సమీక్ష : “సామజవరగమన” – ఎంటర్టైనింగ్ గా సాగే ఫ్యామిలీ డ్రామా !

సమీక్ష : “సామజవరగమన” – ఎంటర్టైనింగ్ గా సాగే ఫ్యామిలీ డ్రామా !

Published on Jun 30, 2023 3:01 PM IST
Samajavaragamana Telugu Movie Review

విడుదల తేదీ : జూన్ 29, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు: శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్, నరేష్, సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్ తదితరులు

దర్శకుడు : రామ్ అబ్బరాజు

నిర్మాత: రాజేష్ దండా

సంగీతం: గోపీ సుందర్

సినిమాటోగ్రఫీ: రాంరెడ్డి

ఎడిటర్: ఛోటా కె ప్రసాద్

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ జంటగా నటించిన తాజా చిత్రం సామజవరగమన. ఈ సినిమా ప్రీమియర్స్ పడ్డాయి. మరి ప్రేక్షకులును ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

బాలు (శ్రీవిష్ణు) ప్రేమలో విఫలం అయ్యి, ప్రేమ పైనే నెగిటివ్ అభిప్రాయంతో ఉంటాడు. ఈ క్రమంలో తనకు ఎవ‌రైనా అమ్మాయి ఐల‌వ్ యూ చెబితే వెంట‌నే రాకీ క‌ట్టించుకుంటుంటాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో బాలుకి స‌ర‌యు (రెబా మౌనికా జాన్‌) తో ప‌రిచ‌యం అవుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. బాలు కూడా ఆమెతో ప్రేమలో పడతాడు. అదే స‌మ‌యంలో బాలు అత్త‌య్య కొడుక్కి సరయు అక్కతో పెళ్లి కుదురుతుంది. దీంతో బాలు, స‌ర‌యు ప్రేమకు పెద్ద అడ్డంకి వచ్చి పడుతుంది. చివరకు వీరి ప్రేమ కథలో ఎలాంటి ట్విస్ట్ లు చోటు చేసుకున్నాయి?, ఈ మధ్యలో స‌ర‌యు తండ్రి(శ్రీకాంత్ అయ్యంగార్‌) పాత్ర ఏమిటి?, అలాగే బాలు తండ్రి (సీనియ‌ర్ న‌రేష్‌) డిగ్రీ పాస‌యితే కోట్ల ఆస్తి ద‌క్కేలా అత‌ని తాత‌య్య రాసిన వీలునామా ఏమిటి? చివరకు ఏం జరిగింది? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించిన శ్రీవిష్ణు తన నటనతో సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఇక సినిమాలో సీనియర్ నరేష్ ట్రాక్, అలాగే శ్రీకాంత్ అయ్యంగార్ ఫ్యామిలీ ట్రాక్, మరియు కామెడీ సన్నివేశాలు.. అదేవిధంగా హీరోహీరోయిన్లు అనుకోని సంఘటనలతో చిక్కుకునే సన్నివేశాలు.. అలాగే ఆ సమస్యల నుంచి హీరో తప్పించుకోవడానికి ప్రయత్నించే సన్నివేశాలు బాగా అలరిస్తాయి. ఆ సన్నివేశాల్లో శ్రీ విష్ణు కూడా చాలా బాగా నటించాడు.

ముఖ్యంగా సెకెండ్ హాఫ్ లో వచ్చే ఫ్యామిలీ సన్నివేశాల్లో మంచి కామెడీని పండించారు. ఇక మరో ప్రధాన పాత్రలో నటించిన సీనియర్ నరేష్ కూడా అద్భుతమైన నటనతో చాలా బాగా నటించారు. డిగ్రీ పాస్ కాలేని సగటు మిడిల్ క్లాస్ తండ్రిగా నరేష్ నటన సినిమాలోనే మెయిన్ హైలైట్ గా నిలిచింది. హీరోయిన్ గా నటించిన రెబా మౌనికా జాన్ కూడా ఆకట్టుకుంది. తన గ్లామర్ తో పాటు తన నటనతోనూ ఆమె మెప్పించింది.

ఇక ఎప్పటిలాగే కీలక పాత్రల్లో కనిపించిన శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్ తమ కామెడీ టైమింగ్‌ తో బాగా నవ్వించారు. ఈ పాత్రలను కూడా కథకు టర్నింగ్ పాయింట్ గా దర్శకుడు చాల బాగా రాసుకున్నాడు. సినిమా చివర్లో వచ్చే ట్విస్ట్ కూడా బాగుంది. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా చేశారు.

 

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ సినిమాలో చాలా క్యారెక్టర్స్ చాలా ప్లాట్ పాయింట్స్ పెట్టి మంచి ఫన్ రాబట్టినప్పటికీ.. కొన్ని సన్నివేశాలను స్లోగా నడిపారు. మొయిన్ గా సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ స్లోగా సాగుతూ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోవు. అలాగే ఫస్ట్ హాఫ్ లో సినిమాలోని పాత్రలను పరిచయం చెయ్యడానికే కూడా దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు.

అదే విధంగా పాత కాలపు మిస్ అండర్ స్టాడింగ్ కామెడీతో (అక్కడక్కడా బాగా నవ్వించినా) ఇప్పటికే చాలా సినిమాల్లో ఇలాంటి కామెడీని చూసేసాం కదా భావన కలుగుతుంది. అయితే ప్రేక్షకులు మాత్రం మనస్ఫూర్తిగా సినిమాలో చాలా సార్లు నవ్వుకుంటారు. ఇక సీనియర్ నరేష్ క్యారెక్టర్ ను మొదట్లో బాగా ఎలివెట్ చేసి ఆ తర్వాత గెస్ట్ రోల్ లా ఆ పాత్రను కుదించారు.

 

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. కామెడీ సన్నివేశాలను దర్శకుడు రామ్ అబ్బరాజు బాగా తెరకెక్కించారు. గోపీ సుందర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు బాగా ప్లస్ అయింది. సినిమాలోని చాలా సన్నివేశాలను రాంరెడ్డి చాలా బ్యూటిఫుల్ గా చిత్రీకరించారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటింగ్ కూడా బాగుంది. నిర్మాత రాజేష్ దండా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆయన నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

 

తీర్పు :

సామజవరగమన అంటూ వచ్చిన ఈ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సరదాగా సాగుతూ ఆకట్టుకుటుంది. సినిమాలోని ప్రధాన పాత్రలు, ఆ పాత్రల మధ్య డ్రామా, మరియు నటీనటుల నటన.. మొత్తమ్మీద దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ సినిమాను ఎంటర్ టైన్ గా నడిపాడు. కాకపోతే, సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు స్లోగా సాగడం, అలాగే కొన్ని సీన్స్ రెగ్యులర్ గా ఉండటం వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఐతే, ఓవరాల్ గా ఈ సినిమా చూసి ప్రేక్షకులు మనస్ఫూర్తిగా నవ్వుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది.

 

123telugu.com Rating: 3.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు