సమీక్ష : “ఎస్5 – నో ఎగ్జిట్” – బోరింగ్ థ్రిల్లర్

సమీక్ష : “ఎస్5 – నో ఎగ్జిట్” – బోరింగ్ థ్రిల్లర్

Published on Dec 31, 2022 3:05 AM IST
S5 (No Exit) Movie-Review-In-Telugu

విడుదల తేదీ : డిసెంబర్ 30, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు: సాయి కుమార్, తారకరత్న, ప్రిన్స్, సునీల్, అలీ, అవంతిక, మెహబూబ్ దిల్సే, ఫిష్ వెంకట్, రఘు

దర్శకుడు : సన్నీ కోమలపాటి

నిర్మాత : ఆదూరి ప్రతాప్ రెడ్డి

సంగీత దర్శకులు: మణి శర్మ

సినిమాటోగ్రఫీ: గరుడవేగ అంజి

ఎడిటర్: గ్యారీ బి హెచ్

 

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

ఈ వారం థియేటర్స్ లోకి చాలానే చిత్రాలు రిలీజ్ కి వచ్చాయి మరి ఆ చిత్రాల్లో సాయికుమార్, నందమూరి తారకరత్న, ప్రిన్స్, ఆలీ, సునీల్ తదితరులు నటించిన ఓ థ్రిల్లర్ చిత్రం “ఎస్ – 5 నో ఎగ్జిట్” కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఎంతమేర ఆకట్టుకుందో సమీక్షలో చూద్దాం రండి.

 

కథ :

 

ఇక కథలోకి వస్తే.. రాష్ట్ర సీఎం సుబ్రహ్మణ్యం నాయుడు(సాయికుమార్) కొడుకు సుబ్బు(తారకరత్న) తన తండ్రి పొలిటికల్ కెరీర్ కాపాడేందుకు ఎంత దూరం అయినా వెళ్తాడు. మరి ఇంత ప్రేమించే కొడుకు కోసం సుబ్రహ్మణ్యం నాయుడు ఓ ట్రైన్ మొత్తాన్ని బుక్ చేసి తన పార్టీ చేసుకోడానికి ఇస్తాడు. అయితే ఈ ట్రైన్ లో మిస్టేక్ గా సన్నీ(ప్రిన్స్) తన స్నేహితులతో ఎక్కేస్తాడు. మరి ఈ తర్వాత ట్రైన్ లో అనూహ్యంగా మనుషులు మిస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. పైగా బయటకి వెళ్ళడానికి అన్ని దారులు మూసుకుపోతాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏమవుతుంది? ఈ మిస్సింగ్ వెనుక ఎవరున్నారు? వారు బయటకి వస్తారా లేదా సుబ్బు, సన్నీ లు ఎదురైతే ఏమవుతుంది అనేది తెలియాలి అంటే ఈ సినిమా చూడాలి.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ సినిమాలో సీనియర్ నటుడు సాయికుమార్ తన పాత్రలో డీసెంట్ నటనతో ఆకట్టుకున్నారని చెప్పాలి. ఓ రకంగా తన పాత్ర లిమిటెడ్ గానే ఉన్నా అందులో కూడా తనదైన పెర్ఫామెన్స్ ని తాను ఎప్పటిలానే అందించారు. ఇక తన కొడుకు సుబ్బు గా కనిపించిన నందమూరి తారక రత్న అయితే మరోసారి తన సాలిడ్ పెర్ఫామెన్స్ తో ఇంప్రెస్ కంప్లీట్ డిఫరెంట్ లుక్ తో కనిపించి తన తండ్రిని పిచ్చిగా ప్రేమించే కొడుకుగా యారోగెంట్ యాటిట్యూడ్ తో ఇంప్రెస్ చేసాడు.

