాలీవుడ్ లో హీరోలుగా ఇప్పుడిప్పుడే తమ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. వీరిద్ధరూ కలిసి నటించిన ‘బన్నీ n చెర్రీ’ సినిమా ద్వారా తమ అదృష్టాన్ని పరీక్షించుకొనున్నారు. రాజేశ్ పులి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృతి మరియు సాబా హీరోయిన్స్. ఈ రోజు విడుదలైన ఈ ‘బన్నీ n చెర్రీ’ సినిమా ఎలావుందో ఇప్పుడు చూద్దాం.

కధ:

బన్నీ(ప్రిన్స్) మరియు చెర్రీ(మహత్) తమతమ జీవితాలలో బిజీగా వున్న ఇద్ధరు యువకులు. బన్నీ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తే చెర్రీ పనీపాటా లేకుండా స్నేహితులతో కాలక్షేపం చేస్తుంటాడు. ఒకరోజు పార్టీనుండి వస్తూ అనుకోకుండా ఆదే దారిలో వస్తున్న చెర్రీ బైక్ ను బన్నీ కార్ తో ఢీకుంటాడు వారిద్ధరికి తలపై బలమైన గాయాలు తగలడంతో హాస్పటల్ లో జాయిన్ చేస్తారు. వారి జీవితాలను కాపాడడానికి చాలా కష్టపడుతున్న డాక్టర్లు చివరి ప్రయత్నంగా వీరి జ్ఞాపకాల మార్పిడి చేస్తారు. ఈ ఆపరేషన్ విజయవంతమైనా కొన్ని అనూహ్యమైన మార్పులు సంభవిస్తాయి. బన్నీ శరీరంలో చెర్రీ జ్ఞాపకాలు, చెర్రీ మనసులో బన్నీ జ్ఞాపకాలు చోటుచేసుకుంటాయి

వీటినుండి బయటపడి తమ తమ జీవితంలో మన హీరోలు ఎలా కొనసాగుతారు? తెలిసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

సినిమా కధ నమ్మశక్యంగా లేకపోయినా పాయింట్ కొత్తగా వుంది. మొదటి భాగంలో చివరి 15 నిముషాలు చాలా స్పీడ్ గా కధ సాగుతుంది. అంతేకాక మన హీరోలు ప్రిన్స్, మహత్ ఈ సినిమాలో తమతమ నటనతో ఆకట్టుకున్నారు . ఒకరి సమస్యలను మరొకరు పరిష్కరించుకొనేందుకు బన్నీ, చెర్రీ కలిసి పనిచేసే సన్నివేశాలు చాలా బాగున్నాయి

మైనస్ పాయింట్స్ :

ఇటువంటి కధాంశం ఎన్నుకున్న దర్శకుడు స్క్రిప్ట్ ను తనకు నచ్చినట్టు వాడుకునే వెలుసుబాటువుంది. ఒకరి జ్ఞాపకాలలో మరొకరు నివసిస్తున్న క్రమంలో తమ ప్రేమ కథను సుఖాంతం చేసుకునే పనిలో వున్న హీరోల నడుమ కావలిసినంత కామెడీ సృష్టించవచ్చు . కాకపోతే బాధాకరమైన విషయం ఏమిటంటే దర్శకుడు అటువంటి ప్రయోగాలు ఏమి చేయలేదు. కడుపుబ్బా నవ్వించే కామెడీగానీ, కన్నీళ్లు పెట్టుకునేంత భావోద్వేగాలుగానీ ఈ సినిమాలో లేవు

ఈ సినిమాలో హీరోయిన్స్ ఉన్నా లేనట్టే. సినిమాకు ఏమాత్రం ఉపయోగపడలేదు. లెక్కలేనన్ని ప్రాబ్లెమ్ లను సృష్టించి వాటికి సరైన పరిష్కారాలు చూపించకుండా మధ్యలోనే వదిలేశారు. బ్రహ్మానందంకు చాలా చెత్త పాత్ర ఇచ్చారు. సినిమాలో మొదటి గంటసేపు పాత్రలను పరిచయం చెయ్యడంకోసమే గడిచిపోతుంది. ఇవన్నీ కాక బన్నీ, చెర్రీలకు స్నేహితులుగా నటించిన వారు తమ నటనతో మన సహనాన్ని పరీక్షిస్తారు

సాంకేతిక విభాగం:

ఒక్క మనసా పాట తప్ప మిగిలిన పాటలకు సంగీతమంత మాట్లాడుకునే స్థాయిలో లేవు. కెమెరా పనితనం బాగుంది. పాటలను బాగా చిత్రీకరించారు. డైలాగులు పర్లేదు. ఎడిటింగ్ కూడా ఒకే

తను అనుకున్న ఒక్క పాయింట్ నే టచ్ చేయకుండా ప్రేమ, కుటుంబం, సెంటిమెంట్ అన్నిటిల్లో వేలు పెట్టాడు. అందువల్ల దేనికి న్యాయం చెయ్యలేకపోయాడు. స్క్రీన్ ప్లే లో చాలా తప్పులు చేశారు. కొన్ని సీన్ లు ఆ ప్రదేశాలలో ఎందుకు వస్తాయో అర్దంకాదు. ద్వితీయార్ధం చాలా సాదాగా సాగి చివరకు విసిగిస్తుంది

తీర్పు:

మొత్తానికి ఈ ‘బన్నీ n చెర్రీ’ సినిమా ఒక వెరైటీ కాన్సెప్ట్ తో మొదలుపెట్టినా తెరకెక్కించడంలో పూర్తిగా విఫలం అయ్యారు. సాగదీసిన సన్నివేశాలు, పసలేని నటీనటుల నటన ఈ సినిమా నుండి సినీ అభిమానుల్ని థియేటర్ లకు దూరం చేస్తాయి.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

రివ్యూ :  అవద్ ఎం
అనువాదం : వంశీ కృష్ణ

CLICK HERE FOR ENGLISH REVIEW

సంబంధిత సమాచారం :