సమీక్ష : “రచ్చ” – మాస్ మసాలా ఎంటర్ టైనర్

విడుదల తేది :05 ఏప్రిల్ 2012
123తెలుగు.కాం రేటింగ్: 3/5
దర్శకుడు : సంపత్ నంది
నిర్మాత : ఎన్ .వి .ప్రసాద్, పారస్ జైన్
సంగీత దర్శకుడు : మణి శర్మ
తారాగణం : రామ్ చరణ్ తేజ, తమన్న

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ ఈరోజు మాస్ మసాల యాక్షన్ ఎంటర్ టైనర్ ” రచ్చ” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తమన్నా కథానాయికగా నటించిన ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహించారు. మెగా సూపర్ గుడ్ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఈరోజే విడుదలయ్యింది ఇప్పుడు ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.

కథ :

బెట్టింగ్ రాజ్(రామ్ చరణ్ తేజ) డబ్బులు కోసం బెట్టింగ్ చేస్తూ ఉండే ఒక బస్తి కుర్రాడు. తనను దత్తత తీసుకున్న తల్లితండ్రులు (ఎం ఎస్ నారాయణ మరియు సుధా) దగ్గర పెరుగుతూ జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఒకానొక పరిస్థితిలో రాజ్ కి ఇరవై లక్షలు ఖచ్చితంగా సంపాదించాల్సిన అవసరం ఏర్పడుతుంది. అలా డబ్బులు కోసం వెతుక్కుంటూ జేమ్స్(అజ్మల్)ని చేరుతాడు. చైత్ర(తమన్నా)ను ప్రేమలో దింపాలని అజ్మల్ రాజ్ తో చాలెంజ్ చేస్తాడు. చైత్ర గనుల పరిశ్రమలో శక్తివంతమయిన వ్యక్తి బళ్లారి(ముకేశ్ రుషి) కూతురు. డబ్బులు చాలా అవసరమయిన రాజ్ ఈ చాలెంజ్ ని స్వీకరిస్తాడు
కొంత కాలం గడిచాక చైత్ర కూడా రాజ్ ప్రేమకు స్పందిస్తుంది. ఇక్కడ కథ మలుపు తిరుగుతుంది రాజ్ కి తనకు తెలియని ఒక ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టు తమన్నాకు తనకు తెలియని ఒక విషయం తన వెనక నడుస్తుంది. కథ నడుస్తున్న కొద్ది రాజ్ తన ప్రతిజ్ఞను నిలబెట్టుకోవడానికి పోరాడుతూ ఉంటాడు. ఏంటా ప్రతిజ్ఞ? చైత్ర వెనక ఉన్న కథ ఏంటి? అనేది మిగిలిన కథ.

ప్లస్:

రాజ్ పాత్రలో చరణ్ అద్బుతంగా నటించారు. తను చేసిన డాన్స్ మరియు ఫైట్స్ చాలా బాగా వచ్చాయి నటుడిగా చాలా మెరుగు పడ్డారు. ఈ పాత్రకు సరిగ్గా సరిపోయారు అనిపించారు. తమన్నా తన అందాలతో అందరిని ముగ్ధులను చేసింది. తనకు ఇచ్చిన పాత్ర మేరకు తనవంతు న్యాయం చేసింది. అజ్మల్ చిన్న పాత్రలోనే కనిపించారు పరవాలేదు అనిపించారు. పార్తివన్ తెర మీద అద్బుతంగా కదిలినా ఆయన నటనకు పెద్దగా ఆస్కారం లేని పాత్ర. బళ్ళారిగా ముఖేష్ రుషి అద్బుతంగా చేశారు.బ్రహ్మానందం రంగీలా పాత్రలో అందరిని నవ్వించారు. అలీ మరియు జయప్రకాశ్ నారాయణలు చిన్న పాత్రలే చేసిన ప్రేక్షకులను బాగా నవ్వించారు. జబ్బుపడిన తండ్రిగా ఎం ఎస్ నారాయణ పరవాలేదనిపించాడు. కొన్ని ద్వందార్దాలున్న సంభషణలు మాస్ జనంకి బాగా నచ్చుతాయి.. “దిల్లకు దిల్లకు” సాంగ్ లో రామ్ చరణ్ డాన్స్ అద్బుతంగా ఉంటాయి. పంచ్ ఉన్న కొన్ని సంభాషణలు అభిమానులకి మరియు మాస్ జనంకి బాగా నచ్చేస్తాయి.

మైనస్:

చిత్ర కథను ఇట్టే పసిగట్టేయచ్చు కొత్తగా ఏమి కనిపించదు కథలో. రెండవ అర్ధంలో ప్రతీకారం కథలో ప్రవేశించాక మాస్ పాళ్ళు కాస్త ఎక్కువయ్యింది. చిత్ర కథనంలో అసలు లాజిక్ కనిపించదు కొన్ని సన్నివేశాల్లో మరీ తెలిసిపోయేలా ఉంటుంది ఉదాహరణకు తమన్నా మరియు రామ్ చరణ్ ను ముఖేష్ రుషి మనుషులు తరుముకుంటూ భారతీయ అడవుల్లోకి ప్రవేశిస్తారు కాని కాసేపయ్యాక సన్నివేశం చైనా బాంబూ ఫారెస్ట్ కి మారిపోతుంది అక్కడికి చైనీస్ ఫైటర్లు ఎలా వచ్చారో సమాధానం లేని ప్రశ్న.నాజర్, ఝాన్సీ, సత్య కృష్ణ, కృష్ణ భగవాన్, వేణు మాధవ్ మరియు శ్రీనివాస రెడ్డి పాత్రలు పెద్దగా ఉపయోగించుకోలేకపోయారు. రెండవ అర్ధంలో పాటలు సరయిన సమయంలో రాలేదు.

సాంకేతిక అంశాలు:

చిత్రంలో సంభాషణలు చాలా బాగున్నాయి మాస్ జనంకి బాగా నచ్చేలా ఉన్నాయి. ఫైట్స్ మరియు డాన్స్ అద్బుతంగా కోరియోగ్రఫీ చేశారు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఇంకా బాగుండాల్సింది. సంపత్ నంది దర్శకత్వంలో చిత్రానికి న్యాయం చేశాడు. మాస్ మీదే దృష్టి పెట్టిన ఇతను ఆ విషయంలో విజయం సాదించాడు.రెండవ అర్ధ భాగం మీద ఇంకాస్త శ్రద్ద తీసుకొని ఉండాల్సింది

తీర్పు :

రచ్చ పూర్తి మాస్ జనం ని లక్ష్యంగా చేసుకొని చేసిన ఈ చిత్రం ఆ విషయంలో పూర్తి న్యాయం చేసింది. కమ్మర్షియల్ అంశాలు నిండుగా ఉన్న ఈ చిత్రం బి మరియు సి కేంద్రాలలో భారీ విజయం సాదిస్తుంది. తమన్నా మరియు రామ్ చరణ్ తేజ్ లు వారి నటనతో ఆకట్టుకున్నారు. రెండవ అర్ధ భాగంలో కథనం ఎడిటింగ్ ఇంకాస్త బాగుంటే చిత్రం మరోలా ఉండేది. ఇంకొక రెండు వారల వరకు ఎటువంటి పోటి లేదు కాబట్టి ఈ చిత్రం కమ్మర్షియల్ గా విజయం సాదిస్తుంది.

123తెలుగు.కాం రేటింగ్ : 3/5

Clicke Here For ‘Raccha’ English Review

అనువాదం – రవి

సంబంధిత సమాచారం :