అలాగే యాక్షన్ సీన్స్ లో కూడా తాను బాగున్నాడు. ఇక సినిమాలో కాస్త బాగుండే అంశం ఏదన్నా ఉంది అంటే అది అక్కడక్కడా ఉన్న కామెడీ సీన్స్ అని చెప్పాలి. ఇవి సినిమాలో డీసెంట్ గా పలు చోట్ల ఆకట్టుకుంటాయి. అలాగే పలు సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ చిత్రంలో కాన్సెప్ట్ కొందరికి కొంచెం అనిపించినా దీనిని థ్రిల్లింగ్ గా నడపడంలో మాత్రం దర్శకుడు విఫలం అయ్యాడు. ఎప్పుడైతే సినిమా ఆసక్తిగా మారింది అనుకునే లోపే సినిమా బోర్ గా మారిపోవడం మొదలవుతుంది. ఇక ఈ సినిమాలో కమెడియన్, ఆలీ, సునీల్ లాంటి స్టార్ కమెడియన్ లు ఉన్నారు అయినా కూడా అలాంటి వారితో సరైన కామెడీ ఎక్కడా కనిపించదు. పైగా సినిమాలో చాలా లాజిక్ లెస్ సీన్స్ ఉన్నాయి. అవి చూస్తుంటే మరీ ఇంత సెన్స్ లేకుండా చూపిస్తారా అనిపించక మానదు. సినిమా నిజ వాతావరణం చూస్తే ఎక్కడైనా ఇలా ట్రైన్ లో జనం మిస్ అవుతున్నారు అంటే వేరే వాళ్ళు టెన్స్ అయ్యి కాపాడే ప్రయత్నం చేస్తారు కానీ ఇక్కడ పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇక వీటితో పాటుగా సినిమాలో స్క్రీన్ ప్లే కూడా అంత ఎంగేజింగ్ గా ఉండదు. చాలా సీన్స్ లో చాలా గ్రాఫికల్ వర్క్ చాలా లో క్వాలిటీ లో కనిపిస్తుంది. బెటర్ ఈ సీన్స్ తీసేసినా బాగుండేది. అలాగే యంగ్ నటుడు ప్రిన్స్ కి ఈ సినిమాలో పెద్ద ప్రాధాన్యత కూడా లేదు. ఇలా చాలా అంశాల్లో అయితే ఈ చిత్రం ఆకట్టుకోదు.

 

సాంకేతిక వర్గం :

 

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు పూర్తి స్థాయిలో ఆకట్టుకునేలా లేవని చెప్పాలి. ఆ ట్రైన్ సెటప్ అంతా బాగానే ఉంటుంది కానీ టెక్నీకల్ టీం లో వి ఎఫ్ ఎక్స్ మీద ఇంకా ఎక్కువ వర్క్ చేయాల్సి ఉంది. డైలాగ్స్ పర్వాలేదు. మణిశర్మ ఇచ్చిన స్కోర్ చాలా సీన్స్ లో సాలిడ్ గా ఉంది. ఎడిటింగ్ ఇంకా బెటర్ గా చేయాల్సి ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది.

ఇక దర్శకుడు సన్నీ కోమలపాటి విషయానికి వస్తే.. తాను నరేషన్ పరంగా ఇంకా ఎక్కువ జాగ్రత్తలు వహించి ఉంటే ఈ థ్రిల్లర్ రిజల్ట్ మరో రకంగా వచ్చేది. లాజిక్స్ బాగా తాను మిస్ చేశారు. ఓవరాల్ గా అయితే తన వర్క్ సినిమాకి బాగోలేదు.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ “ఎస్5 – నో ఎగ్జిట్” లో ఒక్క సాయి కుమార్, తారకరత్న, కొన్ని కామెడీ సీన్స్ ఏమాత్రం సినిమా ఎక్కడా ఆకట్టుకోదు. దర్శకుని పూర్తి వైఫల్యం అయితే సినిమాలో క్లియర్ గా కనిపిస్తుంది. ఇంకా బెటర్ గా ఈ థ్రిల్లర్ ని ప్రెజెంట్ చేసి ఉంటే కాస్తయినా సినిమా సేవ్ అయ్యి ఉండేది. ఈ వారాంతానికి అయితే ఈ సినిమాని స్కిప్ చేసేయడం బెటర్.

123telugu.com Rating: 2/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు