సమీక్ష : దమ్ము – ఎన్టీయార్ హై వోల్టేజ్ ఎంటర్ టైనర్

విడుదల తేది : 27 ఏప్రిల్ 2012
123తెలుగు.కాం రేటింగ్: 3.25/5
దర్శకుడు : బోయపాటి శ్రీను
నిర్మాతలు : అలెగ్జాండర్ వల్లభ
సంగీత దర్శకుడు: కీరవాణి
తారాగణం : ఎన్ టి ఆర్, త్రిష, కార్తిక

యంగ్ టైగర్ ఎన్టీయార్ మాస్ ఎమోషనల్ డ్రామా “దమ్ము” చిత్రం ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో త్రిష మరియు కార్తీక కథానాయికలుగా నటించారు ఎం ఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించారు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ మీద ఏ.వల్లభ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పుడు ఈ చిత్రం ఎలా ఉండదో చూద్దాం.

కథ:

విజయ్(ఎన్టీయార్) అలీ తో కలిసి మామూలు జీవితం గడిపే అనాథ. అతను అశ్విని(త్రిష)తో ప్రేమలో పడతాడు అశ్విని పెట్టిన షరతు ప్రకారం ఒక పెద్ద కుటుంభం దత్తత తీసుకుంటారని తెలిసి ఎన్టీయార్ ఆ అవకాశాన్ని చేజిక్కించుకుంటాడు. కాని అక్కడికి వెళ్ళాక ఆ కుటుంభానికి గతంలో ఉన్న కుటుంబ కలహాల గురించి నాజర్ కుటుంబంతో ఉన్న వైరం గురించి తెలుసుకుంటాడు. కొన్ని వేల మంది జీవితాలు తన మీద ఆధారపడి ఉందని కూడా తెలుసుకుంటాడు. హింస నచ్చని విజయ్ శాంతియుతంగా సమస్యలను పరిష్కరించాలని ప్రయత్నిస్తుంటాడు. కాని ప్రతినాయక బృందం అతనికి ఆ అవకాశం ఇవ్వదు. విజయ్ ఎం చేశాడు? ఆ కుటుంభ బాధ్యతలను భుజాన వేసుకున్నడా లేదా? అశ్విని నిజంగా విజయ్ ని ప్ర్రేమించిందా లేదా? అనేది మిగిలిన కథ.

ప్లస్:

ఎన్టీయార్ నటన అద్బుతంగా ఉంది చాలా రోజుల తరువాత అద్బుతమయిన ప్రదర్శన కనబరిచారు. శక్తీ వంతమయిన డైలాగ్ డెలివరితో ,యాక్షన్ సన్నివేశాలతో అభిమానులను మరియు సినిమా ప్రేమికులకు కన్నుల పండుగ. రెండవ అర్ధ భాగం లో ఖద్దర్ దుస్తులు ధరించాక కళ్ళు తిప్పుకోనివ్వలేదు. ఈ చిత్రంతో తారక్ అద్బుతమయిన డాన్సర్ అని మరో సారి నిరూపించారు.

త్రిష చాలా అందంగా కనిపించింది మంచి ప్రదర్శన కనబరిచింది. కాని ఆశ్చర్యకరంగా ఈ భామకు నటించడానికి ఎక్కువగా ఆస్కారం దొరకలేదు. కార్తీక తన డైలాగ్స్ మరియు ప్రదర్శనతో ఆకట్టుకుంది. కోట శ్రీనివాస్ రావు అద్బుతమయిన నటన చూపించారు. వేణు చిన్న పాత్రే అయిన వినోదాన్ని పంచాడు. అలీ పరవాలేదనిపించాడు.
నాజర్ మరియు భాను ప్రియ అద్బుతంగా నటించారు. వారి అనుభవాన్ని రంగరించి ప్రదర్శించిన ప్రదర్శన అద్బుతం నాజర్ క్రూరమయిన ప్రతినాయకుడిగా ఆకట్టుకున్నారు. సుమన్ పరవాలేదనిపించాడు. చిత్రం లో కొన్ని మంచి సన్నివేశాలున్నాయి. ఇంటర్వల్ కి వచ్చ్చే సన్నివేశం అద్బుతంగా తెరకెక్కించారు చిత్రం లో కీలకమయిన మలుపులు చాలా బాగా ఉన్నాయి. పోరాట సన్నివేశాలకు కీరవాణి ఇచ్చిన నేఫధ్య సంగీతం సన్నివేశాలకు ప్రాణం పోసినట్టు అనిపించింది . బురదలో చిత్రీకరించిన పోరాటం అయితే అద్బుతంగా అనిపించింది.

మొదటి అర్ధ భాగం ఎన్టీయార్ మరియు అలీ పంచిన వినోదంతో వేగంగా అనిపిస్తుంది.

మైనస్:

చిత్ర కథలో కొత్తదనం కనిపించలేదు. త్రిష మరియు ఎన్టీయార్ మధ్య నడిపిన ప్రేమ కథ మరింత బాగా చూపించి ఉండాల్సింది. త్రిష పాత్రను సరిగ్గా చూపించలేదు. ఇలానే ఎన్టీయార్ మరియు కార్తీక ల నడుమ ప్రేమ కథను కూడా సరిగ్గా చూపించలేకపోయారు. కొన్ని ద్వందార్ధ సంభాషణలు తప్ప కార్తీక పాత్రలో చెప్పుకోడానికి ఏమి లేదు. బ్రహ్మానందం పాత్ర వృధా చేశారనిపిస్తుంది. రెండవ అర్ధ భాగంలో కథనాన్ని మరింత వేగంగా నడిపించుండాల్సింది. వాస్తు బాగుందే పాట సరయిన సమయం లో రాలేదనిపిస్తుంది. రెండవ అర్ధ భాగం నెమ్మదిగా సాగినట్టు అనిపిస్తుంది. కథ సాగే కొద్ది కథనం నెమ్మదించింది.

సాంకేతిక అంశాలు :

సినిమాటోగ్రఫీ చాలా బాగుంది ఎడిటింగ్ పరవాలేదు. రత్నం అందించిన సంభాషణలు ముందు వరుస వారికి మరియు అభిమానులకు నచ్చుతుంది. చిత్రం లో ఎన్టీయార్ రాజకీయ ఆగమనం గురించి పలు సార్లు ప్రస్తావించారు. కీరవాణి అందించిన సంగీతం మరియు నేఫద్య సంగీతం చిత్రానికి ప్రాణం పోసింది. రామ్-లక్ష్మణ్ అందించిన ఫైట్స్ చాలా బాగున్నాయి. డాన్స్ ఎన్టీయార్ కి తగ్గట్టు చాలా బాగా అందించారు. చిత్ర్రానికి అందించిన నిర్మాణ విలువలు అద్బుతం బోయపాటి దర్శకత్వం ఆకట్టుకుంది స్క్రీన్ ప్లే రెండవ అర్ధ భాగం లో శ్రద్ద తీసుకొని ఉంటె బాగుండేది. మొదటి అర్ధ భాగానికి అందించిన స్క్రీన్ ప్లే చాలా బాగుంది.

తీర్పు:

“దమ్ము” చిత్రం అభిమానులు మరియు సినిమా ప్రేమికులను ఆకట్టుకుంటుంది. చాలా రోజుల తరువాత తారక్ నుండి అద్బుతమయిన ప్రదర్శన చూశాము. చిత్రాన్ని తన భుజాల మీద మ్రోసాడు. పోరాటాలు మరియు సంభాషణలు ఈ చిత్రాన్ని బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టుతుంది. చిత్రం రెండవ అర్ధ భాగం నేమ్మదించడం ఈ చిత్రానికి పెద్ద మైనస్. దమ్ము ఈ సెలవుల్లో వినోదాన్ని పంచె చిత్రంగా చెప్పుకోవచ్చు.

123తెలుగు.కాం రేటింగ్ :3.25/5

అనువాదం : రv

Clicke Here For ‘Dhammu’ English Review

సంబంధిత సమాచారం :